టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది బాల నటులుగా అడుగు పెట్టి తమ నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొందరు చైల్డ్ ఆర్టిస్టులు కొన్ని చిత్రాలలో నటించినప్పటికి వారు చేసిన పాత్రలలో అద్భుతంగా నటించడం ద్వారా మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నారు. అలాంటి బాల నటులలో మైఖేల్ గాంధీ కూడా ఒకరు.
అయితే ఈ పేరుని గుర్తుపట్టరమో కానీ, హలో మూవీలో హీరో చిన్నప్పటి పాత్ర చేసిన అబ్బాయి అనగానే వెంటనే గుర్తుకు వస్తాడు. హలో చిత్రం ద్వారా పాపులర్ అయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్, పలు సినిమాలలో నటించి ఆకట్టుకున్నాడు. మైఖేల్ గాంధీ గురించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం..
సుప్రీమ్ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మైఖేల్ గాంధీ వయస్సు ఆ సమయంలో 7 సంవత్సరాలు మాత్రమే. ఆ చిత్రం తరువాత పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మైఖేల్ గాంధీ సినిమాలలో మాత్రమే కాకుండా పాకిస్తాన్, శ్రీలంకలకి చెందిన కొన్ని యాడ్స్ కూడా చేశాడు. అయితే అతనికి యాడ్స్ లో కన్నా సినిమాలలో నటించడం అంటేనే ఇష్టమని ఒక సందర్భంలో తెలిపాడు.
మైఖేల్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ యొక్క బయోపిక్ ‘ఎ బిలియన్ డ్రీమ్స్ ‘లో నటించి ఆకట్టుకున్నాడు. డినిలో మైఖేల్ నటన చూసి, సినిమా ఆఫర్స్ అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎ బిలియన్ డ్రీమ్స్ మూవీ ప్రమోషన్ టైమ్ లో మైకేల్ ఎక్కడికి వెళ్ళినా, అక్క డికి పెద్ద ఎత్తున జనాలు వచ్చేవారు. అప్పటికే అంతటి అభిమానాన్ని పొందాడు. సుప్రీమ్, ఎ బిలియన్ డ్రీమ్స్ చిత్రాలలో మైఖేల్ యాక్టింగ్ చూసిన అక్కినేని నాగార్జున ‘హలో’ మూవీలో హీరో అఖిల్ చిన్నప్పటి పాత్ర కోసం ఎంపిక చేసారు.
ఇక హలో చిత్రంలో మైఖేల్ నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తాను పెద్దయ్యాక హీరోగా కూడా ఎంట్రీ ఇస్తాడని మైఖేల్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మైఖేల్ గాంధీ వయసు 12 సంవత్సరాలు. అతను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. ఇంస్టాగ్రామ్ లో అతనికి 1444 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
https://www.instagram.com/p/Cqitt-Utgw7/?hl=en
Also Read: “3D సినిమా అని చెప్పి సీరియల్ చూపించారు ఏంటి..?” అంటూ… “శాకుంతలం” సినిమా రిలీజ్‌పై 15 ట్రోల్స్..!






























శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకి చెందిన గణపతి జబర్దస్త్ కామెడీ షోలో తనదైన హస్యంతో నవ్వించేవారు. గణపతి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. కాగా, వృత్తిరీత్యా టీచర్ అయిన గణపతికి గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా చేయడం కల. ఇప్పుడు అది నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్లుగా పని చేయడానికి అవకాశాన్ని కల్పించింది.
1998లో డీఎస్సీ రాసినవారిని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులుగా నియమించింది. ఇందుకు సంబంధించి మార్చి 15న ఏపీ గవర్నమెంట్ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 1998లో డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లుగా మీద నియమించింది. అలా ఎన్నికైన వారిలో జబర్దస్త్ యాక్టర్ గణపతి కూడా ఒకరు. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన గణపతి ఆముదాలవలస మండలంలోని సంత కొత్తవలస అనే గ్రామంలో టీచర్ గా జాయిన్ అయ్యారు. ఇన్నేళ్ళకు గవర్నమెంట్ టీచర్ కావాలనే తన కల నెరవేరిందని గణపతి ఆనందపడుతున్నారు.


శాకుంతలం:
మొదటి రోజు కలెక్షన్స్:
రుద్రుడు:
మొదటి రోజు కలెక్షన్స్:
ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి, లారెన్స్ రుద్రుడు సినిమాతో పోల్చితే సమంత నటించిన శాకుంతలం సినిమా వసూళ్ల పరంగా మెరుగ్గా ఉంది. రోజు భారీగా వసూళ్లను సాధించింది.

తాజాగా ‘విరూపాక్ష’ సినిమాకి కూడా సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ రావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఇది ఒక మంచి మిస్టరీ సినిమా అని, హారర్, థిల్లర్ అంశాలు కూడా ఉన్నాయి అని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, విడుదల తేదీ దగ్గర పడటంతో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ మరియు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తమ సినిమా కంటెంట్ పై యూనిట్ అంతా కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
సాయి తేజ్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న అనంతరం వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ‘విరూపాక్ష’ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా సాయిధరమ్ కెరీర్‌కు కూడా ఈ చిత్రం హిట్ అవ్వడం ఎంతో అవసరం. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చారు. అజనీష్ లోక్‌నాథ్ ‘కాంతార’ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చారు. మేకర్స్ ‘విరూపాక్ష’ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.






