సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవే ఉండదు. ప్రతి ఏడాది ఎందరో హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగు పెడతారు. అలాగే సినిమా అవకాశాల కోసం ఎదురు చూసేవారు చాలా మందే ఉంటారు. కానీ తమని తాము నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకొనేవారు చాలా తక్కువగా ఉంటారు.
టాలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. వారిలో ఎక్కువగా ముంబయికి చెందిన ముద్దుగుమ్మలు ఉంటారు. కొంత మంది ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోగా.. మరి కొందరు కొన్ని సినిమాలకే పరిమితం అయ్యి ఇండస్ట్రీ కి దూరం అయ్యారు. అలాంటి వారిలో ఒకరే సోనాలీ జోషి. ఈమె ఎన్టీఆర్ తో “సుబ్బు” చిత్రం లో నటించారు. ‘స్టూడెంట్ నెంబర్1’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండీ వచ్చిన మూవీ కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ మూవీ ప్లాప్ అయ్యింది.

ప్రముఖ దర్శకుడు రుద్ర రాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ‘సుబ్బు’ చిత్రం తర్వాత సోనాలి జోషి.. సందడే సందడి, రాంబాబు గాడి పెళ్ళాం , నాన్న నేను అబద్ధం, అభి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం తో టాలీవుడ్ కి దూరం అయ్యారు. కానీ ఈమె బాలీవుడ్ లో నటించిన చిత్రాలన్నీ ప్లాప్ కావడం తో.. అక్కడా ఇక్కడా ఛాన్స్ లు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది.

ఇక అంతేకాకుండా పలు వ్యక్తిగత కారణాల వల్ల కూడా సినీ పరిశ్రమకు దూరమైంది. ఇక ఆ తర్వాత సోనాలి జోషి ఒక మలయాళ చిత్రం లో కూడా నటించింది. ఆ చిత్రం కూడా ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ముంబై లో నివాసం ఉంటున్న సోనాలి అనేక హిందీ సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించారు. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ సినీ కెరీర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు.

తాజాగా నటి సోనాలి ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనాలి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గత ఫోటోస్.. ఇప్పుడు ఫోటోస్ చూస్తే ఆమెను గుర్తుపట్టడం మాత్రం చాలా కష్టమే.
















అందువల్లనే తెలంగాణలోని కొన్ని గ్రామాలలో ఒకప్పటిలా ఊరి ప్రజలంతా ఒక్క చోట కలిసి చూసేలా తెరలు కట్టి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ విధంగా ఒక వైపు థియేటర్లలో, ఇంకోవైపు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతోన్న ఈ చిత్రానికి అవార్డులు రావడం కూడా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొద్ది రోజుల క్రితం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ఆటోగ్రఫీ కేటగిరీలో లాస్ఏంజిల్స్ ఫోటోగ్రఫీ పురస్కారాలు వచ్చిన విచ్చేయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి తెలుగు వేదిక నుండి ఉగాది పురస్కారాలలో నంది అవార్డునూ పొందింది. అయితే తాజాగా ‘బలగం’ చిత్ర ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు కూడా చేరింది.
ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒనికో ఫిలిం అవార్డ్స్ లో భారతదేశం నుండి ఉత్తమ ఫీచర్ సినిమాగా ‘బలగం’ పురస్కారం అందుకుంది. ఇక ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు వేణు వెల్డండి సామాజిక మధ్యమంలో షేర్ చేశాడు. తమ సినిమాకి ఇప్పటి వరకు 4 పురస్కారాలు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నాడు. తన చిత్ర యూనిట్ వల్లనే ఇది సాధ్యమైందని మూవీ యూనిట్ లో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి సోషల్ మీడియాలో ‘ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం’ అంటూ ఈ విషయాన్ని షేర్ చేశాడు.
Also Read: 













తన అన్నయ్య చక్రి ఉన్న సమయంలో ఎటువంటి గొడవలు లేవని, అయితే ఆయన మరణించిన తరవాత తమ ఫ్యామిలిలో ఆస్తి గొడవలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అన్నయ్య చక్రి పోయిన బాధలో ఉన్నప్పుడే మొదలైన గొడవలతో తాము నరకం అనుభవించామని తెలిపారు. అన్నయ్య సంపాదించిన ఆస్తుల్లో ఆయన భార్య కొన్నింటిని అమ్మేసిందని తెలిపారు. ఆమె అమెరికా వెళ్లిందని, మళ్ళీ వివాహం చేసుకుని, అక్కడే సంతోషంగా సెటిల్ అయ్యిందని వెల్లడించారు. తమకు చెందిన కొన్ని ఆస్తులు ఇప్పటికి కోర్టు కేసుల్లోనే ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే 2014లో చక్రి గుండె పోటుతో కన్నుమూశారు. ఆయనకు ఊబకాయ సమస్య ఉండేదని, ఆ కారణంతోనే చిన్న వయసులోనే చక్రి గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన మరణించిన వెంటనే వారి ఫ్యామిలిలో ఆస్తుల గొడవలు ప్రారంభం అయ్యాయి. చక్రి భార్య ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధిస్తున్నట్టుగా ఆరోపించారు. ఇంకో వైపు చక్రి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చక్రి భార్య పై ఆరోపణలు చేసిన విషయం అందరికి తెలిసిందే.
Also Read:
ఐపీఎల్ 16వ సీజన్లో మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఆడాయి. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి 178 రన్స్ చేసింది.
ఇక 179 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మికహ మొదటి నుండి కూడా అదరగొట్టారు. దాంతో గెలుపు సాధించారు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలలో స్టార్ హీరోయిన్లు ష్మిక మందాన, తమన్నా భాటియా డాన్స్ చేయడం పై ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే ఈ వేడుకల్లో డాన్స్ చేసినందుకు గాను హీరోయిన్లు రష్మిక, తమన్నా భాటియా ఇద్దరు తలో నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.
Also Read: 














ఆమె తల్లిదండ్రులు ముఖర్జీ, జెన్నీఫర్. చెన్నై కళాక్షేత్రలో అమల బి.ఏ ఫైన్ ఆర్ట్స్ చేసారు. ఆమెకు క్లాసికల్ డాన్స్ అంటే ఆసక్తి ఉండడంతో చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు. అక్కినేని అమల ఇటీవల శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాలో నటించింది. మూగజీవాల మీద ఉన్న ప్రేమతో బ్లూక్రాస్ సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే అమల ఎప్పుడూ సింపుల్ గా ఉంటారు. అమల బంగారం ధరించినట్టు కూడా కనిపించదు. ఆమె మెడలో ఎప్పుడు నల్లపూసలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే చెవులకు పోగులు, చేతికి గాజుల లాంటివి పెట్టుకోరు. అయితే బంగారం ఇష్టం లేక మాత్రం కాదంట. బంగారు నగలు వేసుకున్నప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడినట్టు తెలుస్తోంది. అందువల్లే అమల ఎలాంటి బంగారు ఆభరణాలు ధరించరని సమాచారం.
Also Read: