హీరో నితిన్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీని రాజు, గిరి నిర్మించారు. ఈ సినిమా విజయంతో ఈ మూవీ పేరు రాజు ఇంటి పేరుగా మారింది. అప్పటి నుండి దిల్ రాజు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ మూవీ 2003లో ఏప్రిల్ 4న విడుదల అయ్యింది. అంటే ఈ సినిమా విడుదల అయ్యి 20 ఏళ్ళు అవుతోంది. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్ళు కావస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన విజయవంతంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ చిత్రం విడుదల అయ్యి 20 సంవత్సరాలు అవుతున్నా, ఆడియెన్స్ ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాని చూస్తూనే ఉన్నారు. కాగా, ఈ సినిమాలో నటించిన కొందరు యాక్టర్స్ ఇప్పుడు జీవించి లేకపోవడం బాధపెట్టే అంశం అని చెప్పవచ్చు. అయితే దిల్ చిత్రంలో నటించి, ప్రస్తుతం జీవించి లేని ఆ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. రాళ్ళపల్లి :
రాళ్ళపల్లి ఈ సినిమాలో టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ లో పనిచేసే పాత్రలో నటించారు. ఆయన కనిపించింది ఒక్క సన్నివేశంలో అయినప్పటికి తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. రాళ్ళపల్లి 2019 లో కన్నుమూశారు.
2. ఎం.ఎస్.నారాయణ :
ఎం.ఎస్.నారాయణ ఈ చిత్రంలో ప్రిన్సిపాల్ పుల్లారావుగా తన మార్క్ కామెడీతో నవ్వించారు. ఆయన 2015 లో కన్నుమూశారు.
3. ఆహుతి ప్రసాద్ :
ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఆహుతి ప్రసాద్ 2015 లో మరణించారు.
4. వేణు మాధవ్ :
ఈ మూవీలో నితిన్ మావయ్య క్యారెక్టర్ లో నటించి, కామెడీ పండించారు. వేణు మాధవ్ ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ పాత్రలో అలరించాడు. వేణు మాధవ్ 2019 లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
5. చలపతి రావు :
సీనియర్ నటుడు చలపతి రావు ఈ సినిమాలో నితిన్ తండ్రి క్యారెక్టర్ లో నటించారు. చలపతి రావు 2022 డిసెంబర్ లో తుదిశ్వాస విడిచారు.
6. రాజన్ పి.దేవ్ :
హీరోయిన్ కి తాతగా పవర్ ఫుల్ క్యారెక్టర్లో నటించారు. రాజన్ 2009 లో కన్నుమూశారు.
Also Read: పుష్ప-2 “వేర్ ఈజ్ పుష్ప” వీడియోలో… ఈ 5 విషయాలని గమనించారా..?






















ఇక డైరెక్టర్ శంకర్ ఊహించని విధంగా బడ్జెట్ ఖర్చు పెట్టిస్తుంటారని, కొన్ని సార్లు అయితే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవ్వొచ్చనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దిల్ రాజు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరని టాక్ ఉంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్నిసార్లు గొడవలు అయ్యాయనే రూమర్స్ వచ్చాయి. వీటిలో నిజం లేదని దిల్ రాజు చెప్పారు.
డైరెక్టర్ శంకర్ గురించి నాకు తెలుసు. అందువల్ల ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఈ మూవీ ఉండాలని ముందే అనుకున్నాము. ముందు ఇండియన్ 2 చేయాలని భావించాము. అయితే అది కుదరలేదు. తరువాత శంకర్ గారు గేమ్ చెంజర్ స్టోరి చెప్పినప్పుడు రామ్ చరణ్ హీరోగా అనుకోలేదు. ఆయన స్టోరీ చెప్పినపుడు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అన్నారు. కానీ నేను రామ్ చరణ్ అయితే కరెక్ట్ గా ఉంటుందని సలహా ఇచ్చాను. దాంతో శంకర్ రామ్ చరణ్ కు కథ చెప్పడంతో ఇద్దరికీ కనెక్ట్ అయిందని అన్నారు.
Also Read:
1.ఏ మాయ చేసావే:
2. ఏటో వెళ్ళిపోయింది మనసు:
3. బెంగళూరు నాట్కల్:
4. యూటర్న్:
5. ఓ బేబీ:
6. జాను:
7. సిటాడెల్:
Also Read:
అయితే సాయి పల్లవిని ఆడియెన్స్ అంతగా ఓన్ చేసుకోడానికి కారణం ఆమె పక్కింటి అమ్మాయిలా కనిపించడమే. సాయి పల్లవి ధరించే వస్త్రాలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. హీరోయిన్స్ మేకప్ వేసుకోకుండా ఉండడం అరుదుగా జరుగుతుంది. కానీ సాయి పల్లవి మేకప్ అంటే ఆమడ దూరంలో ఉంటుంది. చెప్పాలంటే ఆమె మేకప్ వేసుకోదు. ఆఫ్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆన్ స్క్రీన్ పైన ఆమె మేకప్ ఉపయోగించదు. సాయి పల్లవి తాజాగా మేకప్ ఎందుకు వేసుకోదు అనే విషయాన్ని రివీల్ చేసింది.
ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాలో అభద్రతాభావం ఉండేది. నా ముఖం పై వచ్చిన మొటిమల్ని చూస్తే చాలా బాధగా అనిపించేది. అలాగే నా గొంతు కూడా బాగుండదు అని అనుకునేదాన్ని. నా తొలి సినిమా ‘ప్రేమమ్’లో మేకప్ లేకుండానే నటించాను. ఆడియెన్స్ ఎలా తీసుకుంటారో అని భయపడ్డాను. అయితే మేకప్ లేకున్నా అందంగా ఉన్నానని ప్రశంసలు వచ్చాయి. ఆ మాటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇక అప్పటి నుంచి మేకప్ వాడకుండానే నటిస్తున్నాను. ఇక దర్శకులు ఎప్పుడు నన్ను మేకప్ వేసుకోమని ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
Also Read:
1.ఈ వీడియోలో 2004 సంవత్సరం అన్నారు. కానీ సినిమా 1998లో జరిగినట్టు చూపించారు. అంటే ఈ చిత్రంలో ఆరు సంవత్సరాల తరువాత జరిగిన కథను చూపించబోతున్నారని అర్దం చేసుకోవచ్చు.
2. ఈ వీడియోలో వర్షం సినిమా పోస్టర్ కనిపిస్తోంది. అది కూడా సినిమా రిలీజ్ అయిన మూడవ వారం అని కనిపిస్తోంది. వర్షం సినిమా 2004లో జనవరి 14న విడుదల అయ్యింది. దీనిని బట్టి చూస్తే పుష్ప 2 కథ ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తోంది.
3. ఈ గ్లింప్స్ లో వర్షం సినిమా మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్, పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ పోస్టర్స్ కూడా ఉన్నాయి.
4. ఇందులో ప్రజలు పోలీసుల మీద పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే పుష్ప-2లో పోలీసులు అల్లు అర్జున్ను పట్టుకుంటారని, ఈ క్రమంలోనే ప్రజలు పుష్పను విడిపించడానికి పోలీసులకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మ కూడా కాల్చినట్లు చూపిస్తారు.
5.చివరిలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రను పుష్ప పార్ట్ -1 లో అవమానించడం తెలిసిందే. అందుకు పగ తీర్చుకోవడానికీ పుష్ప రాజ్ అరెస్ట్ చేశారా? పుష్ప బుల్లెట్ గాయంతో బైక్ పై తప్పించుకున్నట్లుగా చూపించారు. కానీ ఆ బైక్ పా వెళ్తున్న వ్యక్తి పుష్పరాజ్ కాదు కేశవలా అనిపిస్తున్నాడు.
watch video :











