సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.
అయితే, సమంత విడాకుల తర్వాత పెద్దగా ఇంటర్వ్యూలలో కనిపించడంలేదు. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా వచ్చిన సమంత, అందులో కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మాట్లాడలేదు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం మొదటి సారిగా ఈ విషయంపై స్పందించారు. ఫిల్మ్ ఫేర్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత విడిపోవడం పై మాట్లాడారు.
“నా సెపెరేషన్ తర్వాత నేను బాధతో చాలా వీక్ అయిపోతాను ఏమో అని అనుకున్నాను. కానీ నేను ఇంత స్ట్రాంగ్ అని మాత్రం అనుకోలేదు. నాకు తెలిసి చాలా మంది అంతే. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అని వారు తెలుసుకోరు. ఇవాళ నేను ఇంత స్ట్రాంగ్ అని తెలిసి గర్వ పడుతున్నాను. ఎందుకంటే ఇది నాకు నిజంగా తెలీదు” అని అన్నారు.
watch video: