షాజహాన్ అంటే అందరికీ గొర్తొచ్చేది గొప్ప ప్రేమికుడు. అతడు తన భార్య ముంతాజ్ పై ప్రేమతో కట్టించిన తాజ్ మహల్ ఇప్పటికీ అద్భుత ప్రేమ చిహ్నంగా మారింది. అయితే షాజహాన్ కి అంతమంది భార్యలు ఉండగా.. ఆయనకి ఎందుకు ముంతాజ్ అంటేనే అంత ఇష్టం.. ఎందుకు ఆమె కోసం ఒక ప్రేమ చిహ్నాన్ని నిర్మించాడు అని చాలా మందికి వచ్చే ప్రశ్న. ఇప్పుడు వారిద్దరి ప్రేమ కథ గురించి తెలుసుకుందాం..
షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ అని అందరూ అంటుంటారు. కానీ ఆమె పేరు ముంతాజ్ ఉల్ జామాని. ఆమె అసలు పేరు అంజుమంద్ బాను. వారిద్దరూ పెళ్లి కి ముందే ప్రేమించుకున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత.. వారి పెళ్లి జరగడానికి ఐదేళ్లు పట్టింది. షాజహాన్ సవతి తల్లి నూర్జహాన్ మేనకోడలు ముంతాజ్. ఈ లోపు షాజహాన్ ఓ పారసీక రాకుమారిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ముంతాజ్ ని పెళ్లి చేసుకున్నాడు. ముంతాజ్ షాజహాన్ తో కాపురం చేసి వరుసగా పద్నాలుగు సార్లు ప్రసవించింది. పద్నాలుగో సారి బిడ్డను కనే ప్రయత్నంలో పురుటిలోనే ముంతాజ్ బుహాన్ పూర్ లో మరణించింది.
షాజహాన్ ఓ ప్రేమికుడు, ఓ భావుకుడు, ముంతాజ్ ని ఆరాధించడం మినహా అతను చేసిందేమీ లేదు. ఎప్పుడైతే ఆమె చనిపోయిందో అతను దాదాపు పిచ్చివాడయ్యాడు. రాజ్యపాలనను విస్మరించాడు. షాజహాన్ తాజ్ మహల్ సముదాయంలో తర్వాత ముంతాజ్ ను ఖననం చేసి గొప్ప సమాధి సౌధంగా మార్చారు. అయితే అందులో ఖననం చేసింది కేవలం ముంతాజ్ ను మాత్రమే కాదు షాజహాన్ ఇంకో భార్య సిర్హింద్ బేగంను కూడా అక్కడే ఖననం చేశారు. 1666 లో షాజహాన్ మరణించిన తర్వాత అతడ్ని కూడా అక్కడే ఖననం చేసారు.
భారతీయ, ఇస్లాం, పర్షియన్ వాస్తు సమ్మిశ్రితంగా నిర్మించిన తాజ్ మహల్, 400 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శోభాయమానంగానే ఉంది. తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేలమంది వాస్తు కళాకారులు, శిల్పులు, ఇతర పనివాళ్ళు పాల్గొన్నారు. 1983లో యునెస్కో “ప్రపంచ పూర్వా సంస్కృతి ప్రదేశం”గా తాజ్ మహల్ ను గుర్తించింది.