ప్రముఖ నటుడు శివాజీ బుల్లితెరపైకి రానున్నాడు. ఒకప్పుడు వెండితెరపై వరుస విజయాలు అందుకున్న శివాజీ ఈ మధ్య బిగ్ బాస్ షోతో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఆ తరువాత 90s వెబ్ సిరీస్ అంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈటీవీ విన్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీల్లో రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు వారందరినీ ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్‌తో శివాజీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

అలాంటి శివాజీ ప్రస్తుతం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వెండితెర, ఓటీటీ అంటూ సక్సెస్ సాధించిన శివాజీ ఇప్పుడు బుల్లితెరపై కొత్త అవతరాన్ని ఎత్తబోతోన్నారు. ఈటీవీలో వచ్చే వినోద కార్యక్రమానికి జడ్జ్‌గా రాబోతోన్నారట. అయితే ఏ షోకు న్యాయ నిర్ణేతగా రాబోతోన్నారని మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఈటీవీలో బోలెడన్ని ఎంటర్టైన్మెంట్ షోలు వస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రతీ సోమవారం రాత్రి గం. 9. 30 ని.లకు పాడుతా తీయగా అనే కార్యక్రమం వస్తుంది.బుధవారం, గురువారం ఢీ వస్తుంది. శుక్రవారం, శనివారం జబర్దస్త్ షోలు వస్తున్నాయి. మరి వీటిల్లో శివాజీ ఏ షోకు గెస్టుగా వచ్చి ఆడియెన్స్‌ను అలరిస్తారో చూడాలి.




జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983 లో మే 20న హైదరాబాద్ లో జన్మించారు. గుడివాడలో ఉన్న మొంటిస్సోరి స్కూల్ లో ప్రాధమిక చదువు పూర్తిచేసిన ఎన్టీఆర్, ఇంటర్ హైదరాబాద్ లో సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. చదువుతో పాటుగా నటన మరియు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నాడు. తన తాతగారు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
ఐదు ఏళ్ళ తరవాత ‘బాల రామాయణం’ సినిమాలో రాముడుగా నటించాడు. ఎన్టీఆర్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఆ తరువాత 2001 లో ‘నిన్నుచూడాలని’ మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాదిలో రిలీజ్ అయిన ‘ స్టూడెంట్ నెం .1’ మూవీ విజయం సాధించింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ 20 ఏళ్లకే స్టార్ హీరోగా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేర్ ఫోటోలు మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.



































