నాని దసరా సినిమా థియేటర్ లోకి వచ్చేసింది. గత కొంతకాలంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా చిత్రం గా వచ్చిన ఈ మూవీ కి పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా సినిమాను అనుకున్న రేంజ్ లో తెరకెక్కించడం లో సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు నానిని కేవలం ఒక యాంగిల్ లో మాత్రమే చూశాం కానీ నానిలో చాలా విషయం ఉంది అనిపించేలా చేశాడని ఫాన్స్ అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో సినీ ప్రియులందరికీ ఒక సందేహం మాత్రం ఉండిపోయింది. దసరా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇప్పటివరకు ఎక్కడా చూసినా సిల్క్ స్మిత పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఓ గోడపై సిల్క్ స్మిత పోస్టర్ ఉండగా.. అక్కడే ఉన్న అరుగుపై నాని కూర్చొని ఉన్న పోస్టర్ తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో నానితోపాటు.. ఇతర యూనిట్ సభ్యులు ధరించిన డ్రెస్ లపై దసరా టైటిల్ తోపాటు.. సిల్క్ స్మిత ఫోటో కనిపిస్తోంది.

ఈ విషయం గురించి నాని ని అడగ్గా..సిల్క్ స్మిత పోస్టర్ పెట్టడానికి కారణం కేవలం దర్శకుడికి మాత్రమే తెలుసంటూ చెప్పుకొచ్చారు. తాజాగా ఇదే విషయం పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. “చిన్నప్పుడు సింగరేణి గనుల్లో మా తాత పనిచేస్తున్న సమయంలో ఆయన కాలు విరిగింది. ఆయన కోసం ప్రతిరోజు కల్లు తీసుకుని వస్తూ ఉండేవాడిని. కల్లు దుకాణం దగ్గర మొదటి సారి సిల్క్ స్మిత పోస్టర్ చూశాను. అప్పటికే ఆమె ఒక స్పెషల్ హీరోయిన్. స్పెషల్ క్యారెక్టర్, సాంగ్స్ చేస్తుందని తెలియదు. కానీ ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకుంటున్న సమయంలో ఆమె ఫోటో నా మనసులో క్లిక్ అయ్యింది. సినిమా అంటే ఆమెకు ఎంత ఇష్టమో తెలిసింది.

చిన్ననాటి కల్లు దుకాణం జ్ఞాపకాలు సినిమాలో కొన్ని పెట్టే అవకాశం వచ్చింది. అందుకే సిల్క్ స్మిత పోస్టర్ ఉపయోగించాను. సినిమాలో సిల్క్ స్మిత లేకున్నా.. ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇక దసరా మూవీ లో మొదటి నుంచి సిల్క్ స్మిత పోస్టర్ హైలెట్ అవుతూ వచ్చింది. సినిమా లో సిల్క్ బార్ దగ్గరే కథ నడుస్తుంది. ఎక్కువ సన్నివేశాలు కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఉన్న బాబు ఎవరంటే హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్. శ్రీకాంత్ వారసుడిగా రోషన్ తెలుగు ఇండస్ట్రీలో నిర్మల కాన్వెంట్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంచెం విరామం తీసుకుని దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లిసందడి చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాను మహిళా దర్శకురాలు గౌరీ రోనంకీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీతో రోషన్ మరింత గుర్తింపును సంపాదించుకున్నాడు.
రోషన్ కి ప్రస్తుతం వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోషన్ వైజయంతి బ్యానర్ లో ఒక చిత్రాన్ని అంగీకరించినట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తోంది. రోషన్ ఈ చిత్రంతో పాటుగా సితార బ్యానర్ లోనూ ఒక మూవీని చేయడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పుడు రోషన్ మహేష్ బాబుతో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే ఈ ఫోటో పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు పక్కన ఉన్న బాబు ప్రస్తుతం చాలా మారిపోయాడు. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం కొంచెం కూడా మారలేదు. అప్పటిలాగే అందంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read:
రవితేజ ఈ విషయం పై మాట్లాడుతూ దాని గురించి తెలియదు. ఇప్పటివరకు అలాంటి ఆలోచన కూడా రాలేదు. మహాధన్ ఎంట్రీ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మహాధన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే అతనికి ఆసక్తి కూడా ఉంది. కానీ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడో తెలియదని, ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే మాత్రం వెళ్లమని చెప్తా అని అన్నారు. అయితే సలహా మాత్రం ఇవ్వనని, ఇవ్వాల్సిన సలహాలు ఇప్పటికే ఇచ్చానని, కెరీర్ గురించి మహాధన్ పూర్తి క్లారిటీతో ఉన్నాడు
దీనిని బట్టి మహాధన్ త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఇక మహాధన్ ఎంట్రీ గురించి రవితేజ అభిమానులు సంతోషపడుతున్నారు. రవితేజ ఫ్యామిలీ నుండి ఆయన తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది.
Also Read: 


ఈ సినిమా రంజాన్ పండగను సందర్భంగా ఏప్రిల్ 21 రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అందువల్ల తెలుగు మార్కెట్ ని ప్రొడ్యూసర్స్ టార్గెట్ చేశారు. దానిలో భాగంగానే తెలంగాణ పువ్వుల పండుగ అయిన బతుకమ్మ మీద సాంగ్ ని పెట్టడమే కాకుండా డబ్బింగ్ చేయకుండా తెలుగులో ఆడియో రికార్డింగ్ మరియు పాటను చిత్రీకరించి విడుదల చేశారు. ఈ పాటలో వెంకటేష్, సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, భూమిక, రోహిణి హట్టంగడితో పాటు క్యాస్టింగ్ అంతా పాటలో ఉంది.
ఈ సాంగ్ ను కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ఈ సినిమాకి ఫర్హాద్ సమ్జీ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు రీమేక్ అని ఎప్పటి నుండో అంటున్నారు. అయితే ఒక్క లైన్ తీసుకుని ఎన్నో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ నటించడం వల్ల ఈ సినిమా తెలుగు వెర్షన్ ని కూడా భారీగా ప్రమోట్ చేయబోతున్నారు.
Also Read:
బొంబాయి మూవీతో దక్షణాది ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న మనీషా కోయిరాలా, కోలీవుడ్ లో తను నటించిన చివరి పెద్ద సినిమా బాబా అని చెప్పారు. అప్పట్లో ఆ మూవీ భారీగా వైఫల్యం చెందిందని మనీషా తెలిపారు. ఆ మూవీ పై తను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, బాబా చిత్రం ఫ్లాప్ అవడంతో అక్కడ తనకు మరే సినిమాలోను అవకాశం రాలేదని మనీషా తెలిపారు.
బాబా మూవీతోనే దక్షణాదిలో తన కెరీర్ ముగుస్తుందని అనుకుంటే, ఆఖరికి అదే జరిగిందని ఆమె అన్నారు. బాబా మూవీకి ముందు కొన్ని చిత్రాలలో నటించి, వాటికి ప్రశంసలు అందుకున్నానని చెప్పారు. అయితే రీరిలీజ్ లో బాబా విజయాన్ని సాధించిందని ఆమె వ్యాఖ్యలు చేశారు. బొంబాయి చిత్రంలో మొదట్లో నటించకూడదని భావించానని, కెరీర్ మొదటలో తల్లి పాత్రలు పోషించవద్దని ఎంతో మంది చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే సినిమాటోగ్రాఫర్ అయిన అశోక్ మెహతా తిట్టి మణిరత్నం చిత్రంలో అవకాశం వద్దనుకుంటే వెర్రిదానివని అన్నారని ఆమె తెలిపారు. ఆయన మాటలతో మనసు మార్చుకొని బొంబాయి మూవీలో చేశానని అన్నారు. బొంబాయి చిత్రంలో చేయడం ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉందని మనీషా తెలిపారు. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read:
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 రిలీజ్ డేట్ జనవరి 13 అని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటి దాకా మహేష్ బాబు, ప్రభాస్ ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో తమ చిత్రాలతో పోటీ పడ్డారనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఇద్దరి అభిమానులు ఈ విషయం గురించే చర్చలు జరుపుతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో పోటీపపడ్డారో ఇప్పుడు చూద్దాం..
1.నాని – అడవి రాముడు:
2.పౌర్ణమి – పోకిరి:
3. ప్రాజెక్ట్ – K – SSMB 28:
Also Read: 
ఈ సినిమా కూడా బాలీవుడ్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది టాలీవుడ్ లో ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ హిందీలో మాత్రం రాలేదు.






అంచనాలు లేకుండా ఒక చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం మూవీ సంచలనం సృష్టించింది. హాస్య నటుడు వేణు మొదటిసారిగా దర్శకత్వం చేసిన బలగం చిత్రం ప్రేక్షకుల హృదయాలలో స్థానం పొందింది. మనుషుల మధ్య సంబంధాలను మనసులకు హత్తుకునేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే అనురాగాలు, ప్రేమలు, కోపాలు, పగలు, వంటి అన్ని ఎమోషన్స్‌ను డైరెక్టర్ వేణు అద్భుతంగా చూపించారు. ఈ కథ ఆడియెన్స్ కి కంటతడి పెట్టిస్తోంది.
ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకి రప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఊరంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని ఈ చిత్రాన్ని చూస్తున్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. తాజాగా ఇటువంటి ఒక వీడియోను బలగం సిననిమా దర్శకుడు వేణు పంచుకున్నారు. ఓ ఊరిలోని వారంత గుడి దగ్గర ఉన్నప్రదేశంలో కూర్చొని బలగం సినిమాని చూశారు. చిన్న,పెద్దా అందరూ కూడా ఈ చిత్రాన్ని చూశారు.
ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వేణు ఎక్కడో తెలియదు. నిన్న రాత్రి ఊరంతా కలిసి బలగం మూవీ చూశారు. చాలా ఆనందంగా ఉంది. ఇలా చూసినవారు ఈ సినిమాను థియేటర్లో చూడాలని థియేటర్లకు వెళ్తున్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆడియెన్స్ కి నా కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అది ఏ గ్రామం అని ఆరా తీస్తున్నారు.
Also Read:
1. రాజశేఖర్ :
2. అనుపమ పరమేశ్వరన్ :
3. రాశి :
4.పృథ్వీ రాజ్ :
Also Read: