ఇటీవల కాలంలో కంటెంట్ బేస్డ్ చిత్రాలు ఆడియెన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలు మంచి కంటెంట్ ఉండి చిన్న చిత్రాలుగా విడుదల అయ్యి, భారీ విజయాలను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన చిత్రం బలగం. వేణు వెల్డండి దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
చిన్న సినిమాగా రూపొందిన ‘బలగం’ రిలీజ్ అయిన తరువాత బాక్సాఫీస్ దగ్గర కళ్లుచెదిరే కలెక్షన్స్ వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. కమెడియన్ వేణు వెల్దండికి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ఈ ఎమోషనల్ సినిమాని చూసేందుకు ఆడియెన్స్ థియేటర్ల వద్ద క్యూ కట్టారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను కురిపించిన బలగం, ప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయినప్పటికి ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికే ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపుతుండటం విశేషం. ఇక బలగం మూవీ యూనిట్ కూడా మూవీకి సంబంధించిన పలు విషయాలను రివీల్ చేస్తూ, ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో హీరోగా చేసిన ప్రియదర్శి క్యారెక్టర్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రియదర్శి ఈ మూవీలో సాయిలు అనే క్యారెక్టర్ లో నటించాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజు కాల్ చేసి వేణు స్టోరి చెప్తాడు వినమని చెప్పారు. వేణు చెప్పిన స్టోరి నకు విపరీతంగా నచ్చింది. దాంతో వెంటనే అంగీకరించానని చెప్పాడు. అయితే ఈ మూవీలో సాయిలు పాత్రలో ముందు వేణునే చేయాలని భావించారంట. తరువాత ప్రియదర్శిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట. సాయిలు క్యారెక్టర్ వేణునే చేసుంటే మంచి చిత్రాన్ని మిస్ అయ్యేవాడినని ప్రియదర్శి తెలిపారు.
Also Read: ఆ సినిమాతో ప్రపంచ రికార్డు సాధించి చరిత్ర సృష్టించిన బెల్లంకొండ శ్రీనివాస్..



లయ భర్త, పిల్లలతో పాటు అమెరికాలో నివసిస్తున్నారు. ఇటీవల లయ హైదరాబాద్ కి వచ్చారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్య్వూలు ఇచ్చింది. ఈవాటిలో తను అమెరికాలో జాబ్ చేసినట్టు, అలాగే ఆమె శాలరీ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులను తెలిపారు. 2006లోతాను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లానని, 2011 నుండి 2017 వరకు ఐటీ సెక్టార్లో ఉద్యోగం చేసినట్లు తెలిపింది. నాలుగు సంవత్సరాలు ఫుల్ టైం పని చేశానని, అది కూడా ఇండియాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీకి వర్క్ చేసినట్లు చెప్పారు.
జాబ్ చేసే టైమ్ లో అన్ని ట్యాక్స్‌లు పోగా శాలరీ 12000 డాలర్స్ అని తెలిపింది. అనగా ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 960, 000. నాలుగేళ్లు తరువాత 2017లో ఉద్యోగం మానేసింది. అనంతరం తాను డాన్స్ స్కూల్ మొదలు పెట్టానని, కరోనా వల్ల అది కూడా మానేసి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ మొదలు పెట్టానని తెలిపింది. ఎన్నో సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వచ్చిన లయ హైదరాబాద్ ఎంతగానో చేంజ్ అయిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, న్యూయార్క్ సిటీ కన్నా హైదరాబాదే ఎంతో బాగుందని తెలిపింది.
Also Read: 













ఇప్పుటికి ట్రేండింగ్ లో ఉన్నఈ చిత్రం తాజాగా వరల్డ్ రికార్డును సృష్టించింది. ఈ చిత్రానికి 709 కోట్ల వ్యూస్ తో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పటి దాకా ప్రపంచం వ్యాప్తంగా 709 కోట్ల వ్యూస్ సాధించిన మొదటి చిత్రంగా జయ జయ నాయక సినిమా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులోఆశించిన స్థాయిలో విజయం పొందలేకపోయినా హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత రెండవ స్థానంలో 702 కోట్ల వ్యూస్ తో కేజీఎఫ్ ఉంది.
అల్లుడు శ్రీను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ మొదటి మూవీ సూపర్ హిట్ అయ్యింది. నటుడిగా బెల్లంకొండకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన స్పీడున్నోడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాని చేశాడు. ఈ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ విజయాన్ని సాధించలేదు. ఈ మూవీ హిందీ వెర్షన్ తో బెల్లంకొండ శ్రీనివాస్‌కు నార్త్‌లో క్రేజ్ ఏర్పడింది.
బెల్లంకొండ నటించిన చిత్రాలన్ని హిందీ వెర్షన్లకు యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. కవచం, సీతా, స్పీడున్నోడు, సాక్ష్యం లాంటి చిత్రాలకు వందల మిలియన్లలో వ్యూస్ లభించాయి. ఇక ఇప్పుడు శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్ లో డెబ్యూ ఇస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది.
Also Read: 



ఈ మూవీ తరువాత ‘టైగర్ నాగేశ్వరావు’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ మరో మల్టిస్టారర్ చిత్రంలో నటిస్తున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల సినిమాల హవా పెరుగుతొందని చెప్పవచ్చు. రవితేజ, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రవితేజ మరో మల్టిస్టారర్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ నటించినప్పటికి ఆ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సినిమాగానే పేరు వచ్చింది అందువల్ల ఈసారి చేయబోయే మల్టిస్టారర్ చిత్రంలో యంగ్ హీరోతో కలిసి నటించడానికి రవితేజ ఒకే చేసినట్టు సమాచారం. ఇక ఆ యంగ్ హీరో ఎవరో కాదు శర్వానంద్. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించబోయేది ఒక యంగ్ టాలెంటెడ్ దర్శకుడు. ఆయన రవితేజ, శర్వానంద్ లకు కథ చెప్పాడంతో ఇద్దరికి ఆ కథ నచ్చిందంట. స్టోరీ ఐడియా కొత్తగా ఉండటంతో ఇద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది.
Also Read: 
