అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ నమోదు చేశాయి.
80 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ సినిమాని తీస్తే మొదటి రోజు వచ్చిన వసూళ్లు కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే. శనివారం మరియు ఆదివారం అయినా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటుంది అని భావిస్తే ఆ రెండు రోజులు ఇంకా దారుణంగా వసూలు చేసింది.

నైజాం లో మొదటి నాలుగు రోజులకు కలిపి కేవలం కోటి 64 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది. ఇలాంటి యాక్షన్ సినిమాలకు మొదటి రోజే ఈ ప్రాంతం లో 5 కోట్ల రూపాయిల వరకు షేర్ వస్తుంది. కానీ ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి అందులో సగం వసూళ్లు కూడా రాలేదు.

ఆ తర్వాత సీడెడ్ లో 81 లక్షలు, ఉత్తరాంధ్ర లో 78 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 44 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 39 లక్షలు, గుంటూరు లో 66 లక్షలు , కృష్ణ జిల్లాలో 33 లక్షలు , నెల్లూరు లో 22 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల 27 లక్షలు రాగ, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

క్రేజీ కాంబోలో వచ్చిన ‘ఏజెంట్’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ప్రస్తుతం కమిషన్ బేసిస్ మీదనే నడుస్తుంది, రెంటల్ బేసిస్ మీద నడుస్తున్న థియేటర్స్ లో జీరో షేర్స్ వస్తున్నాయి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.36 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.28.64 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఖమ్మంలో మాంట్‌ఫోర్ట్ హైస్కూల్లో 8-10 తరగతి వరకు చదువుకున్నానని వెల్లడించారు. అప్పుడు హాస్టల్లో ఉండేవాడినని చెప్పారు. హాస్టల్ బిల్డింగ్ ఓపెనింగ్ తాను నటించిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ అనే నాటిక మంచి గుర్తింపును ఇచ్చిందని కర్తానందం వెల్లడించారు. ఇదే నాటకాన్ని మళ్ళీ హైదరాబాద్‌లో వేశానని, దానికి అప్పటి మినిస్టర్ మండలి వెంకటకృష్ణారావు ద్వారా అవార్డు అందుకున్నానని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగలరావు చేతుల్లా మీదుగా కూడా అవార్డు తీసుకున్నట్టు తెలిపారు.
అనారోగ్యంతో తన తండ్రి మరణించడంతో తన తల్లి ఐదుగురు పిల్లల్ని బాగా చదివించిందని ఎమోషనల్ అయ్యారు. తోడబుట్టిన వారంతా సెటిల్ అయ్యారని వెల్లడించారు. తనకు ఇద్దరు కొడుకులని, వారి పేర్లు విశ్వ, విధాత అని చెప్పారు. తన వైఫ్ పేరు పావని అని, కొడుకులిద్దరూ బాగా చదువుతారని, తెలివైనవాళ్లని చెప్పారు. పెద్దబ్బాయి జర్మనీలో ఎంఎస్ చేస్తున్నాడని, చిన్నబ్బాయి ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నడని చెప్పారు.
తాను 22 సంవత్సరాలు హోంగార్డుగా పనిచేశానని అన్నారు. గతంలో నక్సలైట్లు కోయగూడేల్లోని యువతను ఆకర్షించకుండా చేయడానికి పోలీసులు కళాబృందాలను ఏర్పాటు చేసేవారని, తాను ఆ బృందంలో చేరి, హోంగార్డు అయ్యానని నటుడు కర్తానందం వెల్లడించారు.















అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టిన దానిలో 10 శాతం కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. మూవీ చూసిన వారు దర్శకుడిగా 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు అంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాత అనీల్ సుంకర మూవీ ఫెయిల్యూర్‌ను అంగీకరిస్తూ ట్వీట్ చేశాడు. అందులో బౌండెడ్ స్క్రిప్ట్ తమ దగ్గర లేకుండా చిత్రాన్ని మొదలు పెట్టి ఖరీదైన తప్పు చేశామని అన్నారు.
దీనిని చూసిన వారు ఇండస్ట్రీలో ఓ నిర్మాత ఇలా పరాజయాన్ని, మూవీ విడుదలైన 4 రోజులకే అంగీకరించడం చాలా అరుదుగా జరిగే విషయమని అంటున్నారు. అయితే నిర్మాత అనీల్ సుంకర తన ట్వీట్ లో చెప్పిన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా మూవీని మొదలు పెట్టి తప్పుచేశాం అనే దాని పై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే హీరో అఖిల్ అక్కినేని బాడీని బిల్డప్ చేయించారా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేసి తన బాడీని బిల్డప్ చేసుకున్నారని, ఆయన శ్రమకు తగిన ఫలితం లేదని కామెంట్స్ చేస్తున్నారు. 2 ఏళ్లకు పైగా ఒక మూవీ కోసం కష్టపడ్డ అఖిల్ కెరీర్ లో ఈ చిత్రం మాయని మచ్చలా ఎప్పటికి ఉండిపోతుందని అంటున్నారు. ఈ మూవీ డిజాస్టర్ కు కారణం మూవీ యూనిట్ మాత్రమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.





కథ:
రివ్యూ:
ఉగ్రం మూవీ పోలీస్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కింది. సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ నటించారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరుకి, అల్లరి నరేష్ లోని కామెడీ యాంగిల్ అనేది గుర్తుకు రాదు. నరేష్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. నరేష్ వైఫ్ గా మర్నా మీనన్ బాగానే చేసింది. డాక్టర్‌గా ఇంద్రజ బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు రాసుకున్న స్టోరీ బాగున్నా, కథనాన్ని నడిపించిన విధానం ఎఫెక్ట్‌గా అనిపించదు. ఫస్టాఫ్ మూవీ అంతా చాలా నెమ్మదిగా రొటీన్, యాక్షన్ డ్రామాల సాగుతుంది. లవ్ ట్రాక్ ఉన్నా అంతగా వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ , ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ మూవీ సెకండాఫ్‌లో ఆడియెన్స్ కి కొంచెం రిలీఫ్ ను ఇస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.





రామచంద్రన్, జానకి దేవి ఇద్దరు 10వ తరగతి వరకు ఒకే స్కూల్ లో కలిసి చదువుకుంటారు. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమించుకుంటారు. కొన్ని సమస్యల వల్ల రామ్ టెన్త్ క్లాస్ తర్వాత ఫ్యామిలీతో చెన్నైకి వెళ్తాడు. ఆ తరువాత ఇద్దరు మళ్ళీ కలుసుకోరు. 22 ఏళ్ల తరువాత ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అయిన రామ్ తన చిన్ననాటి ప్రదేశాలను, స్నేహితులను చూడటానికి తన సొంతూరు అయిన తంజావూరుకు వెళ్తాడు. ఆ క్రమంలో ఫ్రెండ్స్ ఏర్పరు చేసిన గెట్ టు గెదర్ పార్టీలో ప్రేమికులు ఇద్దరు కలుస్తారు. అయితే ఆమెకి వివాహం అవుతుంది.
ఆ సమయంలో వారు హోటల్ రూమ్ లో కబుర్లు చెప్పుకుంటారు. రోడ్డు మీద నడవడం, మెట్రోలో ప్రయాణిస్తూ తమ మధ్య అనుబంధాన్ని తెలుపుకుంటారు. వారి మధ్య వచ్చే సన్నివేశాలు వారి మధ్య అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్నివేశాలన్నీ కూడా చాలా సహజంగా, హృద్యంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఎయిర్‌పోర్ట్‌లో జాను, రామ్ విడిపోయే సన్నివేశంలో మొదట లిప్ లాక్ ఉంది. అయితే ఆ తరువాత వద్దనుకున్నారు.
ఈ విషయం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఈ సినిమాని చూస్తున్న ఆడియెన్స్ పాత జ్ఞాపకాల్లోకి వెళతారని, వారికి మంచి అనుభూతిని పంచుతుంది. పెళ్లి అయిన అమ్మాయితో లిప్ లాక్ సన్నివేశం పెడితే జస్టిఫై అవదని భావించి, చాలా సార్లు చర్చించుకుని హీరో, హీరోయిన్ ను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని విజయ్ సేతుపతి వెల్లడించారు.
Also Read: