- చిత్రం : విరూపాక్ష
- నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్.
- నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
- దర్శకత్వం : కార్తీక్ దండు
- సంగీతం : అజనీష్ లోకనాథ్
- విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023

Virupaksha Movie Review in Telugu
Virupaksha Movie Story స్టోరీ :
1990లో రుద్రవనం అనే ఒక ఊరిలో ఈ సినిమా మొదలవుతుంది. అక్కడ ఒక జంటని వారు మంత్రాలు వేసి పిల్లలని చంపుతున్నారు అనే కారణంగా చంపేస్తారు. వారిలో మహిళ పుష్కరకాలం తర్వాత ఈ ఊరు అంతం అయిపోతుంది అని శాపం ఇస్తుంది. ఆమె అన్నట్టుగానే పుష్కరకాలం తర్వాత ఊరిలో సమస్యలు రావడం మొదలవుతాయి. అక్కడ ఉన్న జనాలు వారంతట వారే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉంటారు.

ఈ ఊరిలో జరిగే జాతరకి సూర్య (సాయి ధరమ్ తేజ్) వస్తాడు. అదే ఊరిలో నందిని (సంయుక్త) కూడా ఉంటుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ఊరిలో జరిగే సమస్యల మధ్యలో సూర్య కూడా చిక్కుకోవాల్సి వస్తుంది. అప్పుడు సూర్య ఏం చేశాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఆ ఊరిలో అలా అందరూ చనిపోవడానికి కారణం ఏంటి? వారికి ఎలాంటి సంఘటనలు ఎదురు అయ్యాయి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
Virupaksha Movie Review: విరూపాక్ష రివ్యూ :
ముందు కమర్షియల్ సినిమాల్లో ఎక్కువగా నటించినా కూడా ఆ తర్వాత కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల వైపు తన దారి మళ్లించి ఒక మంచి నటుడిగా కూడా నిరూపించుకుంటున్నారు సాయి ధరమ్ తేజ్. కొద్ది సంవత్సరాల క్రితం రిపబ్లిక్ సినిమాలో నటించారు. ఆ తర్వాత చాలా టైం వరకు సాయి ధరమ్ తేజ్ సినిమాలు విడుదల అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక థ్రిల్లర్ సినిమా అని అర్థం అయిపోతుంది.

సినిమా మొదటి నుండి కూడా అసలు ఏం జరుగుతోంది అనే ఆసక్తితోనే నడుస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఒక హారర్ సినిమాకి ఎలాగైతే ఉండాలో అలాగే ఉంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ని చూస్తే చాలా కొత్తగా కనిపిస్తారు. నటన విషయంలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు అనిపిస్తుంది.

చాలా సీరియస్ సీన్స్ లో అంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బాగా నటించారు. కానీ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచే పాత్ర మాత్రం సంయుక్త పాత్ర. కేవలం పాటలకి మాత్రమే కనిపించకుండా, సినిమాలో ఒక మంచి బలం ఉన్న క్యారెక్టర్ చేశారు. అందులోనూ ఎమోషనల్ సీన్స్ లో ఇంకా బాగా నటించారు. కానీ హీరో, హీరోయిన్ కి మధ్య వచ్చే సీన్స్ మాత్రం సినిమా సస్పెన్స్ ని అడ్డుకున్నట్టు అనిపిస్తాయి.

అంతే కాకుండా అవి కొంచెం సాగదీసినట్టుగా కూడా ఉన్నాయి. మిగిలిన నటీనటులు అందరూ వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. పాటలు కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి. సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద హైలైట్ అయ్యాయి. సినిమాలో మరొక హైలైట్ లొకేషన్స్. సినిమా చూస్తున్నంత సేపు కూడా రుద్రవనం అనే ఒక ఊరిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- ఎంచుకున్న కాన్సెప్ట్
- నిర్మాణ విలువలు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాలో వచ్చే ట్విస్ట్ లు
మైనస్ పాయింట్స్:
- హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్
- ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3.25 / 5
ట్యాగ్ లైన్ :
ఇటీవల వచ్చిన సినిమాల్లో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రాలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఈ సంవత్సరం వచ్చిన మంచి సినిమాల్లో ఒకటిగా విరూపాక్ష సినిమా నిలుస్తుంది.
Read Also: VIRUPAKSHA MOVIE HEROINE SAMYUKTHA MENON IMAGES, AGE, BIOGRAPHY, MOVIES, FAMILY DETAILS
watch video :











అనుష్క సరోజా అనే వేశ్య పాత్రలో, కేబుల్ రాజు క్యారెక్టర్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ రాక్ స్టార్ వివేక్ పాత్రలో అద్భుతంగా నటించి, ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించిన అనుష్క వేశ్య క్యారెక్టర్ చేయడం సాహసం అని చెప్పవచ్చు. కాగా ఈసినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించారు. అల్లు అర్జున్ పక్కన దీక్షా సేథ్, మంచు మనోజ్ పక్కన లేఖా వాషింగ్టన్ నటించారు. దీక్షా సేథ్ టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించారు. కానీ లేఖా వాషింగ్టన్ వేదం మూవీ తరువాత ఎక్కువగా కనిపించలేదు. మరి ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..
వేదం మూవీలో మంచు మనోజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన లేఖ ఆ మూవీ తరువాత కమినా, డైనమైట్ అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటి మాత్రమే కాదు కళాకారిణి మరియు ప్రొడక్ట్ డిజైనర్. ఆమె చెన్నై రంగస్థల నాటకాలలో కూడా నటించారు. చేసింది. ప్రస్తుతం ఆమె అజ్జీ అనే ప్రోడక్ట్ డిజైన్ కంపెనీని నడుపుతున్నారు. బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘మాతృ కి బిజిలీ కా మండోలా’చిత్రంలో లేఖా వాషింగ్టన్ అతిధి పాత్రలో నటించింది.
ఇటీవల నటి లేఖా వాషింగ్టన్, ఇమ్రాన్ ఖాన్ తో కనిపించి వార్తల్లో నిలిచింది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ మరియు లేఖ చేయి చేయి కలిపి నడుస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో లేఖా వాషింగ్టన్ ఎవరు అని నెటిజెన్లు ఆమె గురించి తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు.















ఓజీ చిత్రం నుంచి ‘ఫైర్ స్ట్రోమ్’ పేరుతో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఓజీ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లు ఈ వీడియో ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డైరెక్టర్ సుజీత్ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం కష్టాన్ని చాలా క్రియేటివ్‌గా చూపించాడు. అలాగే ప్రోమో వీడియో లోని విజువల్స్ ఈ మూవీ పై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి.
ఇక ఈ ప్రోమో వీడియోని రూపొందించిన డైరెక్టర్ నిఖిల్ నాదెళ్ల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడియో గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “వీడియోను రూపొందించే ముందు ఈ మూవీ గురించి తెలుసు కోకూడదని అనుకున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అన్నీ ఒక అభిమానిలా అన్నీ నేనే డీకోడ్ చేశాను. అదేవిధంగా వీడియో కోసం స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళాను” అని తెలిపారు.
నిఖిల్, డైరెక్టర్ సుజీత్‌ల కాంబో ఇది మొదటి మూవీ కాదు. ఇంతకు ముందు సాహో సినిమాకి కూడా ట్రైలర్‌ను కట్ చేశారు. నిఖిల్ నాదెళ్ల వృత్తిరీత్యా ఎడిటర్. నిఖిల్ త్వరలో తొలి చిత్రానికి డైరెక్షన్ చేయబోతున్నాడు. ఆ మూవీని అప్ కమింగ్ బ్యానర్ లో చేయబోతున్నట్టుగా, కొత్తవారితో రొమాంటిక్ సినిమాని తెరకెక్కిస్తానని చెప్పారు. తాను మణిరత్నం, గౌతమ్ మీనన్‌ల అభిమానినని, నా సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని వెల్లడించారు.
ఈ చిత్రంలో హీరో నాని ఇంతకు ముందు కనిపించనంత మాస్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ధరణిగా చాలా సహజంగా నటించాడు. నాని కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిస్తుంది. అంటేకాకుండా ఈ మూవీతో నాని మాస్ ఇమేజ్ పొందాడు. హీరోయిన్ కీర్తిసురేష్ వెన్నెల క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి ఫ్రెండ్ కోసం ప్రాణం పెట్టే క్యారెక్టర్ లో బాగా నటించాడు. సముద్ర ఖని, సాయి కుమార్, సోనియా చౌదరి ఇతర పాత్రలు పోషించారు.
సోనియా చౌదరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈమె గతంలో యాంకర్ గా కూడా చేశారు. ఈమె ఇప్పటి వరకు చాలా చిత్రాలలో నటించింది. అయితే ఆ పాత్రలు ఒకటి లేదా రెండు డైలాగులు మాత్రం చెప్పి వెళ్లిపోయే క్యారెక్టర్స్. ఈ ఏడాది రిలీజ్ అయిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కూడా సోనియా చౌదరి కనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ కు మాటలు ఉండవు. దాంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే దసరా సినిమాలో సోనియాక కొంచెం గుర్తింపు ఉన్న క్యారెక్టర్ లో నటించింది.
ఈ చిత్రంలో పద్మ అనే పాత్రలో సోనియా చౌదరి చక్కగా నటించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోనియాకూడా డీ గ్లామరస్ గా చూపించాడు. అయినా ఈమె చేసిన పద్మ పాత్ర క్లిక్ అయ్యింది. గుర్తింపు ఉన్న పాత్రలు మరో రెండు చేస్తే సోనియా చౌదరి నటిగా బిజీ అయిపోతుంది.












