తెలుగు వారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. 295 చిత్రాల్లో ఆయన పోషించని పాత్రంటూ లేదు.
ప్రతి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన నట దిగ్గజం ఎన్టీఆర్. ఆయన వారసుడిగా బాలకృష్ణ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో నరసింహ నాయుడు సినిమా ఒకటి.

ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. “కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా” అనే డైలాగ్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో “మేం గట్టిగా కన్నెర్ర చేస్తే.. గుండె ఆగి చస్తారు” అని చెప్పగా.. ఆ మాటల స్పూర్తితో పరుచూరి బ్రదర్స్ ఈ డైలాగ్ ను రాశారు. అలా సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ను బాలయ్య చెప్పడం నరసింహ నాయుడు సినిమా సంచలన విజయం సాధించింది.
watch video:
బాలకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో నరసింహ నాయుడు ఒకటిగా నిలిచింది. 2001 లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాకు పోటీగా ఇతర స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా.. ఆ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేదు. నరసింహ నాయుడు సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది.

గత సంవత్సరం వచ్చిన బాలయ్య అఖండ మూవీ.. అఖండ విజయం సాధించగా, ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎన్బీకే 108 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.





ప్రస్తుతం స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరోల చిత్రాలను రీరిలీజ్ చేయడం టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది. కొత్త చిత్రాల వసూళ్ల సంగతి ఏమో కానీ, రీరిలీజ్ చిత్రాల కలెక్షన్స్ లో మా హీరో టాప్ అంటే, మా హీరోనే తోపు అని ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే రీ రిలీజ్ వసూళ్ల గురించి కొట్టుకున్నంత పని చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో నాన్ ఎన్టీఆర్ రికార్డ్స్, నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని టాగ్స్ ని ఇద్దరి ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ రికార్డుల లెక్కలతో ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని ‘4కె’ వెర్షన్లో 1200 పైగా స్క్రీన్స్‌లలో విడుదల చేశారు. దీని కోసం హీరో విశ్వక్ సేన్ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. సింహాద్రి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మొదటి రోజు నాలుగు కోట్లకు గ్రాస్‌తో టాప్‌లో ఉంది. తాజాగా ‘సింహాద్రి’ ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. అయితే పవన్ ఫ్యాన్స్ ఈ లెక్కలో తేడా ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి అభిమానులు గట్టిగా వాదించుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన విషయమ అందరికి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్ర లాంచ్ ఈవెంట్ లో ఈమూవీ గురించి మరియు ఎన్టీఆర్ పాత్ర గురించి ఎలివేషన్స్ చెప్పారు. అవి విన్న తరువాత అందరు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో మాస్ అవతార్ లో ఉంటారని ఊహించుకున్నారు. లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషించారు. కానీ ఆడియన్స్ లుక్ మామూలుగా ఉందని అంటున్నారు.
సోషల్ మీడియాలో ఈ లుక్ ని ‘వాల్తేరు వీరయ్య’ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించే ఫస్ట్ సీన్ లోని షాట్ తో పోలుస్తూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ చిత్రాలను చేస్తూ కూడా కాపీ కొట్టడం ఏంటని డైరెక్టర్ కొరటాలను ట్యాగ్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ పై కొంత మంది కాపీ అని, మరి కొంత మంది చాలా హెవీగా ఎడిట్ చేసారని కామెంట్స్ చేస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది కొమరం భీమ్ సముద్రం దగ్గర నిల్చోని ఉన్నట్టుగా ఉందని, ఆ పాత్రనే కొంచెం మార్చి పోస్టర్ రిలీజ్ చేసారని అంటున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చిన కూడా అది కేవలం కొరటాల శివ ఇంత యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు అని ఈ లుక్ తో తెల్సింది కాబట్టీ పొగిడారు. కానీ అవి అన్నీ పక్కన పెట్టి చూస్తే ప్రేక్షకులకి ఇది అంత పెద్ద కొత్తగా ఏం అనిపించలేదని టాక్.



















ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫిషియల్ గా ‘దేవర’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసినప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. టైటిల్ చాలా బాగుందని, తారక్ కి సెట్ అవుతుందని ఆనందపడుతున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉంటుందంట. ఆ పాత్ర తండ్రి పేరే దేవర ( ఎన్టీఆర్) అని తెలుస్తోంది.
ఇక సినిమా కథ మొత్తం దేవర పాత్ర చుట్టూ తిరుగుతుందని, మూవీలో ఎక్కువ భాగం దేవరనే ఉంటాడంట. అయితే ఈ చిత్రంలో జాహ్నవి కపూర్ తండ్రి దేవర పక్కన హీరోయిన్ గా నటిస్తుందా? లేదా యంగ్ ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటిస్తుందా అనేది తెలీదు. జాహ్నవి కపూర్ ఒకవేళ యంగ్ ఎన్టీఆర్ కి జంటగా చేస్తే, సినిమాలో జాన్వీ కపూర్ తక్కువ టైం ఉంటే మూవీకి మైనస్ ఏమైనా అవుతుందా అని నెటిజనులు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ రోల్ ఈ మూవీలో డబల్ అయితే జాన్వీ కపూర్ ఏ పాత్రకి హీరోయిన్ గా చేస్తుందనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృత పడుతున్నారు.
ఇదిలా ఉండగా కొరటాల శివ దేవర పాత్రను అద్భుతంగా షూట్ చేస్తున్నాడట. సముద్రం ఒడ్డున జీవించేవారికి అండగా ఉండి, ధైర్యాన్ని ఇచ్చే పాత్ర దేవర అని టాక్. పోస్టర్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఫోజు ఇంటర్వెల్ బ్యాంగ్ అని అంటున్నారు. ఇక ఈ మూవీలో మొదట్లో యంగ్ ఎన్టీఆర్ కనిస్తారని, ఆ తర్వాత తండ్రి ‘దేవర’ క్యారెక్టర్ ను పరిచయం చేస్తాడట. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలలో విలన్స్ సముద్రం తీరాన ఉన్న పేదవారిని హింసిస్తుంటారట.
ఆ సమయంలో దేవర పాత్ర ఎంట్రీ ఇచ్చి, అందరిని తరిమి తరిమి చంపుతాడంట. అలా చంపే క్రమంలో దేవర పై రక్తం పడుతుందని, రక్తంతో అలాగే నిలబడి ఉన్న స్టిల్ తోనే విరామం వస్తుందని నెటిజనులు ఎవరికి నచ్చిన కథను వాళ్ళు చెప్తున్నారు. ఈ మూవీ ఒక రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.










