Adivi sesh Hit 2 Movie Review in Telugu అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 Review .
తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కాగా ఈ సినిమా రన్‌టైం రెండు గంటలు ఉండనుంది. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్‌టైంతో ఏ సినిమా రాలేదు. థ్రిల్లర్ సినిమాలకు ఈ రన్‌టైం ఉంటే చాలా వరకు ప్లస్ అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలోనే ఈ చిత్రం చిన్న పిల్లలకి చూడడానికి లేదని స్ట్రిక్ట్ గా పెద్ద వాళ్ళకి మాత్రమే అని చెప్పారు.
Hit 2 Movie Review and Rating in Telugu

Adivi sesh hit movie review in Telugu
ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠతో ఉంచుతుందని ఇన్సైడ్ టాక్. సినిమాలో విలన్ ని ఎక్సపోజ్ చేసే సీన్ చాలా అద్భుతం గా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు దర్శకుడిని అభినందించినట్లు సమాచారం. అంతే కాకుండా క్లైమాక్స్ లో అడివి శేష్ నటన సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్ళింది తెలుస్తోంది. చివరిగా హిట్ 3 గురించి దర్శకుడు క్లూ వదిలాడని టాక్.
Hit 2 Movie Story in Telugu

అడివి శేష్ హిట్-2″ రివ్యూ
ఈ చిత్రం లో అడివి శేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటిస్తుంది. రావు రమేష్, కోమలి ప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిరినేనితో కలిసి హీరో నాని నిర్మించాడు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. Hit 2 Movie Review in Telugu ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయ్యింది. దాంతో సినిమా ఎలా ఉండబోతోంది అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు అవ్వాల్సిందే.

అయితే రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారాతో స్టార్డమ్లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల నుంచి రివ్యూల వరకు ప్రతి విషయంలోనూ సినిమా అద్భుతంగా రాణించింది. ఇక రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆమెతో పని చేయడానికి ఆసక్తి లేదనట్టుగా మాట్లాడాడు. రష్మిక గతంలో తన ఫస్ట్ సినిమా హౌస్ పేరు చెప్పకుండా చూపించిన సైగలను ఇమిటేట్ చేసి,తన వేళ్లను చూపించి ‘ఇస్ టైప్ కే యాక్ట్రెస్’ అన్నాడు.
ఇక దీనిపై తాజాగా రిషబ్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమెకు కూడా సినిమా అంటే ఇష్టం. సినిమా చూడకుంటే ఫర్వాలేదు, తన సినిమాలతో బిజీ అయి ఉండవచ్చు. ఆమెకు ఆమె స్పేస్ ఇవ్వండి. ఎక్కడ జీవితం మొదలు పెట్టమో, అక్కడే ఉండిపోవాలని లేదు. ఉన్నత స్థానాలకు ఎదగాలి. రష్మిక ప్రస్తుతం అదే చేస్తుంది అని ప్రమోద్ అన్నాడు.
ప్రమోద్ చివరగా రష్మికకు, రష్మిక పై కామెంట్ చేసేవాళ్లకు ఒక మాట చెప్పాడు.కెరీర్లో మొదటి విజయాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోకూడదు. వాళ్ళను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయకూడదు. ఎదుగుతున్న వారిని కూడా విమర్శించకూడదని, ఒకవేళ అలా చేస్తే చిన్న పిల్లలు అవుతాము అంటూ ప్రమోద్ స్పందించాడు. మరి ఇప్పటికైనా ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందో చూడాలి.

ఇప్పటికే మహేష్‌బాబు,త్రివిక్రమ్‌ల సినిమా పై రకరకాలుగా రూమర్స్ షికారు చేస్తున్నాయి. అసలు ఈ సినిమానే ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ కథలో మార్పులు చేయమని త్రివిక్రమ్ కి సూచించారని,దాంతో ఈ సినిమా స్టోరీ పూర్తిగా మారిపోయిందని కూడా వచ్చాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్‌లో మొదలు కానుంది. షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరగనుందని సమాచారం. పూజా హెగ్డే కాలి గాయం నుంచి కోలుకుని ఈ షూటింగ్ లో పాల్గోబోతుందని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ఇంకో హీరోయిన్‌కు స్థానం ఉందని సమాచారం. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్‌బాబు తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరి మహేష్ బాబు ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ పాల్గొంటాడా లేదా త్రివిక్రమ్ మూవీ తర్వాతనే రాజమౌళి సినిమా మొదలు పెడతాడా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు చేశాడు. మూడో సినిమాలో మహేష్ బాబుని ఎలా త్రివిక్రమ్ చూపిస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ హీరోలు తమ సినిమాలని ఇతర భాషల్లో విడుదల చేసినా కూడా వాటి ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ప్రాధాన్యత అంతగా ఇవ్వడం లేదు. ఎందుకనో గాని పాన్ ఇండియా మూవీస్ తో తమ దూకుడు పెంచుకోవాలని ఈ సీనియర్ స్టార్స్ అనుకోవడం లేదు. అయితే సీనియర్ హీరోలు చాలా విషయాలలో యంగ్ హీరోలతో పోటీపడుతున్నా పాన్ ఇండియా విషయంలో అసలు పోటీపడటం లేదు
ఇక సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నెలల వ్యవధిలోనే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్ మూవీతో అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల పలకరించనున్నారు. నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మూవీ షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ద్వారా వారం వారం ప్రేక్షకులకు పలకరిస్తున్నాడు.






డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబీ29 గురించి ముఖ్యమైన అప్డేట్ ఇచ్చాడు. “మహేష్ తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్‌లాంటి ఓ అడ్వెంచరస్ మూవీ అని, ఇలాంటి మూవీ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇదే దానికి సరైన టైమ్ అనిపించింది. ఈ సినిమాకి మహేష్ బాబునే పర్ఫెక్ట్ ఛాయిస్. ఇలాంటి సబ్జెక్ట్‌కు అతను సూటవుతాడు.ఇది ప్రపంచమంతా చుట్టే ఒక అడ్వెంచరస్ సినిమా అని రాజమౌళి చెప్పాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నాడు.
గతంలోనే విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథను రాయబోతునట్లు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి కూడా అదే కథని చెప్పాడు. యాక్షన్,అడ్వెంచర్, థ్రిల్స్ అన్ని ఎస్ఎస్ఎంబీ29 లో ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ 2023లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ మూవీలో నటించబోయే నటీనటుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాని ఆస్కార్స్లోకి తీసుకెళ్ళే పనుల్లో ఉన్నాడు. అవన్నీ పూర్తయితే కానీ ఎస్ఎస్ఎంబీ29 పై దృష్టి పెట్టే అవకాశాలు లేవు.