సుడిగాలి సుధీర్.. ఆ పేరుకున్న క్రేజే వేరు. సామాన్యంగా హీరోలకు అభిమానులుంటారు. కానీ ఓ బుల్లి తెర ఆర్టిస్ట్‌కి ఇంత మంది అభిమానులుండటం చాలా రేర్. బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి పైకి వచ్చిన సుధీర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న.. చిన్న మ్యాజిక్‌లు చేసే సుధీర్.. జబర్దస్త్ షోతో స్టార్‌గా అవతరించాడు.
ఆ తర్వాతి కాలంలో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. పాపులారిటీ పెరగడంతో హీరోగానూ ఫేట్ టెస్ట్ చేసుకున్నాడు. అయితే మొదట అపజయాలే ఎదురయ్యాయి. గాలోడు చిత్రంలో ఓ మీడియం హిట్ అందుకున్నాడు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్న సుధీర్.. తన నాలుగవ సినిమాను ఇటీవలే లాంచ్ చేశాడు.

సుధీర్ కి సోషల్ మీడియా లో మిలియన్ల సంఖ్య లో అభిమానులు ఉన్నారు. అతడిని ఇన్ స్టాలో 1.4 మిలియన్ల మంది ఫాలో అవతున్నారు. కానీ సుధీర్ మాత్రం కేవలం ఒక్కరినే ఫాలో అవుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో గెస్ చెయ్యగలరా..?? అదెవరో కాదండి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. చిరును స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది.. ఇండస్ట్రీకి వచ్చారు. రకరకాల క్రాఫ్ట్స్‌లో సత్తా చాటుతున్నారు. అలానే సుధీర్‌కు చిరూనే ఇన్స్పిరేషన్. ఇదే విషయాన్ని పలు వేదికలపై కూడా చెప్పుకొచ్చాడు సుధీర్.

చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి తత్వమే ఇంతటి అభిమానానికి కారణం. ప్రస్తుతం యాంకర్‌గా, కంటెస్టెంట్‌గా, హీరోగా రాణిస్తున్నాడు సుధీర్. ఇక సుధీర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన తన సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ప్రస్తుతం సుధీర్ ‘పాగల్’ మూవీ తీసిన దర్శకుడు నరేష్ కుప్పిలి డైరక్షన్లో ‘GOAT- గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనే సినిమా చేస్తున్నాడు. సుధీర్ కు వరుస సినిమా అవకాశాలు రావడంతో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూ బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతున్నారు.
Also read: యూట్యూబ్ స్టార్స్ “షాపింగ్” నిజమేనా..?? అసలు కథ ఇదే..!!





హీరోయిన్ రవళి ఈ తరం ఆడియెన్స్ కి అంతగా తెలియయకపోవచ్చు. కానీ 90 ల ప్రేక్షకులకు రవళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలీబాబా అరడజను దొంగలు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవళి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. రియల్ హీరో, వినోదం, శుభాకాంక్షలు, పెళ్లి సందడి లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి, తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన నందమూరి సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి టాప్ హీరోలతో నటించి మెప్పించింది. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. ఆమె తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల చిత్రాలలో నటించింది. ఆమె కెరీర్ లో 40కి పైగా చిత్రాలలో నటించింది. రవళి చివరగా మాయగాడు అనే చిత్రంలో నటించింది.
2007లో రవళి నీలి కృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకుని యాక్టింగ్ గుడ్ బై చెప్పింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. బుల్లితెర నటి హరిత రవళికి సొంత సిస్టర్. ఇదిలా ఉంటే, వివాహం తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవళి ఆ మధ్యన తిరుపతిలో కనిపించారు.
అలాగే ఒక యూట్యూబ్ ఛానెల్ లో హరితతో పాటు కనిపించారు. అయితే రవళి ప్రస్తుతం ఎంతగానో మారిపోయింది. లేటెస్ట్ వీడియోలో చూసిన వారు ఒకప్పటి తమ ఫేవరేట్ హీరోయిన్ అయిన రవళి ఇలా అయ్యిందేంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఇన్ని సంవత్సరాల తరువాత అయినా రవళిని మళ్లీ చూసినందుకు సంతోషంగా ఉందని అంటున్నారు.



ఈ చిత్రం మే 26 న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే కార్తీకదీపం సౌందర్య ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిన నరేష్-పవిత్ర లోకేష్‌ల బంధాన్ని సమర్దిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘వాళ్ళిద్దరూ ఒకరినికొరు ఇష్టపడ్డారని, ఎవరి ఇష్టం వాళ్లదని, ఒక్కో వ్యక్తి మీద ఇష్టం కలగడం, ఇష్టపడడం అనేది వారి పర్సనల్ విషయమని అన్నారు. ఆ విషయంలో తల్లిదండ్రులకూ సంబంధం ఉండదని, వ్యక్తిగతంగా ఇష్టపడిన వారిని ఎవరు ఆపలేరని, అయితే వారిని చూసేవారికి అది కరెక్ట్ అనిపించకపోవచ్చు.
కానీ వారి పై వాక్యాలు చేసే హక్కు చూసేవారికి ఉండదని అన్నారు. అయితే నన్ను కూడా ఇష్టపడిన వారు, ప్రపోజ్ చేసిన వారు ఉన్నారు. అయితే కనెక్షన్ కుదర్లేదు. అలాంటి వాటిలో ఇండస్ట్రీలో నాకు చెడు అనుభవం లేదు. ఎవరో వచ్చి ఇష్టం, క్రష్ అని చెప్తే అది వారి ఫీలింగ్ మాత్రమే. ఆ ఫీలింగ్ నాలోనూ ఉంటేనే ఆ బంధం ముందుకు వెళ్తుంది’ అని కార్తీకదీపం సౌందర్య వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్లిమ్ గా ఉన్నా, గతంలో అశోక్, రాఖీ వంటి చిత్రాలలో అధిక బరువు ఉండేవారు. అయితే యమదొంగ మూవీ సమయంలో సన్నగా మారారు. ఇక ‘టెంపర్’ చిత్రంలో సిక్స్ ప్యాక్ తో కనిపించి ఆడియెన్స్ ను ఆశ్చర్యపరిచాడు. గత ఏడాది రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మరింత ఫిట్ గా కనిపించాడు. ఎన్టీఆర్ బరువు తగ్గినప్పటి నుండి డైట్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ డైలీ ఒకే రకమైన ఫుడ్ ను తీసుకుంటున్నాడం. అందువల్లనే ఎన్టీఆర్ బాడీ ఫిట్ గా ఉంటుందని అంటున్నారు.
తారక్ ఉదయం నిద్ర లేవగానే యోగ, ఎక్ససైజ్, కార్డియో వంటివి 2 గంటల పాటు చేసేవారంట. తారక్ బ్రేక్ ఫాస్ట్ లో రెండు గ్లాసుల రాగిజావను తప్పనిసరిగా తాగేవారంట. దాని తరువాత నీటిలో నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ తినేవారంట. 2 లేదా 3 ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటాడట. లంచ్ సమయంలో భోజనంలో తప్పనిసరిగా నాటుకోడి, రాగిజావను చాలా ఇష్టంగా తింటారంట. రాత్రి డిన్నర్ కి తాజా పండ్లను మాత్రమే తీసుకుంటాడు.
మధ్యలో ఆకలిగా అనిపించినపుడు ఫ్రూట్ జ్యూస్ కానీ, పండ్లను కానీ తింటారంట. ముఖ్యంగా తారక్ తన ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకునేవారంట. అదే విధంగా రెగ్యులర్ డైట్లో భాగంగా పండ్లను తీసుకునేవారంట. డైట్ లేని రోజుల్లో తనకు చాలా ఇష్టం అయిన బిర్యానిని ఎన్టీఆర్ తినేవారంట. ఇదే డైట్ ను ఆయన ఫ్యామిలీ కూడా ఫాలో అవుతారట.
1. ఈశ్వర్ – శ్రీదేవి:
2. రాఘవేంద్ర – అన్షు:
3. రాఘవేంద్ర – శ్వేతా అగర్వాల్:
4. చక్రం – అసిన్:
5. పౌర్ణమి – సింధు తులాని:
6. పౌర్ణమి – మధు శర్మ:
7. బుజ్జిగాడు – సంజన:
8. బిల్లా – నమిత:
9. రెబల్ – దీక్షా సేథ్:
10. మిర్చి – రిచా గంగోపాధ్యాయ:
చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే ఒక అమెరికన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి ఒక బాబు.





















