నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఆయనను అభిమానులు బాలయ్య అని ప్రేమగా పిలుచుకుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుసగా సినిమాలలో నటిస్తున్నాడు.
ఓటీటీ లో హోస్ట్ గా బిజీగా ఉన్నారు. తెలుగు ఓటీటీ అయిన ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ టాక్ షోతో అందరిని అలరించారు. ఆ షోలో ఆయన మాట్లాడే విధానానికి, వచ్చిన గెస్ట్ లతో వ్యవహరించిన తీరుకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ విషయాలను పక్కన పెడితే, బాలకృష్ణ తన భార్య వసుంధర దేవి గురించి ‘అన్ స్టాపెబుల్’ టాక్ షోలో ప్రస్తావించారు. అంతేకాకుండా బాలయ్య తన భార్యకు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పారు. ఈ క్రమంలోనే బాలయ్య భార్య ఎవరని, ఆమెకు ఉన్న ఆస్తి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఆమె గురించి ఇప్పుడు చూద్దాం..

ఎన్టీ రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలక్రిష్ణ విజయవంతంగా తన కెరీర్ లో రాణిస్తూ, టాప్ 4 హీరోలలో ఒకరిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. బాలక్రిష్ణ 1982 లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఎవరో కాదు. శ్రీరామదాసు మోటార్ కంపెనీ అధిపతి అయిన దేవరపల్లి సూర్యారావు కుమార్తనే. వందల కోట్ల ఆస్తులకు వారసురాలైన వసుంధర దేవి గ్రాడ్యుయేషన్ పోర్టయి చేశాకనే బాలక్రిష్ణను పెళ్లి చేసుకుంది.
ఆ తరువాత బాలక్రిష్ణ సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో, ఫ్యామిలీ వ్యవహారాలన్నిటినీ కూడా వసుంధర దేవినే చూసుకుంటూ వస్తుంది.ఇక బాలకృష్ణ,వసుంధర దంపతులకు ముగ్గురు పిల్లలు. వారు కూతుర్లు బ్రాహ్మణి, తేజస్వి, కుమారుడు మోక్షజ్ఞ. పెద్ద కూతురు బ్రాహ్మణిని నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ కు ఇచ్చి వివాహం చేశారు. రెండవ కూతురు తేజస్వినికి గీతం సంస్థలకు చెందినటువంటి శ్రీ భరత్ తో పెళ్లి చేశాడు. ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ త్వరలో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టబోతున్నాడని వార్తలొస్తున్నాయి.అది అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ రాలేదు.






దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ మూవీ చార్లీ. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గాను 2016లో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వం నుండి అవార్డును అందుకున్నారు. ఈ మూవీ మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వంలో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కింది. పార్వతి హీరోయిన్ గా నటించింది. 46వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఈ మూవీకి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీతో పాటు మొత్తం 8 అవార్డులను గెలుచుకుంది. ఇతర భాషలలో కూడా ఈ మూవీ రీమేక్ అయ్యింది.
చార్లీ కథ విషయానికి వస్తే, తేస్సా (పార్వతి) ఒక గ్రాఫిక్ ఆర్టిస్ట్. ఇష్టంలేని పెళ్ళిని తప్పించుకోవడం కోసం ఇంటి నుండి పారిపోతుంది. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ సహాయంతో, ఆమె పాత ఇంట్లో అద్దెకు తీసుకుంటుంది. మొదట్లో, ఆ ఇంటిని అసహ్యించుకుని, దానిని శుభ్రం చేసే క్రమంలో ఆ గదిలో ఒక బుక్ దొరుకుతుంది. అది చదవడం ద్వారా గతంలో చార్లీ (దుల్కర్) అనే వ్యక్తి ఆ గదిలో ఉండేవాడని, అతని గురించి చదివిన తరువాత అతనిలోని మంచి లక్షణాలు ఆమెను ఆకట్టుకుంటాయి.
అంతేకాకుండా ఆమె చిన్నప్పుడు విన్న కథకు సంబంధించిన పెయింటింగ్ ను అక్కడి గోడల పై చూస్తుంది. ఆ పెయింటింగ్ వేసింది చార్లీ అని తెలియయగానే ఎలాగైనా అతన్ని చూడాలనే ఆసక్తితో చార్లీని వెతుకుతూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలు ఏమిటి? ఆమె చివరికి చార్లీని కలుసుకుందా? ఆ తరువాత ఏమి జరుగుతుంది అనేది మిగతా కథ.
దుల్కర్ సల్మాన్ చార్లీ పాత్రలో జీవించాడు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చార్లీ సింపుల్, మరియు ఫీల్ గుడ్ ఫిల్మ్. ఈ మూవీ మాధవన్ హీరోగా తమిళంలో ‘మారా’ అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ చిత్రానికి ఆహాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.




