ఎవరైనా ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే చాలా కష్టాలు పడటంతో, పాటు ఎన్నో ఇబ్బందికర సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులోనూ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నెగ్గడం అంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి.
అయితే ఎంత కష్టపడి పైకి వచ్చినా కూడా వారిపై నెగటివ్ కామెంట్స్ చేసే వ్యక్తులు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎంతో మంది టాప్ హీరోలు ఉన్నారు. ఎంతో మంది యంగ్ హీరోలు కూడా ఉన్నారు. ప్రతి హీరో తమకి వచ్చిన ప్రతి సినిమాని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ, అవకాశాన్ని వారు తాము ముందుకు వెళ్లడానికి ఒక మెట్టుగా అనుకొని ఎంతో కష్టపడతారు.

కానీ ఎంత కష్టపడినా కూడా వీరిని ఇష్టపడని వాళ్ళు ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉంటారు. సాధారణంగా ఆ వ్యక్తి మరొక వ్యక్తితో ఈ మాట అంటే మిగిలిన వారు ఎవరికి తెలియదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఒకరికి ఏదైనా అనిపిస్తే, ఆ విషయాన్ని వాళ్లు షేర్ చేస్తే, ఒకవేళ అది పాజిటివ్ కామెంట్ అయితే అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు. కానీ ఒకవేళ అది నెగిటివ్ కామెంట్ అయితే మాత్రం, అది కూడా ఏదైనా ఒక హీరోకి సంబంధించింది అయితే మాత్రం ఆ కామెంట్ చాలా వైరల్ అవుతుంది.

అలా కామెంట్ చేసిన వ్యక్తి గురించి ఏమీ తెలియకుండానే అతనిని చాలా రకాలుగా తిడుతూ ఉంటారు. అయితే కొంత మంది హీరోలపై మాత్రం ట్రోలింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగానే ఒక వ్యక్తి ఒక నటుడిగా ఎదగడం, అందులోనూ ఒక పెద్ద స్టార్ గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. అలా ఎదిగే క్రమంలో ఆ వ్యక్తి ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటాడు.

అలా చిన్న వయసులోనే కెరీర్ మొదలుపెట్టినా కూడా, ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొని, తనని తాను మెరుగుపరుచుకుంటూ పెద్ద స్టార్ హీరో అయ్యారు విజయ్. విజయ్ తమిళ్ హీరో అయినా కూడా తుపాకీ సినిమా తర్వాత నుండి తెలుగులో చాలా ఫేమస్ అయ్యారు. ఒక సమయంలో విజయ్ ఎక్కువగా తెలుగు రీమేక్ సినిమాలు చేశారు. అందులోనూ ముఖ్యంగా మహేష్ బాబుని తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పెద్ద హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ముఖ్యమైన ఒక్కడు, పోకిరి సినిమాలని తమిళ్ లో విజయ్ రీమేక్ చేశారు.

ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాలు అందులోనూ నువ్వు నాకు నచ్చావ్, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి తమిళ్ సినిమాలో కూడా విజయ్ నటించారు. అంతే కాకుండా విజయ్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు కూడా తెలుగులో రీమేక్ అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. అంతకుముందు తమిళ్ ఇండస్ట్రీలో ఒక హీరో గురించి కామెంట్ చేస్తే, ఆ వ్యక్తి తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న మరొక హీరో గురించి కామెంట్ చేయడం వంటివి జరుగుతూ ఉండేవి.

తెలుగులో కూడా ఇలాంటివి చాలా అయ్యాయి. ఇప్పుడు తమిళ్, తెలుగు సినిమాల భేదం లేకపోవడంతో మన హీరోలని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే, వాళ్ళ హీరోలని మనం ట్రోల్ చేస్తూ ఉన్నాం. అందులోనూ అందరికంటే ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది విజయ్. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే విజయ్ రీమేక్ చేసిన సినిమాల్లోని పాటలని వీడియోలు పోస్ట్ చేసి, “మా సినిమాలని ఒక్కటి కూడా వదలవా? అన్ని సినిమాలని రీమేక్ చేస్తూ ఉంటావా?” అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

విజయ్ ఫ్లాప్ సినిమాల్లోని స్టెప్స్ తీసుకువచ్చి, “ఇలాంటి స్టెప్స్ వేసిన అతను అంత పెద్ద స్టార్ హీరో ఎలా అయ్యాడు?” అంటూ ట్రోల్ చేశారు. ఇది గత సంవత్సరం నుండి నడుస్తూనే ఉంది. ఒక సారి, రెండు సార్లు అంటే బానే ఉంటుంది. కానీ ప్రతి సారి అంత పెద్ద స్టార్ హీరోని ట్రోల్ చేయడం అంటే అది సరైన విషయం కాదు ఏమో అని కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా ఇటీవల విడుదల అయ్యింది. అయితే ఈసారి ఒక సినిమాలో ఒక్క సినిమాని మాత్రమే కాకుండా కొన్ని ఫేమస్ హిట్ తెలుగు సినిమాలు అన్నిటినీ కలిపి రీమేక్ చేశాడు అంటూ కామెంట్స్ చేశారు.

అంతే కాకుండా ఈ సినిమాలో విజయ్ వేసిన కొన్ని స్టెప్స్ పై కూడా విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. దాంతో చాలా మంది, “కేవలం ఇవి మాత్రమే చూసి విజయ్ మీద కామెడీ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన ఎన్నో మంచి సినిమాలు చేశారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం నాటి పాటలు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు విజయ్ తనని తాను నటుడిగా డాన్సర్ గా అన్ని రకాలుగా కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు.”

“అందుకే ఇప్పుడు అంత పెద్ద స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు. ఇప్పుడు ఆ పాత వీడియోలను తీసుకువచ్చి కామెంట్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్?” అని అంటున్నారు. అంతే కాకుండా, “ఒకవేళ ఇప్పుడు మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయిన ఎంతో మంది హీరోల పాత సినిమాలు, వారి పాటలు కూడా చూస్తే ఇలా కామెడీగా ఉన్న డాన్స్ స్టెప్స్ చాలానే ఉంటాయి” అని అంటున్నారు. “హీరోలు అందరూ కూడా అందరం కలిసి ఉంటాం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మనం ఇక్కడ ఇలాంటి కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు” అని కామెంట్స్ చేశారు.





ఇక త్వరలో విడుదల అవనున్న ‘మీటర్’ చిత్రంలో కిరణ్ అబ్బవరం పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో కిరణ్ లుక్ కొత్తగా ఉండబోతుందని టాక్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం సందేశాత్మకంగా టెంపర్ సినిమా రేంజ్ లో ఉంటుందని వినిపిస్తోంది. ఈ మూవీ నిడివి2 గంటల 7 నిమిషాలు. ఈ మూవీలో హీరోయిన్ గా అతుల్య రవి నటిస్తోంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
వినరో భాగ్యము విష్ణుకథ విజయంతో రిలీజ్ కాబోతున్న ‘మీటర్’ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. మైత్రీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పది కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మంచి బిజెనెస్ చేసుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే, కిరణ్ 20 కోట్ల హీరోగా అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం ట్రై చేసినట్లయితే కిరణ్ టైర్ టూ హీరోల లిస్ట్ లో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Also Read: 




#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తొలిసారి’నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరు చేసిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మార్చి 30న పాన్ ఇండియా మూవీ గా రీలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదల అయిన 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చోటు సంపాదించింది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో నాని, కీర్తి సురేష్ ను ప్రేమించాడంట. తనకు వివాహం అయిన విషయాన్ని కూడా మరచి కీర్తి సురేష్ కు దగ్గరవ్వాలనుకున్నాడంట
కీర్తి సురేష్ నాని ఫీలింగ్స్ గమనించినప్పటికి తనకేం తెలియనట్లు సైలెంట్ గా ఉందంట. నాని పనులు అర్థమైనా, కీర్తి మాత్రం లిమిట్స్ దాటకుండా స్నేహంగా ఉందంట. ఈ విధంగా ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లో హాట్ టాపిక్ అయ్యింది. ఉమైర్ సంధు ట్వీట్ లో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. నాని, కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉమైర్ సంధును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఫేమస్ కావడం కోసం అందరికి ఎఫైర్ ఉందంటూ ట్వీట్ చేస్తావా అంటూ ఆగ్రహిస్తున్నారు.
Also Read: 




విజయ్ తన ఖాతాలో తన ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్ కి ఫాలోయింగ్ ఎంతలా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఆయన పోస్ట్ చేసిన గంటలోనే మిలియన్ల కొద్ది లైకులు, వేలలో కామెంట్లు వచ్చాయి. ఖాతా మొదలుపెట్టిన 99 నిమిషాల్లో మిలియన్ ఫాలోవర్స్ చేరిన మొదటి ఇండియన్‌గా విజయ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ విషయంలో మూడోస్థానంలో ఉన్నారు. మొదటి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ- 43 నిమిషాలు, ఎంజెలీనా జోలీ- 59 నిమిషాలు ఉన్నారు.
విజయ్‌ని కళ్యాణి ప్రియదర్శన్, హీరోయిన్ కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అప్పుడే ఫాలో చేస్తున్నారు. ఈ విధంగా సెలెబ్రిటీలు కూడా విజయ్‌ని ఇంస్టాలో ఫాలో అవుతున్నారు. విజయ్ కి ప్రస్తుతం 4.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. అయితే విజయ్ ఇంతవరకు ఒక్కరిని ఫాలో అవ్వలేదు. విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో ప్రేక్షకుల పలకరించాడు. విజయ్ చిత్రాలు ఎలా ఉన్నాప్పటికి కోలీవుడ్ లో ఆడుతాయని వారసుడు నిరూపించింది. యావరేజ్ మూవీని సైతం ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్‌గా మారుస్తుంటారు.
అలా ఆయన చిత్రాలన్ని 100, 200 కోట్ల క్లబ్బులో అడుగుపెడుతూనే ఉన్నాయి. ఇక వారిసు, బీస్ట్ చిత్రాలు యావరేజ్ టాక్ వచ్చినప్పటికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్దర్శకత్వంలో లియో చిత్రాన్ని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు డిజిటల్ రైట్స్ గురించి కూడా ఎన్నో ప్రచారాలు వస్తున్నాయి.
Also Read:
ఇద్దరు పురాణాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని, అలా మాట్లాడుకుంటూ ప్రపంచాన్ని కూడా మరిచిపోతారని తెలిపింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా గొప్పదని, ఒకరంటే మరొకరికి అమితమైన గౌరవం అని చెప్పారు. మా వారు తన బుక్స్ ని ఎవరికి కూడా ఇవ్వడానికి ముందుకు రారు. కానీ పవన్ అడిగితే వెంటనే కాదనకుండా ఇస్తారు. ఇక వీరిద్దరు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గిఫ్ట్స్ అంటే అవి కూడా బుక్స్, పెన్స్ అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి మా ఇంట్లో చేసే వంటకాలను చాలా ఇష్టపడుతారు. ఉదయం పూట పవన్ మా ఇంటికి వచ్చినట్లయితే అడిగి మరీ ఉప్మా చేయించుకుని తింటారు. ఇక లంచ్ సమయంలో అయితే శాఖాహార వంటకాలు, ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు. రవ్వలడ్డులను కూడా అడిగి తీసుకుంటారు. దానికి పవన్ సిగ్గుపడరు. మా ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోతారని సౌజన్య శ్రీనివాస్ తెలిపారు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్. అయితే ఈమధ్యే ప్రొడ్యూసర్ మారి సితార బ్యానర్‌తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు.
Also Read: