రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. కొంత మంది సినిమా బాగుంది అంటే, కొంత మంది మాత్రం ఆశించిన స్థాయిలో లేదు అన్నారు.
ఏదేమైనా సరే రామ్ ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్న విధానం బాగుంది అని చాలా మంది అన్నారు. రామ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ సినిమాలో కనిపించారు. దీని కోసం రామ్ గెటప్ మొత్తం మార్చుకున్నారు. ఇలాంటి గెటప్ లో రామ్ ని అంతకుముందు చూడలేదు.

దాంతో ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుంది అని సినిమా చివరిలో ఒక టైటిల్ అయితే ఇచ్చారు. మరి ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా తెలియలేదు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో ఒక సినిమా, తమిళ్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తారు. అయితే స్కంద సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 14 రోజులు అయ్యింది. సినిమా కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే 14వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల షేర్, ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల షేర్ వచ్చినట్టు సమాచారం. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా 14.38 కోట్లు వసూలు చేయాలి.
ALSO READ : తండ్రి చనిపోయినా… ఆయన కలను నెరవేర్చిన మహిళా క్రికెటర్ “రేణుకా ఠాకూర్” గురించి ఈ విషయాలు తెలుసా.?

రోజా అసలు పేరు శ్రీ లతారెడ్డి. 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నవంబర్ 17న జన్మించారు. ఆ తరువాత కాలంలో వారి కుటుంబం హైదరాబాద్ కు వచ్చారు. రోజా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పొందారు. ఆమె ఇండస్ట్రీలో రాకముందు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నారు.
రోజా 1991 లో ప్రేమ తపస్సు అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత సర్పయాగం మూవీలో నటించింది. 1992 లో ఆర్ కె. సెల్వమణి దర్శకత్వంలో చెంబరుతి అనే మూవీ ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రాలు విజయం సాధించడంతో ఆమెకు వరుస సినిమాలలో నటించి, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, జగపతిబాబు, వినోద్ కుమర్, శ్రీకాంత్ వంటి హీరోలతో నటించింది. రజినికాంత్, శరత్ కుమార్, సత్యరాజ్, విజయ్ కాంత్, అర్జున్ సర్జా, మమ్ముట్టి, ప్రభుదేవా వంటి వారితో నటించి మెప్పించింది. 1991 నుండి 2002 వరకు హీరోయిన్ గా నటించింది. 2002 లో ఆగస్ట్ 21న కోలీవుడ్ దర్శకుడు ఆర్ కె. సెల్వమణిని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రోజా, సెల్వమణి వెడ్డింగ్ ఫోటోలను మీరు చూసేయండి..
2.


రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ సినిమా సప్త సాగర దాచే ఎల్లో. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సప్త సాగరాలు దాటి పేరుతో తెలుగులోకి డబ్ చేసి, రిలీజ్ చేశారు. డైరెక్టర్ హేమంత్ రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందించారు. రెండవ పార్ట్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఆ మూవీ టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు.
సెప్టెంబర్ 22 న రిలీజ్ అయిన సప్త సాగరాలు దాటి మూవీకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మను, ప్రియ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో మను జైలుకు వెళ్తాడు. అప్పుడు ఆమె ఎన్ని సంవత్సరాలైన అయిన హీరో కోసం వేచి చేస్తా అని చెప్తుంది.
కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. హీరోయిన్ హీరో కోసం ఎదురుచూస్తా అని చెప్పే డైలాగ్ కు సంబంధించిన వీడియోని ఒక యూజర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ‘మరి వెయిట్ చేసిందా’ అంటూ షేర్ చేశారు. ఆమె ముందు హీరో కోసం ఎదురుచూస్తా అని చెప్పి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.











స్కంద మూవీలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, పృథ్వీరాజ్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్కంద మూవీని దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ కంప్లీట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి.
హీరో రామ్ పోతినేని మాస్ మరియు యాక్షన్ లుక్‌తో ఆకట్టుకున్నారు. రామ్, శ్రీలీల డ్యాన్స్ మూవీలో హైలైట్‌గా నిలిచింది. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయని టాక్. రివ్యూలు కూడా మిశ్రమంగా రావడంతో స్కంద మూవీ ఆశించిన రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ను వసూల్ చేయలేకపోయిందని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే స్కంద మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 27 నుండి ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్కు కానుందని సమాచారం. అయితే ఈ విషయం పై డిస్నీ+ హాట్‌స్టార్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన జూన్ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన చాలా ఏళ్ల తరువాత మెగాఫ్యామిలీలోకి వారసురాలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాప వచ్చిన తరువాత జరిగే ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అయితే ఉపాసన సినిమాల విషయంలో తప్ప మిగితా విషయాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మెప్పు పొందుతున్నారు. ముఖ్యంగా ఆమె ఆహారం మరియు ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, జాగ్రత్తలు తరచూ సోషల్ మీడియా లో షేర్ చేస్తూనే ఉంటారు. ఉపాసన ఫిట్నెస్, ఆరోగ్యానికి సంబంధించిన ‘బిపాజిటివ్’ అనే మ్యాగజైన్‌ను సైతం ప్రారంభించారు.
ఉపాసన డైట్ సీక్రెట్స్..

స్టార్ హీరోల సినిమాలలో వారి నటన, ఫైట్స్, డ్యాన్స్ లతో పాటుగా వారు చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా అభిమానులను అలరిస్తాయి. ఒక సినిమాలోని డైలాగ్ ను మరో సినిమాలో అది కూడా ఒక స్టార్ హీరో చెప్పినప్పుడు ఆ డైలాగ్ ఆడియెన్స్ కు మరింతగా గుర్తుంటుంది. ఒకప్పుడు అంతగా పట్టించుకునేవారు కాదు. తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉండేది కాదు.
కానీ ఓటీటీలు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత గతంలో వచ్చిన సినిమాలను చూడడం, అవి ఆ తరువాత వచ్చిన చిత్రాలలో చూసినట్టుగా అనిపించగానే, ఆ వీడియోని సోషల మీడియాలో షేర్ చేయడం సాధారణం అయిపోయింది. ఇలాంటి వీడియోని ఒక యూజర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రభాస్ నటించిన రాఘవేంద్ర మూవీలోని డైలాగ్ కు సంబంధించిన వీడియో అది.
ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక యూజర్ రాఘవేంద్ర సినిమాలోని ఒక వీడియో క్లిప్ ను షేర్ చేశారు. ఆ వీడియోలో మురళీమోహన్ ఒక వ్యక్తితో “కరెంట్ తీగ చూడడానికి మామలుగానే ఉంటుంది. ఒక్కసారి దానిమీద చెయ్యి వేస్తే తెలుస్తుంది దాని పవర్ ఏమిటో” అంటూ చెప్తాడు. ఈ మూవీ 2003 లో రిలీజ్ అయ్యింది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కూడా కాస్త అటు ఇటుగా ఇలానే ఉంటుంది. ఈ డైలాగ్ పాపులర్ అయ్యింది. ఈ మూవీ 2011 లో రిలీజ్ అయ్యింది. రాఘవేంద్ర మూవీ నుండి కాపీ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తమన్నా భాటియా 1989లో డిసెంబర్ 21న ముంబైలో పుట్టి, పెరిగారు. ఆమె పదమూడు ఏళ్ళ వయస్సులో నటనలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఎన్నో స్టేజ్ షోలలో నటించింది. 2005 లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2006లో శ్రీ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో, కేడితో తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2007లో హ్యాపీ డేస్, కల్లూరి సినిమాలలోని ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.
ఈ రెండు సినిమాలలో తమన్నా కాలేజీ స్టూడెంట్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలు తమన్నాను టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి. అప్పటి నుండి ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తూ, కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఆమె తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించి, మెప్పించారు.
అయితే ఆమె కెరీర్ లో ఒకేఒక్క హీరో మాత్రమే తమన్నాకు హీరోగా, అన్నగా నటించారు. ఆ హీరో ఎవరంటే సుశాంత్. 2008లో కాళిదాసు మూవీతో సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా తమన్నా నటించింది. అయితే ఈ మూవీలో సుశాంత్, తమన్నాకు అన్నగా నటించారు.