వారసత్వం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా, ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ, అటు కమర్షియల్ సినిమాలని, ఇటు ప్రయోగాత్మక సినిమాలని బాలన్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగ చైతన్య.
జోష్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాగ చైతన్య. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వకపోయినా కూడా, మొదటి సినిమాతో ఒక ప్రయోగం చేసినందుకు నాగ చైతన్యకి మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత చేసిన ఏ మాయ చేసావే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడంతో పాటు నటుడిగా నాగ చైతన్యని ఒక మెట్టు ఎక్కించింది. ఆ తర్వాత వచ్చిన 100% లవ్ సినిమా నాగ చైతన్యకి ఇంకా గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ ఉన్నా కూడా, ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత కొంత కాలం నుండి నాగ చైతన్యకి సరైన హిట్ లేదు. గత సంవత్సరం వచ్చిన థాంక్యూ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఇటీవల వచ్చిన కస్టడీ సినిమా కూడా అంచనాలని అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకుని మరి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మళ్లీ లవ్ స్టోరీ తర్వాత ఈ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్యతో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం నాగ చైతన్య గెటప్ కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకున్నారు. ఆ గెటప్ ఇవాళ బయటికి వచ్చేసింది. బేబీ సినిమా ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ నెక్స్ట్ సినిమా ఇవాళ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్, అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ వేడుకలో నాగ చైతన్య పాల్గొన్నారు.

గడ్డంతో నాగ చైతన్య చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇది చందు మొండేటి సినిమా కోసమే అని తెలుస్తోంది. ఈ సినిమాకి తండేల్ అనే పేరుని అనుకుంటున్నారు. అంతే కాకుండా నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే ఒక సిరీస్ కూడా చేశారు. ఈ సిరీస్ డబ్బింగ్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. నాగ చైతన్య కొత్త గెటప్ చూసిన అందరూ కూడా ఈ సారి హిట్ కొట్టేలాగా ఉన్నారు అని అంటున్నారు.
ALSO READ : ఒకప్పుడు ఈ 10 మంది టాప్ హీరోయిన్స్…కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఫేడ్ అవుట్.?

కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియంటల్ చిత్రాల్లో మెప్పించిన అనుష్క బాహుబలి తర్వాత జోరు తగ్గించిందని చెప్పాలి. ప్రస్తుతం సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తాజాగా అలరించింది.













నెపోలియన్ పాత్ర చేసిన నటుడు అసలు పేరు జార్జ్ మరియన్. చెన్నైలో పుట్టిన ఇతను 1989లో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. అలా 13 ఏళ్లపాటు ఇందులోనే కొనసాగాడు. 2002లో అళగి మూవీతో తమిళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఇప్పటివరకు 70 చిత్రాల్లో నటించాడు.ఖైదీ సినిమాలోని నెపోలియన్ అనే కానిస్టేబుల్ గా నటించిన జార్జ్ మరియన్ ఈ మధ్య రిలీజ్ అయిన లియో సినిమాలోనూ గెస్ట్ ఆపిరియన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో విజయ్ ఎంట్రీ కి ఎంత హంగామా చేశారో ఫాన్స్ నెపోలియన్ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అదే రేంజ్ రిసౌండ్ సృష్టించారు.



























సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నెక్కొచ్చుగా ఉండేవారట అలాగే సులువుగా ఎవరిని నమ్మేవారు కాదు చివరికి కారు పాడైతే మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ళు ముందే బాగు చేయాలంట సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారు. అయితే ఎంత తెలివైన వారైనా ఎక్కడ ఒకచోట మోసపోతారు అన్నట్టు నమ్మిన వాళ్లే ఆమెను మోసం చేశారు. అత్త పాత్రలో ఆమెను రీప్లేస్ చేసేవారు మరొకరు రారు.
1.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్:
2.సూపర్ స్టార్ మహేష్ బాబు:
3.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్:
4.జూనియర్ ఎన్టీఆర్:
5.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్:
6.విజయ్ దళపతి:
7.సూపర్ స్టార్ రజినీకాంత్:
8.కమల్ హాసన్:
9.షారూఖ్ ఖాన్:
10.రాకింగ్ స్టార్ యశ్:
11. రిషబ్ శెట్టి:
12. సల్మాన్ ఖాన్:
13. సూర్య:
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించిన ఈ స్టార్ హీరోల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.