బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలియా భట్ రణబీర్ కపూర్ గురించి అందరికీ సుపరిచితమే. పెళ్లైన కొన్నినెలలుకే వీరిద్దరు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. అలియా ఆదివారం ఆస్పత్రిలో చేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన రెండు నెలలకే అలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులను, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.
ఇదిలా ఉంటే నవంబర్ 6న తను పాపకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది అలియా భట్. “మా జీవితాల్లోకెల్లా గొప్ప వార్త. మా బేబీ వచ్చేసింది. తను చాలా అద్భుతమైన అమ్మాయి. మేము అధికారికంగా మా బేబీ ని ప్రకటిస్తున్నాం”. అని పోస్ట్ చేసింది అలియా. దీంతో ఈ జంటకు సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు శుభాకాంక్షలు వెలువెత్తాయి. అయితే ప్రస్తుతం అలియా భట్ కుమార్తె పేరుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలో తాజాగా అలియా భట్ కుమార్తె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గతంలో ఓ షోలో పాల్గొన్న అలియా భట్ అక్కడ ఓ చిన్నారి తనకి అభిమాని అని చెప్పడంతో తన పేరు స్పెల్లింగ్ చెప్పమని అడిగారు. అప్పుడు ఆ చిన్నారి ALMMA అని చెప్పగా ఒక్కసారిగా అలియా గట్టిగా నవ్వేస్తూ ‘అల్మా పేరు చాలా బాగుంది. నా కూతురుకి ఇదే పేరు పెడతానంటూ’ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అలియాకు కూతురు పుట్టడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అలియా చెప్పిన విధంగానే తన కూతురుకు అల్మా అనే పేరు పెడుతుందా లేక ఏదైనా కొత్త పేరును పెడుతుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.