మంచు మనోజ్ ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వార్త సినీ, రాజకీయ రంగంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే తాజాగా వీరిద్దరూ టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా మొదలైన ఒక టాక్ షో లో పాల్గొన్నారు.
ఈ షోలో పాల్గొన్న మనోజ్ అండ్ మౌనిక తమ పరిచయం మరియు బంధం గురించి ఎన్నో విషయాలను తెలిపారు. ఈ క్రమం లో అహం బ్రహ్మాస్మి మూవీ ఆగిపోవడానికి కారణం ఏంటని వెన్నెల కిషోర్ ప్రశ్నించారు. గతంలో మనోజ్ కొత్త దర్శకుడు శ్రీకాంత్ తో ‘అహం బ్రహ్మాస్మి’ మూవీ స్టార్ట్ చేసారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ మధ్య లోనే ఆగిపోయింది.

తాజాగా ఈ సినిమా గురించి మనోజ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ” అహం బ్రహ్మాస్మి కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాం. ఈ చిత్ర ఓపెనింగ్ కి నా మిత్రుడు రాంచరణ్ వచ్చారు. అదే సమయంలో మౌనికతో నా బంధం ఏర్పడింది. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలో నేను కెరీర్ కోసం, డబ్బు కోసం ఆశ పడి ఉంటే నేను బ్రతకడమే వేస్ట్ అనిపించింది. సినిమానా.. మౌనికా అని అనుకున్నప్పుడు నేను మౌనికని ఎంపిక చేసుకున్నా.

ఆ సమయం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెన్నై కి వెళ్లాం. ఏడాదిన్నర పాటు చెన్నైలోనే ఉన్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు. దీనితో తప్పని పరిస్థితుల్లో అహం బ్రహ్మాస్మిని వదిలేశా. దర్శకుడు శ్రీకాంత్ ని క్షమించమని కోరా. ఇప్పుడు శ్రీకాంత్ వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయడం నాకు సంతోషం గా ఉంది.” అని మంచు మనోజ్ వెల్లడించారు.

కానీ భవిష్యత్తులో కచ్చితంగా అహం బ్రహ్మాసి చిత్రం చేస్తా అని కూడా మనోజ్ తెలిపారు. ఇటీవల వివాహం చేసుకున్న మనోజ్, మౌనిక జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మౌనిక, మనోజ్ జీవితంలో అనుభవించిన కష్టాలు.. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది లాంటి విషయాల్ని వెన్నెల కిషోర్ ఆ టాక్ షో లో అడిగి తెలుసుకున్నారు.

అనుష్క సరోజా అనే వేశ్య పాత్రలో, కేబుల్ రాజు క్యారెక్టర్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ రాక్ స్టార్ వివేక్ పాత్రలో అద్భుతంగా నటించి, ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించిన అనుష్క వేశ్య క్యారెక్టర్ చేయడం సాహసం అని చెప్పవచ్చు. కాగా ఈసినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించారు. అల్లు అర్జున్ పక్కన దీక్షా సేథ్, మంచు మనోజ్ పక్కన లేఖా వాషింగ్టన్ నటించారు. దీక్షా సేథ్ టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించారు. కానీ లేఖా వాషింగ్టన్ వేదం మూవీ తరువాత ఎక్కువగా కనిపించలేదు. మరి ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..
వేదం మూవీలో మంచు మనోజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన లేఖ ఆ మూవీ తరువాత కమినా, డైనమైట్ అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటి మాత్రమే కాదు కళాకారిణి మరియు ప్రొడక్ట్ డిజైనర్. ఆమె చెన్నై రంగస్థల నాటకాలలో కూడా నటించారు. చేసింది. ప్రస్తుతం ఆమె అజ్జీ అనే ప్రోడక్ట్ డిజైన్ కంపెనీని నడుపుతున్నారు. బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘మాతృ కి బిజిలీ కా మండోలా’చిత్రంలో లేఖా వాషింగ్టన్ అతిధి పాత్రలో నటించింది.
ఇటీవల నటి లేఖా వాషింగ్టన్, ఇమ్రాన్ ఖాన్ తో కనిపించి వార్తల్లో నిలిచింది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ మరియు లేఖ చేయి చేయి కలిపి నడుస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో లేఖా వాషింగ్టన్ ఎవరు అని నెటిజెన్లు ఆమె గురించి తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు.















ఓజీ చిత్రం నుంచి ‘ఫైర్ స్ట్రోమ్’ పేరుతో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఓజీ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లు ఈ వీడియో ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డైరెక్టర్ సుజీత్ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం కష్టాన్ని చాలా క్రియేటివ్‌గా చూపించాడు. అలాగే ప్రోమో వీడియో లోని విజువల్స్ ఈ మూవీ పై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి.
ఇక ఈ ప్రోమో వీడియోని రూపొందించిన డైరెక్టర్ నిఖిల్ నాదెళ్ల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడియో గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “వీడియోను రూపొందించే ముందు ఈ మూవీ గురించి తెలుసు కోకూడదని అనుకున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అన్నీ ఒక అభిమానిలా అన్నీ నేనే డీకోడ్ చేశాను. అదేవిధంగా వీడియో కోసం స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళాను” అని తెలిపారు.
నిఖిల్, డైరెక్టర్ సుజీత్‌ల కాంబో ఇది మొదటి మూవీ కాదు. ఇంతకు ముందు సాహో సినిమాకి కూడా ట్రైలర్‌ను కట్ చేశారు. నిఖిల్ నాదెళ్ల వృత్తిరీత్యా ఎడిటర్. నిఖిల్ త్వరలో తొలి చిత్రానికి డైరెక్షన్ చేయబోతున్నాడు. ఆ మూవీని అప్ కమింగ్ బ్యానర్ లో చేయబోతున్నట్టుగా, కొత్తవారితో రొమాంటిక్ సినిమాని తెరకెక్కిస్తానని చెప్పారు. తాను మణిరత్నం, గౌతమ్ మీనన్‌ల అభిమానినని, నా సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని వెల్లడించారు.
ఈ చిత్రంలో హీరో నాని ఇంతకు ముందు కనిపించనంత మాస్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ధరణిగా చాలా సహజంగా నటించాడు. నాని కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిస్తుంది. అంటేకాకుండా ఈ మూవీతో నాని మాస్ ఇమేజ్ పొందాడు. హీరోయిన్ కీర్తిసురేష్ వెన్నెల క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి ఫ్రెండ్ కోసం ప్రాణం పెట్టే క్యారెక్టర్ లో బాగా నటించాడు. సముద్ర ఖని, సాయి కుమార్, సోనియా చౌదరి ఇతర పాత్రలు పోషించారు.
సోనియా చౌదరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈమె గతంలో యాంకర్ గా కూడా చేశారు. ఈమె ఇప్పటి వరకు చాలా చిత్రాలలో నటించింది. అయితే ఆ పాత్రలు ఒకటి లేదా రెండు డైలాగులు మాత్రం చెప్పి వెళ్లిపోయే క్యారెక్టర్స్. ఈ ఏడాది రిలీజ్ అయిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కూడా సోనియా చౌదరి కనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ కు మాటలు ఉండవు. దాంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే దసరా సినిమాలో సోనియాక కొంచెం గుర్తింపు ఉన్న క్యారెక్టర్ లో నటించింది.
ఈ చిత్రంలో పద్మ అనే పాత్రలో సోనియా చౌదరి చక్కగా నటించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోనియాకూడా డీ గ్లామరస్ గా చూపించాడు. అయినా ఈమె చేసిన పద్మ పాత్ర క్లిక్ అయ్యింది. గుర్తింపు ఉన్న పాత్రలు మరో రెండు చేస్తే సోనియా చౌదరి నటిగా బిజీ అయిపోతుంది.















#11

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో క్లారిటీ రాలేదు. ఇటీవల ఈ మూవీలో విలన్ క్యారెక్టర్స్ లో ఒకరిగా చేస్తున్న యాక్టర్ దేవరాజ్ ఈ చిత్రం గురించి పలు విషయాలను తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో దేవరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సలార్’ మూవీలో నటిస్తున్నానని తెలిపారు.
ఈ మూవీలో తన పాత్ర గురించి చెప్తూ తన క్యారెక్టర్ మొదటి భాగంలో కన్నా, రెండవ భాగంలో హైలైట్ గా ఉంటుందని వెల్లడించారు. దేవరాజ్ రెండవ భాగంలో నా పాత్ర హైలెట్ అనడంతో సలార్’ మూవీ రెండు పార్ట్స్ గా తీస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరో పేరు కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. సలార్ లో హీరో పేరు ‘దేవా’ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ ఏడాది సంక్రాంతి కనుక విడుదలైన వీర సింహ రెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గోపి చంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇదే జోష్ లో బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ మూవీలోని డైలాగ్ ఒకటి తాజాగా లీక్ అయినట్టుగా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ”నన్ను వేటాడాలంటే వేటగాడు గుండెల్లో దమ్ము ఉండాలి. పొరపాటున కూడా వాడి కళ్ళలో భయం కనబడితే ఆ వేటగాడే నా వేట కత్తికి బలి అవుతాడు” అనే డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు సాటి లేరనే విషయం తెలిసిందే. ఈ డైలాగ్ తో మూవీ మీద అంచనాలు మరింత పెరిగాయి.