ఒకప్పుటి కాలంలో ఆడపిల్లలు పద్నాలుగు లేదా పదిహేను సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యేవారు. కానీ ప్రస్తుతం తొమ్మిది, మెచ్యూర్ పదేళ్లకే అవుతున్నారు. ఎక్కడో ఒక చోట కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు కనపడుతోంది.
చిన్న వయసులోనే మెచ్యూర్ కావడం వల్ల ఆడపిల్లలను ఎమోషనల్గా ఇబ్బంది పెట్టడమే కాకుండా, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నేటి తరంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే, తొందరగా మెచ్యూర్ అవుతున్న విషయం తెలిసిందే. అలా కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఆడపిల్లల తల్లులు ఏ వయసులో రజస్వల అవుతారో, వారి పిల్లలు కూడా దాదాపు అదే ఏజ్ లో మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అధిక బరువు ఉన్న ఆడపిల్లలు, తక్కువ బరువు ఉన్నవారి కన్నా త్వరగా మెచ్యూర్ అవుతారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే పిల్లలు, పాలు, మాంసం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినే పిల్లలు కూడా చిన్నవయసులో మెచ్యూర్ అవుతారని పరిశోధనలు చెప్తున్నాయి.
సుమన్ టీవిలో యోగా ట్రైనర్ సాహితీయోగ ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యుర్ అవ్వడానికి గల కారణం గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే అది కూడా తొమ్మిది, పది సంవత్సరాలకే మెచ్యూర్ అవడానికి ముఖ్య కారణం డీ విటమిన్ డెఫిషియన్సీ అని తెలిపింది. శరీరంలో విటమిన్ డీ లోపం ఏర్పడినపుడు చాలా సివియర్ పెయిన్స్ వస్తాయి.
ఒక్కోసారి ఆ పెయిన్ వల్ల కదలలేని స్థితి కూడా రావచ్చు అని అన్నారు. విటమిన్ డీ లోపం ఉందని తెలిసినపుడు ప్రతిరోజూ ఉదయం 8 గంటల కన్నా ముందు పదిహేను నిముషాల పాటు ఎండలో ఉండాలని, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో ఎండలో పదిహేను నిముషాల పాటు నడవడం లాంటివి చేయడం వల్ల శరీరానికి కావాల్సిన డీ విటమిన్ అందుతుందని తెలిపారు.
https://www.instagram.com/reel/Cu_2s6atMNe/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: నెలసరి ఆగిపోయే ముందు మహిళలలో కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసా..?