ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరిని మాత్రమే అందరూ గుర్తుంచుకుంటారు. కళామతల్లి కూడా తన బిడ్డల్ని చూసి గర్వపడే స్థాయిలో కొందరుంటారు. అందులో ముందు వరుసలో ఉంటారు. నందమూరి తారాక రామారావు, మెగాస్టార్ చిరంజీవి.
కొందరికి సినిమా అవసరం. కానీ కొందరు సినిమాకి అవసరం. వీరిద్దరూ తెలుగు సినిమా స్థాయిని పెంచి గొప్ప నటులు. అంతకు మించి మనసున్న మనుషులు.

తెలుగు సినిమా చరిత్రలో హీరోలని మూడు తరాలుగా విభజిస్తారు తెలుగు సినీ ప్రేక్షకులు. ఒకటి ఎన్. టి.ఆర్ తరం, రెండు చిరంజీవి తరం, మూడు నేటి తరం. ఏ.ఎన్. ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు,మోహన్ బాబు లాంటి హీరోలందరిని ఎన్. టి.ఆర్ తరం హీరోలు గా గుర్తిస్తారు. ఎందుకంటే ఆ కాలంలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సరికొత్త రికార్డ్ లు పరిచయం చేసిన ఘనత ఎన్. టి.ఆర్ దే. కమర్షియల్ మూవీస్ తో పాటు, రాముడు, కృష్ణుడు, కర్ణుడు, రావణాసురుడు మొదలైన పౌరాణిక పాత్రలకు ఎన్. టి.ఆర్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవారు. ఆ పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు.

ఇక యమగోల, అడవి రాముడు, వేటగాడు, జస్టిస్ చౌదరి, సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలి పులి,మేజర్ చంద్రకాంత్ లాంటి కమర్షియల్ హిట్స్ కి కూడా ఆయన కెరీర్ లో లోటు లేదు. అందువలనే ఆయన ఆ తరం హీరోలలో అగ్రగామిగా నిలబడగలిగారు. ఎన్. టి.ఆర్ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన తన జెండా బలంగా నాటిన వ్యక్తి చిరంజీవి. ఈయన ఎన్. టి.ఆర్ గారిలా పౌరాణిక పాత్రలు చేయకపోయినా, మాస్ ఆడియెన్స్ లో చిరు పేరు చెబితే పూనకం వచ్చేలా డాన్స్ లతో, ఫైట్స్ తో అప్పటి వరకు ఒక పాత ధోరణిలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకి కొత్త రంగులు అద్దడం జరిగింది.

చిరు రాకతో తెలుగు సినీమా ఖ్యాతి భారతీయ సినీ ప్రపంచం లో మరింత పెరిగింది. ఖైదీ సినిమా తో ఇండస్ట్రీ లో తన స్ధానాన్ని ఖాయం చేసుకున్న చిరు, తర్వాత.. అడవి దొంగ, కొండవీటి దొంగ, కొండవీటి రాజా, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠామేస్త్రీ, జగదేక వీరుడు, అతిలోకసుందరి,ఇంద్ర, ఠాగూర్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో టాప్ హీరో కుర్చీని తన సొంతం చేసుకున్నారు. చిరంజీవి కాలంలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, రాజశేఖర్ లాంటి హీరోలు పోటీ పడినప్పటికి వారందరి కంటే చిరు కెరీర్ లోనే అత్యధిక హిట్ సినిమాలు ఉండడం, మరియు అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకోవడం తో చిరునే ఆ తరం గ్యాంగ్ లీడర్ గా అభిమానులు భావిస్తారు.

చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ టాప్ హీరో కుర్చీ ని ఎవరు తమ సొంతం చేసుకోలేకపోయారు. గబ్బర్ సింగ్,అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు, అమోఘమైన ఫ్యాన్ బేస్ తో పవన్ కళ్యాణ్ గారు ఆ స్ధాయిలో కనిపించినప్పటికి, రాజకీయాల మీద ఆసక్తి తో ఆయన సినిమాల మీద పూర్తిగా దృష్టి పెట్టలేదని అనిపిస్తుంది. పవన్ తో పాటు, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్. టి.ఆర్ లాంటి కొత్త తరం హీరోలు వచ్చినప్పటికీ వారెవరు కూడా ఆ టాప్ హీరో కుర్చీని సొంతం చేసుకోలేకపోయారు. వారంతా కూడా ఇప్పటికి చిరునే తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అని చెప్పడం కొసమెరుపు.

మరి ఎన్. టి.ఆర్,చిరు తరువాత ఆ టాప్ హీరో కుర్చీని దక్కించుకుని, వెండితెర మీద తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే నయా నవాబ్ ఎవరో కాలమే నిర్ణయించాలి.












మలయాళ హీరో కున్‌చకో బొబన్ మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితుడే. కున్‌చకో బొబన్ హీరోగా నటించిన మలయాళ మూవీ ‘పద్మిని’ జులై 14న థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సెన్నా హెగ్డే తెరకెక్కించారు. ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్, అపర్ణా బాలమురళి, విన్సీ అలోషియస్, సజిన్, మాళవిక మేనన్ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో రమేష్ (కున్‌చకో బొబన్) ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తుంటాడు. అతను కథలు కూడా రాస్తుంటాడు.
రమేష్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. కానీ మొదటి రాత్రే రమేష్ భార్య లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోతుంది. ఆ తరువాత రమేష్ తల్లిదండ్రులు అతనికి రెండవ పెళ్లి చేయాలని భావిస్తారు. దానికి రమేశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి సంబంధం చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ రమేష్ కు అధికారికంగా విడాకులు వస్తేనే తమ కూతురుని ఇస్తామని షరతు పెడతారు.
అయితే భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియని రమేశ్ ఆమెను ఎలా వెతికి, పట్టుకున్నాడు? ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రమేష్ కు లాయర్ (అపర్ణా బాలమురళి) ఎలా సహాయం చేసింది. చివరికి రమేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడా? లేదా ఇంతకీ కథలో పద్మిని ఎవరు? అనేది మిగతా కథ.
లోపల బాధను ఉంచుకుని, పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ కనిపించే రమేశ్ క్యారెక్టర్ లో కున్‌చకో బొబన్ ఒదిగిపోయారు. లాయర్ గా అపర్ణ బాలమురళీ నటన బాగుంది. సజిన్ కామెడీ టైమింగ్, మడోన్నా సెబాస్టియన్, విన్సీ అలోషియస్, మాళవిక మేనన్, అలరిస్తారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అనుకున్న స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ సెన్నా హెగ్డే సక్సెస్ అయ్యాడు.

”గరుడ గమన వృషభ వాహన” మూవీ 2021లో నవంబర్ 19న రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించింది. ఈ కన్నడ మూవీ షోలు హైదరాబాద్ వంటి పలు నగరాల్లోనూ వేశారు. ఈ మూవీ పై అంత హైప్ ఏర్పడింది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ లేదు. ఈ చిత్రానికి రాజ్ బి శెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విజయం సాధించిన ఈ మూవీ ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ అయ్యి, దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇద్దరు మిత్రులు వారి శత్రువులను ఎదురించే క్రమంలో పెద్ద గ్యాంగ్ స్టర్స్ గా ఎదుగుతారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఎదురైన సమస్యలు, ఆ తరువాత వారి పతనానికి కారణం అయిన పరిస్థితుల ఏమిటనేది మిగిలిన కథ. రొటీన్ కథ అయినప్పటికీ కంప్లీట్ వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రాజ్ బి శెట్టి మరియు రిషబ్ శెట్టిలు అద్భుతంగా నటించారు.
వారి నటనతో పాటు, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో హైలైట్. మంచి కలెక్షన్స్ తో పాటు, ‘గరుడ గమన వృషభ వాహన’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీకి జాతీయ అవార్డులలో గుర్తింపు దక్కలేదు. దాంతో ఇట్లాంటి సినిమాకి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవటం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
టైటిల్ లో సూచించిన విధంగా ఈ మూవీ ముగ్గురు యువకుల కథ. రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోనీ వర్గీస్) ఇద్దరు అన్నదమ్ములు, వీరి స్నేహితుడు జేవియర్ (నీరజ్ మాధవ్) తో కలిసి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతారు. చర్చిలో జరుగిన పండుగలో తన తండ్రి పై చేయి వేశారని డోని రౌడీ గ్యాంగ్ ను చితకబాదుతాడు. ఆ రౌడీ గ్యాంగ్ అర్ధరాత్రి సమయంలో డోని ఇంటి పైకి వచ్చి కుటుంబంలో చిన్న పిల్లలతో పాటు అందరి పై దాడి చేస్తారు. వారికి తీవ్రమైన గాయాలు అవుతాయి.
డోని ఇంటి పై దాడి చేసిన గ్యాంగ్ ఎవరిది? ఆ గ్యాంగ్ కి డోని కుటుంబం పై ఉన్న పగ ఏమిటి? దాడి చేసిన తరువాత ఆ గ్యాంగ్ పై డోని, రాబర్ట్, జేవియర్ ఎలా పగ తీర్చుకున్నారు అనేది మిగిలిన కథ. డైనమిక్ ఫైట్ సీక్వెన్స్‌లు, హై-స్టేక్స్ స్టంట్స్, టెన్షన్-ఫిల్డ్ మూమెంట్స్ తో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ, ఎమోషన్స్, మాస్, కామెడీ వంటివన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.
ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. షేన్ నిగమ్, ఆంటోనీ వర్గీస్ మరియు నీరజ్ మాధవ్ ముగ్గురు ఎక్కడా తగ్గకుండా పోటీ పడి నటించారు. విష్ణు అగస్త్య విలన్ పాత్రలో నటించాడు. విలన్ గా ఆయన లుక్స్, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను సైతం భయపెట్టాయి. ఈ మూవీకి యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి.