మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ ఇటీవల అభిమానుల్ని మెప్పించినా.. బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేకపోయింది. అక్టోబరు 5న రిలీజైన ఈ మూవీ తొలి రోజు నుంచే హిట్ టాక్ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఓవరాల్‌గా ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’ మూవీ చిరంజీవికి టాక్ పరంగా ఊరటనిచ్చింది.
వాస్తవానికి గాడ్‌ఫాదర్ సినిమా.. మలయాళం మూవీ ‘లూసిఫర్’కి రీమేక్. దాంతో గాడ్‌ఫాదర్ రిలీజ్‌కి ముందే లూసిఫర్ని చూసిన ప్రేక్షకులకి ఈ కథ ఏంటో తెలిసిపోయింది. దీంతో చిరు ఇమేజ్ తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకి తెచ్చారు దర్శకుడు మోహన్ రాజా. అయితే తాజాగా ఆ మూవీ గురించి తన యూట్యూబ్ ఛానల్లో పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు.

ఈ క్రమంలో సినిమాలో చిన్న చిన్న తప్పిదాల్ని గుర్తు చేసిన ఆయన.. డ్యాన్స్‌లు లేని చిరంజీవి పాత్రని చూడటం కాస్త ఇబ్బందిగా అనిపించిందని అభిప్రాయపడ్డారు. అయితే చిరు బాడీ లాంగ్వేజ్ కి ఇలాంటి స్లో పేస్ కథలు సెట్ కావని ఆయన అన్నారు. ” తన చెల్లెళ్లకు దూరం గా ఉంటూ వారిని ఎలా రక్షించాడు అనే ఒక కర్ణుడి కథ ఇది. సమయానుగుణం గా ట్విస్ట్ లు రివీల్ చేసారు. మాతృకతో పోలిస్తే స్క్రీన్ ప్లే బావుంది. అలాగే డైలాగ్స్ బావున్నాయి కానీ.. చిరంజీవి కి తగ్గట్టు లేవు” అని పరుచూరి తెలిపారు.

” అలాగే సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ఒకరకంగా ప్లస్. మరో రకంగా దెబ్బతీశాడు. ఎలా అంటే? చిరంజీవి నడుస్తుంటే సల్మాన్ ఖాన్ ఫైట్ చేయడం అభిమానులకి బాధ కలిగించింది. ఆఖరికి క్లైమాక్స్‌లోనూ అదే పంథాని కొనసాగించారు. అదే సల్మాన్ క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ చేసుంటే ఆ ఫీలింగ్ అభిమానులకి వచ్చేది కాదు.” అని పరుచూరి వెల్లడించారు.



రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి తాజాగా ఏబీఎన్ రాధా కృష్ణ షోలో పాల్గొన్నారు. ఆర్కే ఈ సందర్భంగా మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీ రంగులరాట్నం లాంటిది. ఏమరపాటున ఉంటే చాలా ప్రమాదకరమైందని, అది ఎంత పైకి తీసుకెళ్తుందో, అంతే వేగంగా కింద పడేస్తుందని, ఇదే విజయ్ దేవరకొండ ‘లైగర్’ విషయంలో జరిగింది. ఓవర్ నైట్ స్టార్ గా మరి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ అలానే టక్కున కిందికి రావాల్సి వచ్చిందని చెప్పాడు.
అయితే దీనికి రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ మేము ఇద్దరం కలిసి ‘ఖుషి’ మూవీ చేస్తున్నాం. కానీ సమంతకు ఆరోగ్యం బాలేకపోవడంతో హోల్డ్ లో వుంది. నెక్స్ట్ షెడ్యూల్ మొదలవగానే విజయ్ దేవరకొండని కలుస్తాను. అయితే ఈమధ్య కాలంలో మాట్లాడుకోలేదు. హి ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. ఏదైనా తట్టుకుంటాడు అని అన్నాడు. ప్రియదర్శి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ హిట్ అండ్ ఫ్లాప్ అనేవి కామన్, విజయ్ చాలా డిఫరెంట్, అతను ఖచ్చితంగా మళ్లీ హిట్టు కొడతాడని అన్నారు.
మరోవైపు విజయ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటు కనిపిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ అందరు ఎక్కడికి వెళ్ళినా కంబ్యాక్ ఇవ్వాలి అన్నా అంటున్నారని, అయితే తాను ఎక్కడికీ పోలేదని, ఇక్కడే ఉన్నానని తన స్టైల్లో చెప్పి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచాడు.




మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్‌లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.







