Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తున్నాడు. కృష్ణ రమేష్ బాబు, మహేష్ బాబులను బాలనటులుగా పరిచయం చేశారు. మహేష్ చిన్నప్పుడే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా మారి తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్ అయ్యాడు.
కృష్ణలానే మహేష్ బాబు కూడా కొడుకు గౌతమ్ ని ‘నేనొక్కడినే’ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేశాడు. ఆ తరువాత గౌతమ్ మళ్లీ మూవీస్ లో నటించలేదు. మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో గౌతమ్, సితారలకు సంబంధించిన విషయాలను అభిమనులతో షేర్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. నమ్రత ఇటీవల రమేష్ బాబు కూతురు భారతి గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ ఇద్దరమ్మాయిల వల్ల మా ఇంట్లో నవ్వులొచ్చాయి అని రాసుకొచ్చింది. భారతి, సితారలతో తీసుకున్న సెల్ఫీని కూడా షేర్ చేసారు.
నమ్రత తాజాగా కొడుకు గౌతమ్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ వీడియో సూపర్ స్టార్ అభిమానులను ఖుషి చేస్తుంది. ఆ వీడియో ఏంటీ అనుకుంటున్నారా, అది గౌతమ్ ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే గౌతమ్ గతంలో స్విమ్మింగ్లో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నమ్రతా షేర్ చేసిన గౌతమ్ స్విమ్మింగ్ వీడియో కూడా వైరల్ అయ్యింది. తాజాగా గౌతమ్ తన స్కూల్లో క్లాస్మెట్స్తో కలిసి స్కిట్ చేశాడు.
తన మిత్రులతో కలిసి చక్కని హావా భావాలతో నటించాడు. దానిలో గౌతమ్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. గౌతమ్ ఇంగ్లీష్ మాడ్యులేషన్ సూపర్ గా ఉంది. ఈ స్కిట్ లో గౌతమ్ని చూసి మహేష్ అభిమానులు, నెటిజన్లు, మహేష్ లానే ఉన్నాడని, ఫ్యూచర్ ప్రిన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత్ షేర్ చేసిన గౌతమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గౌతమ్ తన స్టడిస్ పూర్తయిన తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం.







బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.




కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’ హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది. అయితే ఇక్కడ చెప్పేది కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్.

కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’లో రాజుగారి ఆస్థానంలో ఉండే ప్రసిద్ద నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ కు జంటగా తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయనున్నారు. కంగనా ఈ పాత్రను చేయనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం.
కంగనా రనౌత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననుందని తెలుస్తోంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ‘ఎమర్జెన్సీ’ తరువాత షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అది ముగిసిన తర్వాత ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా నిర్మిస్తోంది. ఇక కంగనా రనౌత్ ‘తేజస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ ‘నోటి బినోదిని’ కూడా ఉంది.