బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు.
ఇప్పటికే ఈ సినిమాలోని కుంకుమలా అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నో కారణాల వల్ల ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ నాగార్జున ఒక బాలీవుడ్ సినిమాలో నటించారు. అంతకు ముందు నాగార్జున కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించారు. క్రిమినల్ లాంటి సినిమాలతో అక్కడ కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ సినిమా మూడు భాగాలుగా విడుదల అవుతోంది. ఈ సినిమా మొదటి భాగం ఇప్పుడు విడుదల అవుతుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్ కి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు. అయితే తాజాగా సుమ కాష్ షో లో కూడా చిత్రబృందం వచ్చారు. క్యాష్ ప్రోగ్రాంలో కూడా రణ్ బీర్, ఆలియా భట్ ను తీసుకు వచ్చారు. బాలీవుడ్ స్టార్స్ ని తెలుగు షో కి రప్పించడం రాజమౌళికే చెల్లింది.
దీంతో చాలామందికి ఈ సినిమాని తెలుగులో రాజమౌళి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాని తెలుగు లో రాజమౌళి సమర్పిస్తున్నారు. దాంతో రాజమౌళి కూడా సినిమా బృందంతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ఈ సినిమా మీద రాజమౌళి చాలా నమ్మకంగా ఉన్నారు. కొన్ని సన్నివేశాలు కూడా రాజమౌళి మార్చి షూట్ చేసారు అంట. సినిమాని తెలుగులో హిట్ చేయాలని రాజమౌళి గట్టిగానే శ్రమిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో సంపర్పించడమే కాదు… మిత్రుడు బళ్లారి సాయి తో కలిసి ఆంద్రప్రదేశ్ లో బ్రహ్మాస్త్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా రాజమౌళి తీసుకున్నారు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. లాభాల్లో కొంత వాటా తీసుకోనున్నారు అంట…అందుకే ఈ సినిమాని తెలుగులో హిట్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి. మరి ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.
Also read: రణబీర్ కపూర్-అలియా భట్ నటించిన “బ్రహ్మాస్త్ర” ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఏవంటే..?