ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు తమన్. ఈయన గంటసాల వెంకట రామయ్య మనవడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ హవా నడుస్తోంది అని చెప్పవచ్చు. తమన్ ఏది ముట్టుకున్నా బంగారం అవుతోంది. ఇక ఆయన భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో కూడా సంగీతాన్ని అందిస్తూ ముందుకు పోతున్నారు.
ఇక చాలామంది స్టార్ హీరోలు కూడా తమన్ మాత్రమే సినిమాలో మ్యూజిక్ ఇవ్వాలని అంటున్నారు. అల వైకుంఠపురం మూవీలో సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అఖండ బిజీఎం విని థియేటర్లలో అభిమానులు ఎలా ఊగిపోయారో మనం చూశాం.
ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఆయన చేతిలో ఫాదర్- ఆర్ సి -15 మూవీస్ ఉన్నాయి. ఎన్నడూ లేనట్టుగా తమన్ మొదటిసారి తన భార్య మరియు ఆయన కొడుకు గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఆయన భార్య పేరు శ్రీ వర్దిని.. ఆమె కూడా ప్లే బ్యాక్ సింగర్.. ఆవిడను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె గతంలో మణిశర్మ – యువన్ శంకర్ రాజా వద్ద పని చేసింది. ఆమె తమను కంపోజింగ్ లో కూడా కొన్ని పాటలను పడిందట. కానీ తన సినిమాల ద్వారా ఆమెను ప్రమోట్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు.
ఆమె వాయిస్ చాలా బాగుంటుంది.నిర్మాతలు దర్శకులు భావిస్తేనే ఆమెతో పాటలు పాడిస్తానని అన్నారు.. అయితే రాబోయే రోజుల్లో తన భార్యతో కలిసి స్టేజ్ షోలు కూడా చేయాలని తమన్ భావిస్తున్నారట.. అలా చేయాలంటే ఆమె కనీసం 1,2 సూపర్ హిట్ పాటలు పాడి ఉండాలనే కండీషన్ పెట్టారు.
ఇక తమను కొడుకు అచ్యుత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడని, మొదటిగా నా ట్యూన్ అతనే వింటాడని, అలా విన్న తర్వాత అభిప్రాయం చెబుతాడు. అలాగే అచ్యుత్ కు సంగీతానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటంలో ఒక మంచి పట్టు ఉంది. పియానో వాయించడం లో నాలుగవ గ్రేడ్ కూడా పూర్తి చేశారు.. కానీ అతడు ఏ ప్రొఫెషన్ ను ఎంచుకుంటాడో..నాకు తెలియదని తమన్ చెప్పారు.








ఇప్పటికే తన 30 సంవత్సరాల సినీ కెరీర్లో దిగ్విజయంగా ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో చేశారు. కానీ ఆ ఒక్క హీరోయిన్ తో మాత్రం దూరంగా ఉన్నారట. ఆమె ఒకప్పుడు ఒక స్టార్ సీనియర్ హీరోయిన్. ప్రజెంట్ రాజకీయాల్లో చక్రం కూడా తిప్పుతున్నారు.
ఒకానొక సమయంలో ఆయన కంటే ఈమె ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని, వెంకీకి షాక్ ఇచ్చింది. అయితే వీళ్ల కాంబినేషన్లో ఓ సినిమా సెట్ అయిందట. స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వెంకీ తో కలిసి ఓ సినిమా చేద్దాం అనుకుని హీరోయిన్ తో చర్చలు కూడా నడిచాయని టాక్ వినిపించింది అప్పట్లో. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల వీరి కాంబినేషన్ సెట్ అవ్వడం లేదని అదే కథతో కొన్నేళ్ల తర్వాత మరో స్టార్ హీరోయిన్ తో సినిమా చేశారు.
ఆ స్టొరీ కూడా సేమ్ టు సేమ్ ఈ హీరోయిన్ కి వినిపించినట్లు అలాగే ఉందని, తనని వదిలేసి వేరే హీరోయిన్ ను పెట్టుకొని తీయవలసిన అవసరం ఏముందని వెంకటేష్ మీదికి కోపానికి వచ్చిందట. దీంతో వెంకటేష్ అదంతా నిర్మాతల నిర్ణయమని నా ప్రమేయం ఏమీ లేదని అన్నారని తెలుస్తోంది. దీంతో వీరి మధ్య ఉన్నటువంటి వార్ ఎక్కువైపోయి మౌనంగా ఉండి పోయారట.
అప్పటినుంచే వెంకటేష్ కు, ఆమెకు మధ్య మాటలు కట్ అయిపోయాయని సమాచారం. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా కలిపే ప్రయత్నం చేయలేదు.. ఎందుకంటే ఆమె మొండితనం అందరికీ తెలిసిందే.. మరి ఇప్పటికైనా వీరు కలిసి ఉంటారో లేదో చూడాలి.








మహేష్ బాబు వరుస హ్యాట్రిక్స్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. థియేటర్ లోకి వచ్చిన మొదటి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో తాజా కర్నూలు జిల్లాలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు నాకు అభినవ సంబంధాలు ఉన్నాయని, ఒక్కడు మూవీ చూసిన తర్వాత నేను దర్శకుణ్ణి అవ్వాలని భావించి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను అని నేను ఎంతగానో ఇష్టపడే సూపర్ స్టార్ తో సినిమా చేయడం, ఇక్కడికి రావడం నా లైఫ్ టైం బహుమతి అని అన్నారు.