ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, తాజాగా ఈ సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాడు.
69 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న తెలుగు హీరోగా నిలిచాడు. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బన్నీ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. బన్నీ సాధించిన విజయాలతో పాటు ఎదుర్కొన్న వివాదాలు కూడా వైరల్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. దేశముదురు వివాదం:
అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకటవంలో వచ్చిన సినిమా దేశముదురు. ఈ మూవీ ద్వారా హన్సిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. డి.వి.వి. దానయ్య ఈ సినిమాను నిర్మించారు. అయితే పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని విషయం వివాదాస్పదం అయ్యింది.
2. దువ్వాడ జగన్నాధం వివాదం:
అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాధం మూవీ 2017లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ బ్రహ్మణ యువకుడి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. అయితే బన్నీ పై బ్రహ్మణుల అగౌరపరిచారని విమర్శలు వచ్చాయి.
3. అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ వివాదం:
ఒక పబ్లిక్ ఈవెంట్ లో అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” అంటూ మాట్లాడారు. ఈ మాటలు పవన్ కళ్యాణ్ అగౌరవపరిచేలా ఉండడంతో ఈ విషయం వివాదంగా మారింది.
4. సరైనోడు వివాదం:
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ పై కాపీ రైట్ ఉల్లంఘనల ఆరోపణలు వచ్చాయి.
5. అల్లు అర్జున్ – భానుశ్రీ మెహ్రా వివాదం:
అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా వరుడు మూవీలో జంటగా నటించారు. అయితే అల్లు అర్జున్ ఆమెను ట్విట్టర్లో బ్లాక్
చేశారు. దాంతో ఆ విషయాన్ని భానుశ్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాంట్రవర్సీ గా మారింది.
4. రాపిడో యాడ్ వివాదం:
గత ఏడాది అల్లు అర్జున్ నటించిన రాపిడో యాడ్ విషయంలో వివాదం జరిగింది. ఆర్టీసిని కించపరిచేలా ఈ యాడ్ ఉందని ఆర్టీసి ఛైర్మెన్ సజ్జనార్ అల్లు అర్జున్ కు, రాపిడో సంస్థకి లీగల్ నోటీసులు పంపించాడు.
5. జొమాటో యాడ్ వివాదం:
అల్లు అర్జున్ నటించిన జొమాటో యాడ్ కూడా విమర్శలకు కారణమైంది. ఈ యాడ్ లో పుష్ప మూవీ మేనరిజమ్ చూపిస్తూ బన్నీ చెప్పిన డైలాగ్, సౌత్ సినిమాలను కించపరిచేలా ఉందని అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
6. విద్యా సంస్థ యాడ్ వివాదం:
ఒక విద్యా సంస్థ సంబంధించిన యాడ్ లో అల్లు అర్జున్ నటించాడు. కానీ ఈ యాడ్ తప్పుదోవ పట్టించేలా ఉందని,
అల్లు అర్జున్ మీద, ఆ విద్యాసంస్థ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైట్ చేశారు.
Also Read: “ఖుషి” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

వైష్ణవి చైతన్య పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగుతోంది. అయితే ఆమె ఈ మూవీకి ముందు ఆమె యూట్యూబర్ గా కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వాటి ద్వారానే వైష్ణవి చైతన్య సినిమాలలో అవకాశాలను పొందారు. అలా ఆమె కెరిర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించింది. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్యకు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ సినిమాలో హీరోయిన్ గా అవక్షం వచ్చింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ మూవీ హిట్ తో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన తొలి సినిమా విజయం సాధించడంతో తదుపరి చిత్రాలకు కండిషన్లు పెడుతున్నట్టు సమాచారం. రెండవ చిత్రానికి గాను వైష్ణవి చైతన్య దర్శక నిర్మాతలకు పలు షరతులు పెట్టారని, వాటికి అంగీకరిస్తేనే మూవీకి సైన్ చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.
సినిమాలకు తాను సైన్ చేయాలంటే అడ్వాన్స్ ముందుగానే చెల్లించాలని, ఒక్కో చిత్రానికి రూ. 2 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తేనే వారి చిత్రాలలో నటిస్తానని సూటిగా చెబుతున్నారని తెలుస్తోంది. అయితే వైష్ణవి చైతన్య రెండవ ఇలాంటి షరతులు పెట్టడంతో ఆమె పై పలువురు విమర్శలు చేస్తున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప మూవీ సెన్షేషనల్ విజయన్ని దక్కించుకుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో పుష్ప యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. అల్లు అర్జున్ తాజాగా ఫ్యాన్స్ కోసం పుష్ప-2 మూవీ షూటింగ్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుకుమార్, అల్లు అర్జున్ మూవీ స్క్రిప్ట్ గురించి చర్చిస్తూ కనిపించారు. అయితే అభిమానులు దాన్ని స్క్రీన్ షాట్ తీసి, సామాజిక మధ్యమాలలో షేర్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆస్క్రీన్ షాట్ లో కేశవ పాత్ర కోసం రాసినట్లుగా ఒక డైలాగ్ ఉంది. ‘ముందు అయితే నీకు, షెకావత్ కి గొడవ మచ్చా.. కానీ ఇప్పుడు సిండికేట్ కూడా ఇన్వాల్వ్ అయింది’ అని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డైలాగ్ వైరల్ గా మారింది. పుష్ప 2 మూవీలో పుష్పరాజ్ కు, షెకావత్ కు మధ్య వచ్చే సన్నివేశాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో చాలా లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా లీకైన డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. కేశవ్ పాత్రకే ఇటువంటి డైలాగు ఉంటే, హీరోకి ఏ రేంజ్ డైలాగులు ఉంటాయో అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన సంతోషంలో ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఈ డైలాగ్ తో మరింత సంతోషపడుతున్నారు.
అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ‘నా సామి రంగ’ పై అధికారికంగా ప్రకటన ఇస్తూ, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో విజయ్ బిన్నీను డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘పొరింజు మరియమ్ జోస్’ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
పోరింజు మరియం జోస్ మూవీ 2019లో విడుదల అయ్యింది. ఈ మూవీకి జోషి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో జోజు జార్జ్, నైలా ఉష, చెంబన్ వినోద్ జోస్ లు టైటిల్ రోల్స్ ను పోషించారు. త్రిసూర్‌లో 1980-1990ల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, పోరింజు(జోజు జార్జ్), మరియం(నైలా ఉష), జోస్(జోజు జార్జ్), ముగ్గురు చిన్నప్పటి నుండి స్నేహితులు, కలిసి చదువుతుంటారు. అయితే పోరింజు మరియంను ప్రేమిస్తాడు.
కానీ ఆమె తండ్రి బాగా డబ్బున్నవాడు కావడంతో పోరింజు, జోస్ లతో స్నేహం చేయవద్దని చెప్తాడు. అయితే మరియం కూడా పోరింజు ప్రేమిస్తుంది, కానీ అపార్థాల వల్ల వారు విడిపోతారు. ఇరవై ఏళ్ల తరువాత పొరింజు కసాయిగా పనిచేస్తుండగా, మరియం వడ్డీ వ్యాపారి అవుతుంది. జోస్, పోరింజులు ఎప్పటిలానే స్నేహితులు కొనసాగుతారు. ఆ గ్రామ చర్చిలో జరిగే పండుగలో జరిగిన ఒక సంఘటన వీరి ముగ్గురి జీవితాలను ఎలా మార్చింది అనేది కథ.
ఇక ‘నా సామి రంగ’ సినిమాలో తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ కానుంది. హీరోయిన్, తదితర వివరాలను త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది.



















విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఖుషి టీజర్, పాటలు,ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి స్పందన లభించింది. విజయ్, సమంతల మధ్య వచ్చే సీన్స్ యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టీజర్, ట్రైలర్ల చూస్తే తెలుస్తోంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంది.
అయితే ఈ మూవీ మొదటి రివ్యూ వచ్చేసింది. అది ఇచ్చింది ఎవరో కాదు. ఓవర్సీస్ సెన్సార్ మెంబర్ గా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో రివ్యూలు పెట్టె ఉమైర్ సంధు. తాజాగా ‘ఖుషి’ సినిమా చూసినట్టుగా చెప్పిన ఉమైర్ సంధు, ఈ మూవీ రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఆ ట్వీట్ లో “అవుట్ డేటెడ్ మరియు బోరింగ్ లవ్ స్టోరీ.విజయ్ దేవరకొండ సమంతల మధ్య కెమిస్ట్రీ పండలేదు. ఈ సినిమాలో సమంత వయసు మీద పడినట్టుగా కనిపిస్తోంది. సాగదీసిన కథాంశం, డల్ స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం, కథ చాలా వీక్ గా ఉందని, ఈ మూవీకి వెళ్లకుండా మీ డబ్బులు ఆదా చేసుకోండి” అని ఉమైర్ సంధు పేర్కొన్నాడు. ఫైనల్ గా ఈ మూవీకి రేటింగ్ 5 కి గాను 2 ఇస్తున్నట్టు ఆ ట్వీట్ ద్వారా వెల్లడించాడు.
తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుగారికి జాతీయ గుర్తింపు లభించింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆయన బొమ్మతో 100 రూపాయల స్మారక నాణెంను ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఈ నాణెంను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, ఎన్టీఆర్ కుటుంబీకులు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణలోని మింట్ కాంపౌండ్‌లో ఈ నాణేన్ని తయారుచేశారు. అయితే వ్యక్తి స్మారకార్థం రూపొందించిన మొదటి నాణెం ఎన్టీఆర్‌దే కావడం విశేషం. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు. ఈ నాణెంను నేడు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులోకి తెచ్చారు.
మొదటి విడతగా పన్నెండు వేల ఎన్టీఆర్ స్మారక నాణేలను ముద్రించారు. డిమాండ్ పెరిగితే మరిన్ని తయారు చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ చిత్రంతో వచ్చిన నాణెంను కొనడానికి ఎంతోమంది తెలుగువారు ఆసక్తి చూపుతున్నారు. ఈ నాణెం ధర 3500 నుండి 4000 వరకు ఉంటుందని మింట్ అధికారులు చెప్తున్నారు. ఈ నాణేన్ని కావాలనుకునవారికి, ప్యాక్ చేసి అందిస్తారు కాబట్టి ధరలో స్వల్ప తేడాలు ఉండవచ్చని వారు వెల్లడించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘బ్రో’ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించగా, పవన్ కళ్యాణ్ టైమ్ దేవుడు టైటాన్ పాత్రలో నటించి, మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలలో ‘ఓజీ’ ఒకటి. ఈ చిత్రానికి ప్రభాస్ తో ‘సాహో’ లాంటి భారీ బడ్జెట్ సినిమాని తీసిన దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘ఓజీ’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న ఈ మూవీ గ్లింప్స్ లేదా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫస్ట్ లుక్ లేదు అంటూ ఆకలితో ఉన్న చిరుత కోసం వెయిట్ చేద్దాం అని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో గన్ పట్టుకున్న చేతి పై ఒక టాటూ కనిపిస్తోంది. దీంతో ఆ టాటూ అర్ధం ఏమిటా అని నెటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ టాటూకు అర్ధం ఫైర్ పవర్ అని ఒక ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ బర్త్ డే రోజు టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
పై ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు జాసన్ సంజయ్. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ అయిన లైకా ప్రొడక్షన్స్ ద్వారా జాసన్ సంజయ్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై త్వరలో నిర్మించబోయే కొత్త చిత్రానికి జాసన్ సంజయ్ దర్శకత్వం వహించబోతున్నారని లైకా సంస్థ అధినేత అయిన సుభాస్కరన్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగినట్లు వెల్లడిస్తూ, ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ విషయం తెలిసిన అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అంత పెద్ద స్టార్ హీరో తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని అనుకుంటే, దర్శకుడిగా మారబోతున్నారా అని జాసన్ సంజయ్ అనూహ్య నిర్ణయం పట్ల షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతలా చర్చకు దారితీయడానికి కారణం జాసన్ సంజయ్ స్టార్ హీరో తనయుడు కావడమే. ఆయనెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. సౌత్ ఇండస్ట్రీలో ఆయనకుండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
విజయ్ సినిమాల కోసం అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లోను ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది మొదట్లోనే వారసుడు మూవీతో విజయం అందుకున్నవిజయ్ దళపతి, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఇక హీరో విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ అనే విషయం తెలిసిందే. జాసన్ సంజయ్ తాత మార్గంలో దర్శకుడిగా మారబోతున్నారు.
అప్పటిదాకా ప్రేమకథలు మరియు కమర్షియల్ సినిమాలు చేస్తున్న నాగార్జునను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నమయ్య సినిమాతో ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేశారు. ఈ మూవీ ప్రకటించిన సమయంలో అన్నమయ్యగా నాగార్జున అంటే ఎంతోమంది విమర్శించారు. కానీ మూవీ రిలీజ్ అయ్యి, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత అన్నమయ్య పాత్రలో నాగార్జునను తప్ప మరెవరిని ఊహించలేమనే ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీలో శ్రీ వెంకటేశ్వరస్వామిగా సుమన్ అదే స్థాయిలో పేరు, ప్రఖ్యాతులను పొందారు.
సుమన్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా అన్నమయ్య నిలిచింది. శ్రీ వెంకటేశ్వరస్వామిగా సుమన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. అయితే ఈ పాత్రకు ముందుగా అనుకున్నది సుమన్ ని కాదట. ఈ మూవీలో అన్నమయ్య వెంకటేశ్వరస్వామి పాదాలను మొక్కే సన్నివేశం ఉండడంతో రాఘవేంద్రరావు పెద్ద స్టార్ ని తీసుకోవాలని భావించి, హీరో శోభన్ బాబును సంప్రదించారట. కానీ అప్పటికే ఆయన సినిమాలు మానేసారు. పాత్ర నచ్చినప్పటికి, తిరిగి నటించాలని లేకపోవడంతో రిజెక్ట్ చేయలేక యాబై లక్షల పారితోషికం అడిగారంట.
అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం అవడంతో వద్దనుకున్నారంట. ఆ తరువాత నందమూరి బాలకృష్ణను ఆ పాత్ర కోసం సంప్రదించారంట. కానీ నందమూరి, అక్కినేని అభిమానుల మధ్య గొడవలు వస్తాయేమో అని వద్దనుకున్నారట.