ఆహా లో నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షో కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీస్ వచ్చారు. ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ అవుతోంది. ఈ షో కి చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు వచ్చారు. వాళ్ళతో హోస్ట్ అయిన బాలయ్య ఎన్నో మాట్లాడారు.
ఇదిలా ఉంటే త్వరలో ప్రభాస్ ఈ షో కి వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ప్రభాస్ తన ఫ్రెండ్ హీరో గోపీచంద్ తో ఈ షో కి వస్తున్నాడట.

బాలయ్య తో వీళ్లిద్దరు సందడి చేయనున్నారు. ఈ షో న్యూ ఇయర్ నాడు ప్రసారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ గోపి చంద్ ఇద్దరు వర్షం సినిమా చేసారు. విలన్ గా గోపి చంద్ చక్కటి యాక్టింగ్ చేసారు. వర్షం సినిమా తర్వాత గోపీచంద్ మరియు ప్రభాస్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. చాలా సందర్భాలలో ప్రభాస్ తో ఉన్న స్నేహం గురించి గోపీచంద్ చెబుతూనే వచ్చారు. ఈ షోలో కూడా వాళ్ళిద్దరూ స్నేహం గురించి చెబుతారు ఏమో అనేది చూడాల్సి ఉంది. పైగా బాలయ్య కూడా ప్రభాస్, గోపీచంద్ తో మాట్లాడతారు కాబట్టి మంచిగా ఎంటర్టైన్మెంట్ తో షో ఉండనుంది.

ఇంత గొప్ప ఎంటర్టైన్మెంట్ ని వీళ్ళ ముగ్గురు ఇస్తారు కాబట్టి కొత్త సంవత్సరానికి కానుకగా షో వస్తుందేమో అనేది చూడాల్సి ఉంది. గోపీచంద్ తొలివలపు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జయం, వర్షం సినిమాలు మంచి పేరును తీసుకు వచ్చాయి. తర్వాత చాణక్య, సిటీ మార్ ఇలా చాలా సినిమాల్లో గోపీచంద్ నటించారు. ప్రభాస్ క్రేజ్ బాహుబలి తో మాములుగా లేదు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయారు. ప్రభాస్ చేతి లో ప్రస్తుతం నాలుగు మూవీస్ వున్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో ప్రభాస్ బిజీగా వున్నారు. అలానే మారుతి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇక బాలయ్య షో విషయానికి వస్తే.. డిసెంబరు 2న జరిగే ఎపిసోడ్ కి రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు రానున్నారు. రాత్రి 9 గంటలకి ఈ ఎపిసోడ్ ఆహా లో వస్తుంది.



స్టోరీ :
Matti Kusthi Review in Telugu రివ్యూ :






విజయ్ దేవరకొండ టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ గివెన్చీ స్వెట్షర్ట్ ధరించి కనిపించాడు. గివెన్చీ స్వెట్షర్ట్ ధర 65,000, అతని బూట్లు ధర సుమారు 53,000. ఇంకా ఫెండీ సన్ గ్లాసెస్ ధరించాడు. దీని ధర 25,000. మొత్తం మీద, ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ దుస్తులకు,మిగతా వాటికి కలిపి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. అల్లు అర్జున్ స్వెట్షర్ట్ మరియు బూట్ల ధరలు తెలుసుకుని అభిమానులు విస్తుపోయారు. దీని పై కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా చేసారు.
అంతే కాకుండా తన లగ్జరీ లైఫ్, స్టైలిష్ డ్యాన్స్ తో బన్నీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే గంగోత్రి,ఆర్య, దేశముదురు, DJ.. పుష్ప వరకు సూపర్ హిట్ సినిమాలతో స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు.అంతే కాకుండా అతను బ్రాండెడ్ వస్తువులను వాడుతాడు. అతని దగ్గర చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వీటిలో రూ. 1.45 లక్షల విలువైన షూలు, రూ. 65,000 విలువైన టీ-షర్ట్, హైదరాబాద్ లో రాజభవన లాంటి బంగ్లా, రూ. 7 కోట్ల విలువైన సూపర్ ఖరీదైన వ్యానిటీ వ్యాన్, ఖరీదైన స్టైలిష్ కార్లు ఉన్నాయి.
నమ్రత తాజాగా కొడుకు గౌతమ్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ వీడియో సూపర్ స్టార్ అభిమానులను ఖుషి చేస్తుంది. ఆ వీడియో ఏంటీ అనుకుంటున్నారా, అది గౌతమ్ ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే గౌతమ్ గతంలో స్విమ్మింగ్లో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నమ్రతా షేర్ చేసిన గౌతమ్ స్విమ్మింగ్ వీడియో కూడా వైరల్ అయ్యింది. తాజాగా గౌతమ్ తన స్కూల్లో క్లాస్మెట్స్తో కలిసి స్కిట్ చేశాడు.
తన మిత్రులతో కలిసి చక్కని హావా భావాలతో నటించాడు. దానిలో గౌతమ్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. గౌతమ్ ఇంగ్లీష్ మాడ్యులేషన్ సూపర్ గా ఉంది. ఈ స్కిట్ లో గౌతమ్ని చూసి మహేష్ అభిమానులు, నెటిజన్లు, మహేష్ లానే ఉన్నాడని, ఫ్యూచర్ ప్రిన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత్ షేర్ చేసిన గౌతమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గౌతమ్ తన స్టడిస్ పూర్తయిన తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం.





బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.