సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవే ఉండదు. సినిమా అవకాశాల కోసం ఎదురు చూసేవారు చాలా మందే ఉంటారు. కానీ తమని తాము నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకొనేవారు చాలా తక్కువగా ఉంటారు.
టాలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. వారిలో ఎక్కువగా ముంబయికి చెందిన ముద్దుగుమ్మలు ఉంటారు. కొంత మంది ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోగా.. మరి కొందరు ఒక్క సినిమా తోనే తళుక్కున మెరిసి మాయమైపోయారు. అలా ప్రేక్షకులను పలకరించిన భామ ‘షాజన్ పదంసీ’.

బొమ్మరిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా నటించారు. ఈనో అంచనాతో రిలీజ్ ఐన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇప్పటికి ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.

ఆ చిత్రం లో హీరో ఫ్లాష్ బ్యాక్ లో తనకి జోడీగా నటించింది షాజన్ పదంసీ. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. మోడలింగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆమె నటుడు అలిక్ పదమ్సీ, ఇండియన్ పాప్ సింగర్ షారోన్ ప్రభాకర్ కుమార్తె.

2009లో హిందీ సినిమా ‘రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత తెలుగు లో ఆరెంజ్ సినిమా చేసింది.ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ రాలేదు ఆమెకు. ఆ తరువాత పలు హిందీ చిత్రాలు చేసిన ఆమె..2013 లో హీరో రామ్ సరసన మసాలా చిత్రం లో నటించింది.

2015 లో ఒక హిందీ చిత్రం చేసిన ఆమె ప్రస్తుతం మోడలింగ్ లో బిజీ గా ఉంది. సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

నెయిమర్ మూవీలో మాథ్యూ థామస్ , నస్లెన్, జానీ ఆంటోని, షమ్మీ తిలకన్, విజయరాఘవన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ కుంజవ (మాథ్యూ థామస్) మరియు సింటో (నస్లెన్ ) ఫుట్‌బాల్ అభిమానులు, అయితే వారి తండ్రుల ఒకప్పుడు మంచి మిత్రులు అయినప్పటికీ మనస్పర్ధలతో విడిపోతారు. కుంజవ, సింటో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలని భావిస్తారు. అదే సమయంలో కుంజవ డోనా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఆమెకు కుక్కపిల్లలంటే ఇష్టమని తెలుసకుని ఒక వీధికుక్కను తీసుకుని వస్తాడు. దాని పేరే ‘నెయిమర్’. అది వచ్చిన తరువాత వారి జీవితాలలో వచ్చిన ఊహించని మలుపులు ఏమిటి అనేది మిగతా కథ. సినిమా మొదటి సగంలో, ప్రేక్షకులకు కుంజవా, సింటో మరియు వారి కుటుంబాలను పరిచయం చేశారు. ఆ తరువాత నెయిమర్ అనే కుక్క వారి జీవితంలోకి ఎలా వస్తుంది. ప్రతి ఒక్కరి పై ఎలాంటి ప్రభావం చూపింది. అనే విషయాన్ని వినోద భరితంగా సాగుతుంది.
సెకండాఫ్ గాబ్రియల్ కు వెంకట్ తో ఉన్న శత్రుత్వం మరియు ఒకరి మీద మరొకరు గెలవడానికి చేసే ప్రయత్నాలు. వారిద్దరి పరువు ప్రతిష్ఠలు ‘నెయిమర్’ తో ముడిపడి ఉండటం కొంచెం సస్పెన్స్ తో నడుస్తుంది. క్లైమాక్స్ లో డైరెక్టర్ సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశాలను చూపించారు. ఆ సీన్స్ సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మూవీ చూసిన వారిని ఆలోచించెలా చేస్తాయి. కంటతడి పెట్టిస్తాయి.





























