చాలా మంది మగవాళ్ళు ఈ మధ్యకాలంలో పెద్ద గడ్డాన్ని పెంచుతున్నారు. పూర్వ కాలంలో మనం చూసుకున్నట్లయితే మునులు వంటి వాళ్ళు గడ్డంని ఎక్కువగా పెంచేవారు. కానీ ఇప్పుడు పురుషులు బాగా పెద్ద గడాన్ని పెంచడానికి ఇష్ట పడుతున్నారు. పైగా అమ్మాయిలు కూడా గడ్డం ఉన్న అబ్బాయిలని ఇష్ట పడుతున్నారు. కొంత మంది పురుషులకి ఒత్తుగా గడ్డం పెరగదు. అటువంటి వాళ్ళు కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రెండ్ ని ఫాలో అవ్వడానికి.
మనం కనుక హీరోలు, స్పోర్ట్స్ మ్యాన్స్ ని చూసినట్లయితే వాళ్లు కూడా ఎక్కువ గడ్డం తోనే కనపడుతూ ఉంటారు. అదే ట్రెండ్ అని మగవాళ్ళు కూడా ఫాలో అయిపోతున్నారు. అయితే గడ్డం పెంచడం వల్ల ఆరోగ్యం కూడా బాగా ఉంటుందట. అదేమిటి గడ్డం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా…? అవునండి గడ్డం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి కోసమే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గడ్డాన్ని పెంచడం వల్ల చర్మ వ్యాధులు రావు. సాధారణంగా సూర్యుడి నుండి హానికరమైన యూవీ కిరణాలు వస్తూ ఉంటాయి. అయితే గడ్డం ఉండడం వల్ల ఆ యువీ కిరణాలు ముఖంపై డైరెక్ట్ గా పడకుండా ఉంటాయి. ఇలా గడ్డం చర్మ సమస్యల్ని రాకుండా చూసుకుంటుంది. దీనితో చర్మం కూడా నల్లగా అయిపోదు. కమిలి పోవడం మొదలైన సమస్యలు కూడా రావు.
ఇలా గడ్డం వల్ల మగ వాళ్ళు ఈ బెనిఫిట్ ని పొందొచ్చు. అదే విధంగా క్లీన్ షేవ్ చేసుకుంటే చర్మం మాయిశ్చర్ ని కోల్పోతుంది. ఇలా కోల్పోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అదే ఒకవేళ కనుక గడ్డాన్ని పెంచారు అంటే మంచిగా మాయిశ్చర్ ఉంటుంది. దీంతో మచ్చలు వంటివి రావు. చూసారా గడ్డం పెంచడం వల్ల మగవాళ్ళు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిని చదివితే ఎప్పుడు గడ్డాన్ని తీసేయమనే తల్లులు కూడా గడ్డాన్ని పెంచుకోమంటారు.