సినిమాల్లోకి వచ్చే ముందు ఆ రంగానికి చెందిన వాళ్లు అందరూ చాలా కష్టాలు పడతారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి లేదా కెమెరా వెనకాల పని చేసి ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిన నటులు ఎంతోమంది ఉన్నారు.
అయితే, కొంత మంది డైరెక్టర్లు కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. వివరాల్లోకి వెళితే, ప్రభాస్ ని స్టార్ గా చేసిన సినిమాల్లో మొదటిగా గుర్తొచ్చేది వర్షం. ఈ సినిమా ప్రభాస్ కి మూడవ సినిమా. ప్రభాస్ కి మొదటి సూపర్ హిట్ సినిమా కూడా ఇదే.
వర్షం సినిమాకి శోభన్ దర్శకత్వం వహించారు. త్రిష, ప్రభాస్ కాంబినేషన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ పాటలు కూడా ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, కింద కనిపిస్తున్న ఫోటో గమనించండి. ఇది సెకండ్ హాఫ్ లో ప్రభాస్, త్రిష విడిపోయి మళ్లీ కలిసిన తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న సీన్. వీరిద్దరి వెనకాల ఉన్న వ్యక్తిని గమనించారా? ఆ వ్యక్తి ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.
ఆయన ఎవరో కాదు. మహర్షి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. దాంతో ఒక సీన్లో అలా వంశీ పైడిపల్లి కనిపించారు. వంశీ పైడిపల్లికి, ప్రభాస్ కి కూడా చాలా మంచి స్నేహం ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మొదటి సినిమా కూడా ప్రభాస్ తోనే. 2007 లో వచ్చిన మున్నా సినిమాతో వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇటీవల వచ్చిన మహర్షి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి, తలపతి విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమా తర్వాత ఇంకొక సినిమా కథ పనిలో బిజీగా ఉన్నారు.