ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత ఫేమస్ ఓ… కొన్ని రియాలిటీ షోలు కూడా అంతే ఫేమస్ అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. నిజమే బిగ్ బాస్ రియాలిటీ షో అంటే చాలు పిల్లా పెద్దా అంతా కలిసి టీవీల ముందు ఓటీటీల ముందు అతుక్కు పోతారు.
ఇదిలా ఉంటే కొందరు సినిమాలను బాగా ఇష్టపడతారు. అదే సీరియల్ అంటే ఇష్టపడని ఇల్లాలు ఉండదు. రోజుకో సస్పెన్స్ తో అందరినీ ఆకర్షించే సీరియల్స్ పైనా, అందులో నటులపైన ఎంతో అభిమానం పెంచుకుంటారు. అలా ఫేమస్ అయిన సీరియల్ కార్తీక దీపం.

అందులో నటులు కూడా అంతే ఫేమస్ అయ్యారు.ఎంతలా అంటే ఎంట్రన్స్ పరీక్షల్లో కార్తీక దీపం సీరియల్ ఇందులో వస్తుంది అనే అంత ఫేమస్.ఇంక డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఎటు చూసినా వీళ్ళ గురించే టిక్ టాకులు, మీములు చేసేవాళ్ళు. అంత ఫేమస్ అయినా ఈ నటులు… బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో పాల్గొంటే ఎలా ఉంటుందో!

అయితే కార్తీక దీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయిన మొనిత అలియాస్ శోభా శెట్టి బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. నిజానికి బిగ్ బాస్ సీజన్ 6 లోనే శోభా ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారాలు జరిగాయి కానీ వీలు కాలేదు.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 లో కచ్చితంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయట.

తన అందంతో, నటనతో అందరి అభిమానాన్ని సొంత చేసుకున్న మొనిత బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తే మాములుగా ఉండదు. సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా తనకే సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓట్ బ్యాంక్ కూడా తనవైపే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి తన ఆట తీరుతో శోభ శెట్టి అలియాస్ మోనిత బిగ్ బాస్ హౌజ్ లో ఎలా అలరిస్తుందో… ఎన్ని వోట్లు దక్కించుకుంటుందో చూడాలి.
ALSO READ : బేబీ సినిమాలో “విరాజ్ అశ్విన్” పాత్ర కోసం… ముందుగా అనుకున్న యాక్టర్ ఎవరో తెలుసా..?













1. స్పైడర్:
2. డియర్ కామ్రేడ్:
3. నాని వి:
4. అమిగోస్:
5. డిస్కో రాజా:
6. సవ్యసాచి:
7. నా పేరు సూర్య:
8. ఎంత మంచివాడవురా:
9. అంతరిక్షం:
10. ఆరెంజ్:
ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వస్తే చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.


దేవుళ్ల పై చిత్రాలు తెరకెక్కించేటపుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏం జరుగుతుందో ‘ఆదిపురుష్’ సినిమా ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. ఆ మూవీ ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య డిజాస్టర్ గా నిలిచింది. ఆ మూవీ పై పీటీషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఆ ఎఫెక్ట్ వల్ల అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తోన్న ‘ఓఎంజీ 2’ సినిమా పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు తెలిపినట్లు టాక్. ఆదిపురుష్ సినిమా సమయంలో చేసిన మిస్టేక్ ను ఈ మూవీ విషయంలో రిపీట్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే సెన్సార్ కన్నా ముందు, ఈ సినిమాలో ఆడియెన్స్ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఏమైనా డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయో పరిశీలించాలని సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీకి సూచించినట్లు సమాచారం. ఆ కమిటీ డిసిషన్ తర్వాత ఈ సినిమాకి సర్టిపికెట్ మంజూరు చేయడం కానీ, ఏమైనా మార్పులు సూచించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ పరిశీలించిన ఆనంతరమే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. మూవీ రిలీజ్ ను అప్పటి వరకు నిలిపివేయాలని కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయన్ని కొట్టిపడేశారు. ఓఎంజీ 2 సెన్సార్ రిపోర్ట్ విషయంలో CBFC ఇంతవరకు తమకు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదని వెల్లడించారు. ఓఎంజీ 2 సినిమాలో అక్షయ్ కుమార్తో పాటుగా పంజక్ త్రిపాఠి, అరుణ్ గోవిల్, యామీ గౌతమ్, గోవింద్ నమ్దేవ్ కీలక పాత్రలలో నటించారు. అమిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం మంగేశ్ దక్డే అందిస్తున్నాడు.
తాజాగా జరిగిన ‘బ్రో’ ప్రి రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ ప్రసంగిస్తూ ఫ్యాన్స్ కు థ్యాంక్ యు చెప్పబోతుండగా, సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇది చూసిన కొందరు తేజ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మందు కొట్టి వచ్చడేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సాయిధరమ్ తేజ్ మాట్లాడే విషయంలో ఇబ్బంది పడుతున్నాడు.
ఇంతకుముందులా అతను క్లారిటీగా, గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం సాయిధరమ్ తేజ్ రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. కోమలోకి వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని నెలల పాటు హాస్పటల్ లో ఉన్నాడు. తర్వాత ఇంటికి వచ్చినా కొన్ని నెలల పాటు బయటికి రాలేదు. ఆ తర్వాత కోలుకుని చిత్రాలు చేస్తున్నప్పటికీ తేజులో మునపటి జోష్ లేదు.
స్వయంగా సాయిధరమ్ తేజ్ మునపటిలా, పూర్తి ఆరోగ్యంతో లేనని పలు ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పాడు. ఆ విషయం తెలిసినప్పటికి కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు సాయిధరమ్ తేజ్ సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీస్ ఫర్ యూ అనే ఇన్ స్టా పేజీలో ఒక క్లిపింగ్ షేర్ చేసి, ‘అన్నకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి సరిగ్గా మాట్లాడలేక పోతున్నాడు. దాన్ని పట్టుకుని తాగేసివచ్చాడు అని అంటారెంటిరా?’ అని రాసుకొచ్చారు.
ఇటీవలే ఏడవ సీజన్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ షో అభిమానులు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదట్లో వచ్చిన సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. కానీ ఆ తర్వాత ఈ రియాల్టీ షో పై విమర్శలు ఎక్కువయ్యాయి.
సీపీఐ లీడర్ నారాయణ ‘బిగ్ బాస్’ షో పై పలుమార్లు కౌంటర్స్ కూడా వేశారు. ఈ షో వల్ల యువత, పిల్లలు, చెడిపోతున్నారని ఆరోపించారు. హౌస్ లో పోటీదారుల మధ్య అశ్లీలత, అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని కోర్టులో నారాయణ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ తో హైకోర్టు బిగ్ బాస్ షోని ఆపేయాలని తీర్పు ఇచ్చింది.