ఏ పాత్రనైనా అలవోకగా నటించగల విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ .సామాజిక సమస్యలపై గళం విప్పే సినిమా వాళ్ల జాబితాలో ప్రకాశ్ రాజ్ ది మొదటి పేరుంటుంది. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే ప్రకాశ్ రాజ్ రియల్ లైఫ్ హీరో అని ఎనో సార్లు ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఆయన చేసిన ఒక పని ఇప్పుడు నెటిజెన్ల ప్రశంసలు అందుకుంటుంది.

కరోనా సమయంలో రోజువారి ఉపాధి చేసుకొని డబ్బులు సంపాదించుకుని ఇల్లు గడిపించే వారికీ ఎంతో ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలో తన ఇంట్లో, ఫార్మ్ హౌస్ లో, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ ముందుగానే మే నెల వరకు జీతాలు చెల్లించారంట ప్రకాష్ రాజ్. అలాగే తాను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ప్రకాష్ రాజ్. నా శక్తి మేరకు నేను చేస్తాను. మీరు కూడా మీ చుట్టూ ఉండే వారిని ఆదుకోండి. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్టర్లో తెలిపారు.
#JanathaCurfew .. what I did today .. let’s give back to life .. let’s stand together. #justasking pic.twitter.com/iBVW2KBSfp
— Prakash Raj (@prakashraaj) March 22, 2020













చత్తీస్ గడ్ లో దంతెవాడ ప్రాంతం గురించి తెలిసిందే కదా . నక్సల్స్ భారిగా ఉండే ప్రాంతం . అదే విధంగా ఎక్కువగా ఎన్కౌంటర్స్ జరిగే చోటు. అలాంటి ప్రదేశంలో నక్సల్స్ చర్యలను సమర్దంగా తిప్పికొట్టడానికి కొంతమంది ఒక బృందంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం . ఆ బృందం పేరు దంతేశ్వరి లఢకే. ఈ బృందంలో సభ్యురాలే సునైనా పటేలే.







మాములు వ్యక్తిగా భావించిన అవ్వ “అయ్యా నా పేరు మంగమ్మ,నా వయసు 70 ఏళ్ళు ,రెండేండ్ల సుంది పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని వచ్చినా”ఆన్నది,అయితే ఆ అవ్వకు అయన ఎవరో తెలియదు. మాములు వ్యక్తిగా భావించిన ఆ అవ్వ తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పింది..వెంటనే ఆ కలెక్టర్ డీఆర్డీవో పీడీ సుమతితో ఫోన్లో మాట్లాడి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.ఎంతో ఓపికగా ఆమె సమస్య విన్నది కలెక్టర్ గారే అని తెలుసుకుని చివరికి అవ్వ ఆశ్చర్యపోయింది.
కలెక్టర్ మంచితనాన్ని మెచ్చుకొని అతనిని చల్లగా ఉండాలంటూ ఆశిర్వదించింది అవ్వ.ఈ సన్నివేశం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.ఈ న్యూస్ లోకల్ మీడియాలో వైరల్ గా మారింది,మెట్లపై కూర్చొని వృద్ధురాలితో మాట్లాడుతున్నప్పటి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు ఉండాలి అని కోరుకుంటున్నారు..తన హోదా ని మరిచిపోయి ఒక సాధారణ వ్యక్తి లాగా సహాయం చేసిన ఈ కలెక్టర్ ని మీరు కూడా అభినందిందండి,అందరికి షేర్ చేయండి.







