తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో అన్నారాయన. ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించి నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు రాజ్ కుమార్. అయితే ఆయనకు మరో పేరు కూడా అదే ‘జూనియర్ చిరంజీవి’.
అప్పట్లో ఆయన చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి లా ఉండటం తో ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. కెరియర్ మొదట్లో వరుసగా వెండితెరపై అవకాశాలను అందుకున్నారు రాజ్ కుమార్. ‘అమ్మ రాజీనామా’ సినిమాతో రాజ్ కుమార్‌ని హీరోగా పరిచయం చేశారు దాసరి. ‘నాగబాల, సంసారాల మెకానిక్’, కాలేజీ బుల్లోడు’ ఇలా.. వరుసగా పది సినిమాలు చేసి బిజీ యాక్టర్ అయ్యారు.

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లో క్రమంగా అక్కడ అవకాశాలు తగ్గడం తో బుల్లితెరపై మెరిశారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ” నా కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న సమయం లో నేను చిరంజీవిలా ఉన్నానంటూ కామెంట్స్ రావడం మొదలైంది. ఇక నేను ఏం చేసినా చిరంజీవిలాగే కనిపిస్తుంది. మాట్లాడటానికి బాగుంటుంది కానీ.. కెరియర్ పరంగా కలిసిరాలేదు.

నేను శ్రీకాంత్, విక్రమ్, అజిత్, ఆనంద్ ఇలా ఏడెనిమిది మంది హీరోలంతా ఒకటే టైంలో వచ్చాం. అందరి కంటే నేను ముందు నా కెరియర్ స్టార్ట్ అయ్యింది. హిట్స్ కూడా వచ్చాయి. కానీ నాకు బ్రేక్ పడిపోయింది. వాళ్లు నన్ను దాటి వెళ్లిపోయారు. చిరంజీవి గారిలా కనిపించకూడదు అని ఎన్నో ప్రయత్నాలు చేశా కానీ ఫలించలేదు. అందుకే తెలుగు ఇండస్ట్రీ వదిలి కర్ణాటక వెళ్లిపోయా. కానీ అక్కడా అదృష్టం కలిసి రాలేదు. కానీ చిరంజీవి గారు వ్యక్తిగతం గా నన్ను ప్రోత్సహించేవారు. ఇక ప్రస్తుతం సీరియల్స్ తో బిజీ గా ఉన్నా..”. అని రాజ్ కుమార్ వెల్లడించారు.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మొత్తం గా 74 సినిమాలు చేసారు రాజ్ కుమార్. అందులో చాలా వరకు హీరోగానే చేసారు. ఇక ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్నా.. తొలిసారి ఆయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇందులో తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు రాజ్ కుమార్.





























ఈ మూవీ చూసిన చాలామంది ఆడియెన్స్ ఈ సినిమా ‘ఆరెంజ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. ఈ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారనే విషయం ఎవరికి తెలియదు. తాజాగా ఈ మూవీ దర్శకుడు భాస్కర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఇలా చెప్పుకొచ్చారు. “చిత్రం థీమ్ ప్రకారం మూవీ టైటిల్‌ను సెలెక్ట్ చేశాను. ప్రేమ అనేది కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది. అప్పుడు వేరొక వ్యక్తిని లవ్ చేయమని చెప్పడమే ఆరెెంజ్ మూవీ థీమ్. ఒకరి పట్ల ప్రేమ అనేది ఎల్లపుడూ ఒకేలా ఉండదు.
ఆ బంధంలో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. వీటినే సూర్యోదయం మరియు సూర్యాస్తమయంతో పోల్చాం. సూర్యూడు సన్ రైజ్, సన్ సెట్ లలో ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు. సన్ రైజ్ ప్రేమ మొదలవడాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో సూర్యూడు ప్రకాశవంతంగా ఉంటాడు. అలానే సన్ సెట్ లవ్ ముగింపుకు సూచన. అందువల్ల మా సినిమాకి ‘ఆరెంజ్’ అనే టైటిల్ పెట్టాం. మూవీ యూనిట్ అంతా టైటిల్ ఓకే చెప్పారు.” అని బొమ్మరిల్లు భాస్కర్ వెల్లడించారు.
ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ గా జెనీలియా నటించింది. ఒక మంచి ప్రేమ కథగా పేరు తెచ్చుకున్నా అప్పటి ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పటి జనరేషన్‌కు మాత్రం ఈ మూవీ చాలా కనెక్ట్ అయింది. మొదటిసారి రిలీజ్ అయినపుడు డిజాస్టర్ అనిపించుకున్న ఈ చిత్రం అందరు ఆశ్చర్యపోయేలా రీరిలీజ్‌లో హిట్ అయ్యింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.
జల్లికట్టు సినిమా 93వ అకాడెమీ అవార్డుల రేసులో నిలిచింది. చివరి రౌండ్ కు అర్హత సాధించలేకపోయింది. 2021 ఆస్కార్ కోసం మొత్తం 27 చిత్రాలు పోటీపడగా, మలయాళ సినిమా ‘జల్లికట్టు’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కు వెళ్ళిన మూడవ సినిమాగా నిలిచింది.
సినిమా అనగానే ముందుగా అడిగే ప్రశ్న అందులో హీరో ఎవరు అనే. దాదాపుగా ప్రతి సినిమాలోనూ హీరోదే ప్రధాన పాత్రగా ఉంటుంది. ఆ హీరో పేరుతోనే సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంటారు. కానీ ‘జల్లికట్టు’ సినిమాలో హీరో అనే పాత్ర లేదు. హీరోని పెట్టకుండా సినిమాని తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు.
2019లో విడుదలైన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే కసాయి కొట్టు నుండి తప్పించుకున్న ఒక దున్నపోతు ఊర్లో ఎంతటి వినాశనం సృష్టించిందనేది స్టోరి. ఇక ఈ మూవీ అంతా దున్నపోతు చుట్టూ తిరిగుతుంది. కానీ ఈ సినిమాలో దున్నపోతును ఉపయోగించలేదు. చిత్రయూనిట్ యానిమేట్రానిక్స్ టెక్నిక్ ద్వారా దున్నపోతును చూపించారంట. ఇలా ఒక్కో దున్నపోతుకు దాదాపు 20 లక్షలు ఖర్చు అయ్యినట్టు తెలుస్తోంది.
‘జల్లికట్టు’ అనేది కసాయి నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక దున్నపోతు ఉత్కంఠగా పరిగెత్తే కథను చెప్పే సినిమా. దున్నపోతును పట్టుకోవడానికి మనుషులు వెంట పడటం చూస్తే ఆదిమ మానవుల నాటి పశు ప్రవృత్తి మనిషి జీన్స్ లో ఇంకా ఉందని, అవకాశం వచ్చినప్పుడు అది బయిటకు వస్తుందని అర్దమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

#9

#12
#13
#14
#15
#16
#17
#18
















