తెలుగు తోపాటుగా తమిళం లో కూడా పలు విజయవంతమైన సినిమాలలో నటించిన హీరో ‘సిద్దార్థ్’ పై గత కొంత కాలంగా ఆయన పై కొన్ని అసత్య ప్రచారాలు , కొన్ని ప్రచురణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయన మరణించారు, ఇక లేరు RIP అంటూ గతం లో వార్తలు వైరల్ అవ్వడం అది కాస్త హీరో సిద్దార్థ్ వరకు వెళ్లడం, వాటిపైన ఆయన ఘాటుగా స్పందించడం వంటివి జరిగాయి. అంతే కాదు అలా వార్త ప్రచురించిన వారిపైన చర్యలు తీసుకుంటానంటూ కూడా హెచ్చరించారు. ఆ వార్తని ప్రచురించిన వారు కూడా తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణలు కూడా చెప్పారు.

hero-siddarth
అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ అయన పై అలాంటి పోస్ట్లు పెట్టడం ఆయనని కలచివేసింది. మరో మారు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే నిన్న ఉదయం బిగ్ బాస్ విజేత, బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్ల మరణించిన వార్త తెలిసిందే కానీ ఆయన ఫోటో కి బదులుగా హీరో సిద్దార్థ్ ఫోటో ని జత చేస్తూ పోస్ట్ చేసారు కొందరు. ఇలా ఈ సంఘటన హీరో సిద్దార్థ్ ని బాధపెట్టింది.
ఇక చాల కాలం తరువాత హీరో సిద్దార్థ్ హీరోగా తెలుగు లో ఒక సినిమా రానుంది ‘మహా సముద్రం’ అనే సినిమా లో హీరో శర్వానంద్ తో పాటుగా సిద్దార్థ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి Rx 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
https://twitter.com/Actor_Siddharth/status/1433423447783182338?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1433423447783182338%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Factor-siddharth-upset-over-his-rip-photos-circulated-in-social-media-530671.html












#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16











ఇది అందరికీ తెలిసిన విషయమే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ “పింక్” నుంచి రీమేక్ చేసారు. ఇదే సినిమా ను తమిళ్ లో అజిత్ రీమేక్ చేయగా.. అక్కడ మాస్ హిట్ అయింది. ప్రస్తుతం వకీల్ సాబ్ థియేటర్లలో బాగానే ఆడుతోంది. మరి ఫలితం తేలాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో కాటమరాయుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ్ వీరం కి రీమేక్. తమిళ్ వీరం లో అజిత్ హీరో గా చేసారు.
పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడిగా కనిపించిన సినిమా గోపాల గోపాల. ఇది హిందీ మూవీ ఓ మై గాడ్ కి రీమేక్. ఈ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది.
సల్మాన్ ఖాన్ హీరో గా వచ్చిన హిందీ సినిమా దబాంగ్. దీనికి తెలుగు రీమేక్ గబ్బర్ సింగ్. దబాంగ్ కు, గబ్బర్ సింగ్ కు చాలా తేడాలు కనిపిస్తాయి. గబ్బర్ సింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ ను తెలుగు లో తీన్ మార్ గా రీమేక్ చేసారు. పవన్, త్రిష ఈ సినిమాలో నటించారు. ఇది ఫ్లాప్ అయిన సంగతి అందరికి తెలిసిందే.
తమిళ సినిమా తిరుపచ్చి ని తెలుగు లో అన్నవరం గా రీమేక్ చేసారు. తమిళ తిరుపచ్చి లో హీరో విజయ్ నటించారు. ఈ సినిమా తెలుగు లో మాత్రం ఫ్లాప్ అయింది.
ఖుషి పవన్ కెరీర్ కి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి రికార్డ్స్ అన్నిటిని ఖుషి సినిమా తిరగరాసింది. ఇది తమిళ్ ఖుషి సినిమా నుంచి రీమేక్ చేసారు.
సుస్వాగతం సినిమా కూడా తెలుగు లో హిట్ అయింది. తమిళ సినిమా లవ్ టుడే నుంచి ఈ సినిమా ను రీమేక్ చేసారు.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా డీసెంట్ హిట్ అయింది. ఆ తరువాతే గోకులం లో సీత సినిమా వచ్చింది. ఇది కూడా హిట్ అయ్యి పవన్ ను ఫామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది. ఈ సినిమా ను తమిళ నట గోకులత్తిల్ సీతాయ్ నుంచి రీమేక్ చేసారు.