సీత లేని రాముడిని ..రామాయణాన్ని ఊహించగలమా? భర్త మాటకు ఎదురుచెప్పని మహా ఇల్లాలు. ఎంతో సహనశీలి.. ధైర్యవంతురాలు.. ఆత్మాభిమానం గల స్త్రీమూర్తి. ఆమె జీవితం నేటి తరం మగువలకే కాదు భవిష్యత్ తరాల వారికి ఎంతో ఆదర్శం. ఇక రామయణ కథను ఆధారంగా చేసుకుని అనేక తెలుగు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో సీత పాత్రలో నటించి మెప్పించారు కొందరు నటీమణులు.
సీతాదేవి ఆహార్యాన్ని, హావభావాల్ని ఎంతో రమ్యంగా పలికించి, నటించి మెప్పించిన ఆ తెలుగుతెర నటీమణుల్ని ఈ శ్రీరామనవమి సందర్భంగా గుర్తుచేసుకుందాం..
#1 అంజలీదేవి
తెలుగు వారికి సీత అనగానే ఠక్కున గుర్తుకువచ్చే పేరు అంజలీదేవి. ‘లవకుశ’ చిత్రం లో సీత పాత్ర ఆమెకు ఎనలేని పేరు తెచ్చింది. ఈ పాత్రలో నటనకు గాను ఆమె రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. ఇప్పటికీ శ్రీరాముడి భార్య సీత అంటే అంజలీదేవి పేరే గుర్తుకు వస్తుంది.

#2 చంద్రకళ
సీత పాత్రలో ఆకట్టుకున్న మరో నటి చంద్రకళ. చూడచక్కని రూపంతో, సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న చంద్రకళ ”సంపూర్ణరామాయణం” సినిమాలో సీత పాత్రలో నటించారు.

#3 సంగీత
తన సహజ నటనతో ఆకట్టుకొనే నటి సంగీత ‘శ్రీరామపట్టాభిషేకం’ చిత్రం లో సీతగా నటించారు.

#4 జయప్రద
గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న ఎన్నో పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయప్రద. ఆమె బాపు సినిమా “సీతాకళ్యాణం” లో సినిమాలో సీతగా నటించారు.

#5 నయనతార
అలాగే దర్శకుడు బాపు తీసిన మరో చిత్రం ‘శ్రీరామరాజ్యం’ లో సీత పాత్రలో నటించి నయనతార ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్, నంది అవార్డునుకూడా అందుకున్నారు.

#6 అర్చన
‘శ్రీరామదాసు’ చిత్రం లో నటి అర్చన సీతాదేవి గా నటించారు.

#7 లయ
‘దేవుళ్ళు’ చిత్రం లో ‘అందరి బంధువయా..’ పాటలో సీతగా కనిపించారు లయ. శ్రీకాంత్ రాముడిగా సీతగా లయ కనిపించేది కొద్దిసేపైనా ఆ పాట ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది.

#8 కృతి సనన్
ఇక లేటెస్ట్ గా రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ ”ఆదిపురుష్” రామాయణ కథ ఆధారంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో కృతిసనన్ సీతగా, ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.




#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18












#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18











మహేష్ కూడా త్వరలోనే రాజమౌళి తెరకెక్కించే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. మహేష్, చరణ్ వలె వారి సతీమణులు నమ్రత, ఉపాసన కూడా మంచి స్నేహితులు. ఇక చరణ్, ఉపాసన దంపతులకు మహేష్ బాబు కుమార్తె సితార అంటే ఎంతో ఇష్టం. మహేష్, చరణ్ లు ఇద్దరూ ప్రేమించుకొని, ఆ తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు.
అయితే మహేష్, చరణ్ లను తన అల్లుళ్ళుగా చేసుకోవాలని తెలుగు అగ్ర నిర్మాత అనుకున్నారంట. ఆ నిర్మాత పెద్ద కుమార్తెను మహేష్ బాబుకు, చిన్న కుమార్తెను రామ్ చరణ్ కు ఇచ్చి వివాహం చేయాలని భావించడంట. దీనికి కృష్ణ, చిరంజీవి కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మహేష్ బాబు, చరణ్ లు లవ్ మ్యారేజ్ కి సిద్ధం అయ్యారు. ఇక ఆ అగ్ర నిర్మాత కుమార్తెలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:
సినిమా షూటింగ్స్ తో ఎల్లప్పుడూ బిజీగా ఉండే మహేష్ బాబు ఏమాత్రం విరామం దొరికినా నమ్రత, గౌతమ్, సితారల తో సమయాన్ని గడుపుతాడు. వాళ్ళతోనే ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఈ ఇటీవల నమ్రత ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు మళ్లీ నటిస్తారా? మహేష్ బాబు చిత్రంలో చిన్న క్యారెక్టర్ అయిన చేస్తారా అని అడిగినపుడు దానికి ఆమె చేయను అని చెప్పారు.
ఇక మహేష్ నటించిన చిత్రాలలో మీకు నచ్చని మూవీ ఏమిటని అడిగితే సైనికుడు సినిమా నచ్చదని తెలిపింది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవి విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలనే కథాంశంతో తెరకెక్కింది. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read: 










