కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో వరుస హిట్స్ సినిమాలను తెరకెక్కిస్తూ, తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవడంతో తన సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కు చేరువయ్యారు.
ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ టాప్ హీరో షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా జరిగిన ‘జవాన్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో షారూఖ్ ఖాన్ అట్లీ భార్య ప్రియా అట్లీ గురించి మాట్లాడడంతో ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆమె పలు సినిమాలలో ఒక నటించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కోలీవుడ్ దర్శకుడు అట్లీ రాజారాణి మూవీ ద్వారా దర్శకుడుగా మారాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో, డైరెక్టర్ గా వరుసగా చిత్రాలను రూపొందించాడు. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో తేరీ, మెర్సల్, బిగిల్ లాంటి చిత్రాలను తీసి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ వేడుకలో షారుక్ ఖాన్ మాట్లాడుతూ అట్లీ భార్య గురించి మాట్లాడడంతో ఆమె పేరు నెట్టింట్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు. అట్లీ భార్య పేరు ప్రియా అట్లీ. ఆమె అసలు పేరు కృష్ణ ప్రియా మోహన్. ఆమె కెరీర్ బుల్లితెర పై మొదలైంది. పలు సీరియల్స్ నటించి, ఆకట్టుకుంది. అలా ఆమెకు సింగం సినిమాలో అవకాశం వచ్చింది. ప్రియ నటించిన తొలి చిత్రం సింగం. తెలుగులో యముడుగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో అనుష్క సోదరిగా ఆమె నటించి, మెప్పించింది. ఆ తరువాత రాజారాణి, నా పేరు శివ, తేరితో పాటు ఆమె పలు తమిళ, మలయాళ సినిమాలలో నటించింది.
కృష్ణ ప్రియ ఎనిమిదేళ్ల పాటు దర్శకుడు అట్లీతో డేటింగ్ చేసిన తర్వాత 2014లో నవంబర్ 9న వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తరువాత “A ఫర్ యాపిల్ ప్రొడక్షన్” పేరుతో తన స్వంత ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించింది. ఆమె తన బ్యానర్ లో 2020లో మొదటి మూవీ అంధఘరం నిర్మించింది.
https://www.instagram.com/p/CaMzIGbhCgR/
Also Read: KUSHI REVIEW : “విజయ్ దేవరకొండ, సమంత” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


విజయ్ దేవరకొండ, సమంతలు మొదటిసారి హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి మూవీ ఈరోజు థియేటర్లో తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ట్రైలర్లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మ్యూజిక్ కన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.
ఈ సినిమాకు ఓవర్సీస్ నుండి మంచి టాక్ వస్తోంది. లోకల్‌గా కూడా పాజిటివ్ రిపోర్టులు ఎక్కువగా వస్తున్నాయి. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. లైగర్ మూవీ డిజాస్టర్ తో విజయ్ దేవరకొండ చాలారోజుల వరకు బయటికి రాలేదు. సమంత, డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా ఈ మూవీ విజయం కీలకంగా మారింది. శాకుంతలంతో సమంత, టాక్ జగదీష్ తో శివ నిర్వాణ ప్లాప్ లు అందుకున్నారు.
ఈ మూవీ కి ఎక్కడ చూసినా 2.5, లేదా 2.75 రేటింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లోకల్‌గా తపనిసరిగా త్రీ స్టార్ రేటింగ్ వచ్చేలా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా కూడా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఖుషి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మీద పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.



















జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అల్లు అర్జున్ కు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించారు. పుష్పరాజ్ మేనరిజం, నటనకు వరల్డ్ వైడ్ గా ప్రశంసలు వచ్చాయి.
ఏవీఎస్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. ఆయన మొదట పౌరోహిత్యం చేసేవారు. ఆ తరువాత విలేఖరిగా విజయవాడలో పనిచేశారు. ఆ టైమ్ లో ఏవీఎస్ ఆర్ధికంగా ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతలా అంటే ఒక్కొసారు తినడానికి కూడా డబ్బుల లేక ఇబ్బంది పడ్డారు. ఆయన ఆకలిని భరించలేక కిళ్లీ నమిలేవారట. మిమిక్రీ షోలు చేస్తూ డబ్బులు సంపాదించేవారంట. ఆ క్రమంలో ఒక షోలో దిగ్గజ దర్శకుడు బాపు ఏవీఎస్ చూసి ‘మిస్టర్ పెళ్ళాం’ మూవీలో అవకాశం ఇచ్చారు.
ఆ మూవీ హిట్ అవడంతో ఏవీఎస్ మంచి గుర్తింపు వచ్చి, వరుసగా సినిమాలలో అవకాశాలు రావడంతో కామెడియన్ గా, సహాయ నటుడిగా వందల సినిమాలలో నటించి మెప్పించారు. ఆయన సుమారు 750 చిత్రాలలో నటించారు. మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, సిసింద్రీ, మావిడాకులు, ఆవిడా మా ఆవిడే, జయం మనదేరా, వెంకీ, అదిరిందయ్యా చంద్రం, యమగోల మళ్ళీ మొదలైంది, బంగారం, బెండు అప్పారావు, శ్రీరామదాసు, సంక్రాంతి, రాధాగోపాళం వంటి ఎన్నో హిట్ చిత్రాలలో నటించి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
ఇది ఇలా ఉంటే, ఏవీఎస్ అల్లుడు కూడా టాలీవుడ్ లో ప్రముఖ నటుడుగా కొనసాగుతున్నాడు. ఆయన పేరు శ్రీనివాస్ చక్రవర్తి. అయితే పాపులర్ అయిన పేరు చింటు. అవును సినిమాలో చేసిన పాత్రకు గుర్తింపు వచ్చింది. చింటు వాల్తేరు వీరయ్య, బంగార్రాజు, తీస్ మార్ ఖాన్, ఎఫ్ 3, రాజా ది గ్రేట్ వంటి సినిమాలలో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాలుగు చిత్రాలను నిర్మించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని వుంది, ఇంద్ర చిత్రాలు బ్లాక్ బస్టర్లు హిట్ గా నిలిచాయి. కానీ ఆ తరవాత తీసిన ‘జై చిరంజీవ’ అంతగా ఆడలేదు. ఆ మూవీ తరవాత మళ్లీ చిరంజీవితో మూవీ చేయాలని అశ్వనీదత్ ప్రయత్నించారట. కానీ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదట.
అయితే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత ఖైదీ నం.150 మూవీతో విజయాన్ని సాధించారు. అదే సమయంలో దర్శకులు రాజ్ మరియు డీకే ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ కథతో ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ని కలిశారు. ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో చేయాలని అశ్వనీదత్ భావించి, ఫ్యామిలీమ్యాన్ స్క్రిప్ట్‌ని చిరంజీవికి వినిపించారు. అది చిరంజీవికి బాగా నచ్చిందట. కానీ ఇందులో హీరో గూఢచారి లాంటి పాత్ర కావడంతో చిరుకు నచ్చేసింది. అయితే హీరో క్యారెక్టర్ కు ఇద్దరు పిల్లలు ఉండడం చిరంజీవిని ఆలోచించేలా చేశాయి.
దాంతో ఈ విషయాన్ని దర్శకులు రాజ్ మరియు డీకేకు చెప్తే, పిల్లల పాత్రల్ని తొలగించడానికి కూడా సిద్ధం అయిపోయారు. అయితే చిరంజీవి అప్పుడే రీఎంట్రీ ఇవ్వడం, ఆ సమయంలో ఇలాంటి కథ తనకు సెట్ అవుతుందో లేదో అని పక్కన పెట్టారని నిర్మాత అశ్వనీదత్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది.