సినిమాకు ‘సంగీతం సగం బలం’ అంటారు మన పెద్దలు. పాటలు బాగుంటే సినిమాలు కూడా బాగానే ఉంటాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. కొన్ని సినిమాలను పాటల కోసమే చూస్తారు ప్రేక్షకులు. అలాగే పాటలు హిట్ కాకపోతే సినిమా ఫలితం ఆశించినంతగా ఉండదన్న విషయం తెలిసిందే. దీంతో పాటలపై, సింగెర్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు మేకర్స్.
చిత్ర రిలీజ్ కి ముందు నుంచే పాటల టీజర్లు అంటూ ఆడియన్స్ లో హైప్ పెంచుతుంటారు. అయితే కొన్ని పాటలు మాత్రం రిలీజ్ అయినప్పుడు యావరేజ్ గా అనిపించి.. ఫైనల్ గా మాత్రం సూపర్ హిట్స్ అవుతాయి. అలాంటి పాటలేవో ఇప్పడు చూద్దాం..
#1 ఊ అంటావా మావ..
సుకుమార్ దర్శకత్వం లో అల్లుఅర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఇందులో సమంత ఒక ప్రత్యేక గీతం లో నటించింది. దీంతో ఈ పాటకి చాలా హైప్ వచ్చేసింది. కానీ ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. విపరీతం గా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా సూపర్ హిట్ గా నిలిచింది.
#2 బాస్ పార్టీ
మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం నుంచి ‘బాస్ పార్టీ’ ప్రోమో వదిలారు. ఈ పాటకు దేవి శ్రీ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు లిరిక్స్ రాశారు. అయితే ప్రోమో రాగానే నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ స్టార్ట్ చేసారు. అయితే ఫుల్ సాంగ్ రిలీజ్ కాగానే అందరి నోళ్లు మూతబడ్డాయి. ప్రస్తుతం ‘బాస్ పార్టీ’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
#3 అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘ఖైదీ నంబర్ 150’. దాదాపు 10 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత డాన్సింగ్‌లో అదే జోరును చూపించారు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో మరోసారి బాక్సాఫీస్‌ను కుమ్మి పడేసారు చిరంజీవి. అయితే మొదట ఈ పాట రిలీజ్ అయినపుడు అసలు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. కానీ కట్ చేస్తే పాట్లతో పాటు మూవీ సూపర్ హిట్ అయ్యింది.
#4 శివాజీ మూవీ సాంగ్స్
ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన శివాజీ మూవీ లో సాంగ్స్ అన్నీ.. చాలా స్లో గా .. అవుట్ ఆఫ్ రజని స్టైల్ లో ఉంటాయి. కానీ ఇప్పటికీ ఆ పాటలు సూపర్ హిట్టే..
#5 మైండ్ బ్లాక్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ గతంలో ఎన్నడూ చేయనంత మాస్ సాంగ్‌ను ఆడియన్స్‌కు చూపించాలని అనిల్ ట్రై చేసి ‘మైండ్ బ్లాక్’ సాంగ్ చేసారు. అయితే దీనిపై ఆడియన్స్ నిరుత్సాహం వ్యక్తం చేసారు. ఇదేం సాంగ్ అంటూ.. దేవి శ్రీ ప్రసాద్ పై విరుచుకు పడ్డారు. కానీ ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
#6 సామి సామి..
పుష్ప లో వచ్చిన మరో సూపర్ హిట్ పాట సామి సామి.. అయితే ఈ సాంగ్ పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ వేరే సాంగ్స్ నుంచి ట్యూన్స్ కాపీ చేశాడంటూ నెటిజన్లు ట్రోల్ చేసారు.
#7 పైసా వసూల్..
ఈ వయసులో కూడా ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా పైసా వసూల్ సాంగ్ కి డాన్స్ చేశారు బాలయ్య. అయితే ఈ సాంగ్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ సూపర్ హిట్ అయ్యింది.
#8 నాథ్ నాథ్..
బద్రీనాథ్ సినిమాలోని నాథ్ నాథ్ పాటపై కూడా మొదట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి.. కానీ అల్లు అర్జున్, తమన్నాల గ్రేస్ డాన్స్ తో సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
#9 అరబిక్ కుతూ..
బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ సాంగ్ ఎంత సూపర్ హిట్టో చెప్పక్కర్లేదు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. అవి కాస్తా తెలుగులోకి వచ్చేసరికి చాలా ట్రోలింగ్ జరిగింది.
#10 కిలిమంజారో
రోబో సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన పాట కిలి మంజారో.. అయితే ఈ పాట లిరిక్స్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ.. ఈ పాట ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్.
#11 బ్లాక్ బస్టర్..
సరైనోడు సినిమాలోని మాస్ సాంగ్ బ్లాక్ బస్టర్. ఈ సాంగ్ కొరియోగ్రఫీ పై అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ ఇది సూపర్ హిట్ అయ్యింది.
#12 మహేశా..
మహేష్ ని మరో సారి మాస్ అప్పీల్ లో చూపించిన సాంగ్ మహేశా..సర్కారు వారి పాటలోని ఈ పాట పై కూడా మొదట్లో నెగటివ్ ట్రోల్స్ వచ్చినా.. సూపర్ హిట్ అయ్యింది.
#13 ఇనుములో హృదయం..
రోబో సినిమాలోని మరో పాట ఇది. దీనిలో లిరిక్స్ వెరైటీ గా ఉన్నాయంటూ ట్రోల్స్ చేసారు కానీ హిట్ అయ్యింది ఈ సాంగ్..






ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అన్నను, తల్లిని, తండ్రిని కోల్పోవడాన్ని మహేష్ బాబుకి తీరని బాధే. మహేష్ కు చిన్నాన్న ఆదిశేషగిరిరావు తోడుగా ఉన్నారు. ఆదిశేషగిరిరావు తన అన్న అయిన కృష్ణతో 70 ఏళ్లపాటు కలిసి ప్రయాణం చేసారు. ఆదిశేషగిరిరావు సైతం అన్నయ్య లేరనే నిజాన్ని నమ్మలేక బాధపడుతున్నారు. వైద్యులు కృష్ణకు గుండెపోటుతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానిక ముందు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ విషయం గూర్చి వివరణ ఇచ్చారు. కృష్ణ చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు. తనతో ఏం మాట్లాడారు,ఆ తర్వాత ఏమైంది అని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందురోజు ఆదివారం,ఆరోజున పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వెళ్లారట. కృష్ణతో రెండు గంటలకు పైగా గడిపారంట, ఆ సమయంలో కృష్ణ చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారని, సైకిల్ పై ఇద్దరూ సినిమాలకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా నవ్వుకున్నారని, సినిమాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ ఆ సమయంలో చాలా హుషారుగా కనిపించారని, ఇంట్లోనే భోజనం చేసి వెళ్లమని కృష్ణ అడిగినప్పటికీ, వేరే వాళ్లను భోజనానికి ఇంటికి రమ్మన్నని చెప్పాను. అయితే ఇంకోసారి లంచ్‌కి రా అని అన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చేశానని ఆదిశేషగిరిరావు తెలిపారు.
ఆదివారం రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత అన్నయ్యకి 12.30కి గుండెపోటు వచ్చిందని చెప్పారు. అన్నయ్యకు గురకపెట్టే అలవాటు ఉంది. గదిలో నుండి గురక శబ్దం వినిపించకపోయేసరికి అన్నయ్య అవసరాలు చూసుకునే కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేసి, ఏదో తేడాగా అనిపించేసరికి ఫోన్ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని, ఆ తర్వాత నేను వెళ్లా. కానీ అన్నయ్యకి గుండెపోటు వచ్చి అప్పటికే ముప్పైనిమిషాలు అవడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. వైద్యులు 30 గంటలకు పైగా వైద్యం చేశారు.అయిన కూడా ఫలితం లేకపోయిందని ఆదిశేషగిరిరావు తెలిపారు.















