ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది. అలా భరత్ అనే నేను సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి రెండేళ్లయ్యింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.

ఈ సినిమాలో భరత్ సీఎం అయిన తర్వాత వసుమతి ని చూస్తాడు. తర్వాత వసుమతి తో మాట్లాడుతాడు. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వసుమతి, తన స్టడీలో భాగంగా భరత్ ఆఫీస్ కి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు ” ఇది కలలా ఉన్నదే” పాట వస్తుంది. కింద ఉన్న స్టిల్ ఆ పాట లోది. ఇక్కడ మీరు గమనిస్తే వెనకాల ఉన్న కార్స్ అన్ని బ్లాక్ కలర్ లో ఉన్నాయి.
ఇప్పుడు ఈ షాట్ గమనించండి. ఇది పైన మెన్షన్ చేసిన దానికి కంటిన్యూషన్ షాట్. కానీ రెండిట్లో తేడా ఏంటో ఈ పాటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఒక షాట్ లో బ్లాక్ కలర్ లో ఉన్న కార్స్, నెక్స్ట్ షాట్ లో వైట్ కలర్ లో ఉంటాయి.
మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. ఇలా సినిమాల్లో పొరపాట్లు జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక దానికి సంబంధించిన సన్నివేశాలను ఒకటే రోజు చిత్రీకరించరు.
వాళ్ల సమయాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి సీన్స్ షూట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే, యాక్టర్స్ ఒకటే గెటప్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు బహుశా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.












గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సినీ తారల చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పైన ఫోటోలో ఉన్న పిల్లల్లో ఒకర టాప్ హీరో ఉన్నారు. ఆ హీరోని గుర్తుపట్టగలరా? ఆయన ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఆ హీరోకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోలలో సైతం ఆయనకు అభిమానులు ఉన్నారు.
ఆ హీరో మాటలకు పదును ఎక్కువ. ఆయన పేరు ఆయన ఫ్యాన్స్ కు మంత్రం. కొందరికి బ్రాండ్. ఆయనకు టాలీవుడ్ లో ప్రాణాలిచ్చే ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కున్న ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఎప్పుడు సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతటా పవన్ నామస్మరణ జరుగుతోంది.
ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపిస్తూ, వైరల్ గా మారుతున్నాయి. అలా పవన్ చిన్నప్పటి పలు ఫోటోలు కూడా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తూన్న సినిమాల నుండి కూడా అప్డేట్స్ రిలీజ్ అయ్యాయి. ఓజి మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ కు ఫ్యాన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. టీజర్ లో గ్యాంగ్ స్టార్ గా కనిపించిన లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


ఇక చెన్నై బ్యూటి త్రిష ఇండస్ట్రీకి ఇచ్చి ఇరవైమూడు ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్స్ పది ఏళ్లలోనే పరిశ్రమ నుండి ఫేడ్ అవుట్ అయ్యే రోజుల్లో కూడా 23 ఏళ్లుగా అగ్ర నటిగా నిలదొక్కుకున్న ఘనత త్రిషాకే దక్కింది. ఆ మధ్య సరైన హిట్స్ లేక కాస్త వెనక్కి తగ్గిన ఆమె ps-1 సినిమాతో కమ్‌బ్యాక్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్రిష కెరీర్‌ను మళ్ళీ మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి మ్యాజిక్ చేసింది.
ఇక అసలు విషయంలోకి వస్తే త్రిష, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ ఒకే హీరోయిన్ కి లవర్ గా, మామగా, నాన్నగా, అన్నగా ఇలా అన్ని పాత్రల్లోనూ చేసిన ఒకే ఒక నటుడు ప్రకాష్ రాజ్, ఆ హీరోయిన్ త్రిష. ఇలా వీరు నటించిన ఆ సినిమాల్లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఆ ఘనత విరిద్దరికే దక్కుతుంది. ఆకాశమంతా సినిమాలో తండ్రి కూతుర్లుగా జీవించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ప్రేమించిన అబ్బాయి తండ్రిగా, కాబోయే కోడలికి మంచితనం గుర్తించే మామగా, సైనికుడు సినిమాలో విలన్ బావమరిదిగా, త్రిషకి వరుసకి అన్నగా చేసాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన గిల్లీ సినిమా,ఇది తెలుగులో మహేశ్ ‘ఒక్కడు’ సినిమాకి రీమేక్. ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటించగా, తమిళ్ లో త్రిష నటించింది.త్రిషను ప్రేమించే విలన్ గా రెండు చోట్లా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలా తండ్రీ కూతుళ్లు గా, నాయికా ప్రతినాయకులుగా ఎలా కనిపించినా కూడా ప్రకాశ్‌రాజ్, త్రిష కాంబోను ఇటు తెలుగు ఆడియెన్స్ , అటు తమిళ ఆడియెన్స్ ఆదరించారు. తాజాగా వీరిద్దరు ముఖ్య పాత్రలు పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’సూపర్ హిట్ అయ్యింది.







ఒకసారి దీపిక పెళ్లికి ముందు డేటింగ్ చేసిన ఏడుగురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం…!










































