విఘ్నేశ్వరుడు అందరికి ప్రీతిపాత్రుడు. ఎటువంటి కార్యం తలపెట్టినా విఘ్నాలు ఎదురవకుండా కాపాడాలని గణపతిని కోరుతుంటాం. విఘ్నాలకు అధిపతి ఐన గణపతి కూడా భక్త సులభుడే. భక్తుల కోరికలను మన్నిస్తాడు. ఆయన విఘ్నాధిపతి కాబట్టి ఏ పనికి ఐన, పూజకు అయినా ముందు ఆయననే పూజిస్తాం. ఏ దేవుడిని పూజించాలన్నా.. ముందు గణపతిని తలచుకుని.. విఘ్నాలు రాకుండా చూడమని ప్రార్ధించి ఆ తరువాత పూజ చేసుకుంటాం.
s
గణపతి విగ్రహాలను మీరెప్పుడైనా గమనించారా..? కొన్ని విగ్రహాలలో తొండం కుడివైపుకు ఉంటుంది. మరికొన్నిటిలో ఎడమవైపుకు ఉంటుంది. అసలు తొండం ఇలా ఎందుకు ఉంటుందో ఈ ఆర్టికల్ లో చూద్దాము. గణపతి విగ్రహానికి తొండం తయారు చేసిన వ్యక్తులు డిజైన్ చేస్తారా? లేక దానికేమైనా ప్రాముఖ్యత ఉందా? అన్న సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. గణపతి విగ్రహానికి తొండం ఏ వైపుకు ఉంటె.. దాని అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
గణపతిని పూజించే విధానానికి ప్రతీక గా ఈ తొండాలను కూడా ఏ వైపుకు ఉంచాలి అనేది డిసైడ్ చేస్తారు.
తొండం ఎడమవైపుకు ఉంటె:
ఒకవేళ గణపతి విగ్రహానికి తొండం ఎడమవైపుకు ఉంటె.. అది గృహస్థులకు చాలా మంచిదట. ఎడమవైపుకు ఉంటె తొండం ఇడ నాడిని చూపిస్తూ ఉంటుందట.మానవులకు కూడా ఇడ నాడి ఎడమ నాసికా రంధ్రం వైపు ఉంటుంది. ఇడ నాడి చల్లదనాన్ని ఇస్తుంది.. దీనినే చంద్ర నాడి అని కూడా అంటారు. కాబట్టి ఎడమవైపుకు తొండం ఉండే గణనాధుని విగ్రహం మరింత శక్తిని, జీవితం లో ప్రశాంతతని అందిస్తుంది.

అలాగే ఈ విగ్రహాలు ఇంట్లో ఉండే వాస్తు దోషాలను కూడా సవరిస్తుంటాయని చెబుతుంటారు. అలాగే, శివపార్వతులతో కలిసి ఉన్న వినాయకుడి విగ్రహాలు లేదా పటాలు చూస్తే.. పార్వతి దేవి ఎడమవైపుకు కూర్చుని ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు లేదా పటాలను పూజించడం వలన కుటుంబ బంధాల్లో అనురాగం మరియు సంతోషం వెల్లివిరుస్తుంది.
తొండం కుడి వైపుకు ఉంటే:
కుడి వైపు తొండం వుండే వినాయకుడు చాలా అరుదుగా కనిపిస్తారు. వినాయకుడికి కుడివైపున తొండం ఉంటే.. ఆ వినాయకుడిని సిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. సిద్ధి వినాయకుడిని సక్రమం గా.. నియమ నిష్టలతో పూజిస్తే.. ఆయన త్వరగా కార్య సిద్ధిని ప్రసాదిస్తారు. ముంబై లో సిద్ధి వినాయక ఆలయం లో ఇలాంటి విగ్రహం ఉంది. అక్కడ నిజాయితీ తో కూడిన భక్తి తో ప్రార్ధిస్తే.. కార్య జయం కలుగుతుంది.

అయితే ఇటువంటి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే.. సంసారం నెట్టుకొస్తున్న వారు జీవితాల్లో ఆనందం కోసం కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. కఠినమైన నియమ నిష్టలతో కూడిన వాతావరణం గృహస్థుల ఇళ్లల్లో ఉండకపోవచ్చు. అందుకే.. ఇటువంటి విగ్రహాలు దేవాలయాలకు మాత్రమే పరిమితం. కుడి వైపు విగ్రహం పింగళ నాడిని లేదా సూర్యుని శక్తిని సూచిస్తుంది. సూర్యుని శక్తీ సృష్టిని చేయగలదు.. అలాగే వినాశనం కూడా చేయగలదు. కుడి వైపు తొండం ఉండే విగ్రహాలకు కూడా అంతే శక్తీ ఉంటుంది. ఈ వినాయకుడిని పూజించాలంటే తప్పనిసరిగా వేదం లో చెప్పబడ్డ ఆచారాలను పాటించాలి.
తొండం నిటారుగా ఉంటే:

ఇటువంటి వినాయక విగ్రహాలు చాలా అరుదు. ఈ విగ్రహాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. వినాయకునికి తొండం నిటారు గా ఉంది అంటే.. దాని అర్ధం సుషుమ నాడి తెరచి ఉంది. అంటే అన్ని శరీర ఇంద్రియాల మధ్య ఏకత్వం ఉందని అర్ధం. ఈ విగ్రహాన్ని పూజిస్తే.. భక్తులకు కూడా పూర్తి దైవత్వం లభిస్తుంది. అయితే కుడి వైపు తొండం ఉండే వినాయక విగ్రహాలను పూజించినంత కఠిన ఆచారాలు లేనివారు కూడా.. ఈ వినాయకుడికి సాధారణ పూజ చేసుకోవచ్చును. చాలా మంది ఇలాంటి వినాయక విగ్రహాలను తమ ఆత్మీయులకు బహుమతి గా ఇస్తుంటారు. కానీ.. ఇవి చాలా అరుదు గా దొరుకుతూ ఉంటాయి.













తిరుమలలో 7వ కిలో మీటర్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చర్చలకు దారితీస్తోంది. దానికి కారణం తిరుమల నడకదారిలో చిన్నారులపై చిరుత పులి దాడి చేయడం. రెండు సంఘటనలు జులై, ఆగస్ట్ నెలలో జరిగాయి. మొదటి సంఘటనలో జులై 23న బాలుడు కౌశిక్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి అరుపులకు భక్తులు వెళ్లడంతో చిరుత విడిచిపెట్టి వెళ్ళింది. ఆ బాలుడు చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్నాడు.
ఇదే ప్రాంతంలో ఆ తరువాత ఆగస్ట్ 11న కుటుంబంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన చిన్నారి లక్షిత చిరుత దాడి చేయగా ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించారు. టీటిడి అధికారులు దర్శనంలో కోసం నడకదారిలో వచ్చే భక్తుల భద్రత కోసం తగు చర్యలు చేపట్టారు. ఇక ఇదే ప్రాంతంలో 1980లో దారుణమైన సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.
తిరుమలలోని ఘాట్ రోడ్ 7 వ కిలోమీటర్ వద్ద ఒక మహిళను దారుణంగా హత్య చేశారట. ఆ మహిళ హత్య వల్ల కలిగే నష్ట నివారణ కోసం అక్కడ ఒక ఆంజనేయ విగ్రహాన్ని స్థాపించారు అప్పటి ఈవో పీవోఆర్కే ప్రసాద్. అప్పుడు మహిళా హత్య, ఇప్పుడు చిరుతపులి దాడి రెండు కూడా ఇదే 7వ కిలో మీటర్ సమీపంలోనే జరిగాయి.

సోదర సోదరీమణుల ప్రేమ, అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి నాడు అక్కాచెల్లెల్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఈ ఏడాది వచ్చిన పౌర్ణమి తిథి ఆగస్ట్ 30వ తారీఖు 10 గంటల 58 నిముషాల నుండి 31 వ తారీఖు ఉదయం 7 గంటల 5 నిముషాల వరకు ఉంది.. రాఖీని మంచి ముహూర్తంలో కట్టడం వల్ల సోదరుడికి మంచి జరుగుతుందని, భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదని చెబుతున్నారు.
భద్రకాలంలో రాఖీ కడితే ఆ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, భద్రకాలంలో సోదరుల చేతికి సోదరీమణులు రాఖీ కట్టకూడదని, భద్ర కాలం పూర్తి అయిన తర్వాతే రాఖీ కట్టాలని అంటున్నారు. భద్ర కాలం ఆగస్టు 30 బుధవారం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 వరకు ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో సోదరులకు రాఖీ కట్టడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.
రాఖీ పండుగను రాత్రి9:02 గంటల నుంచి 12 వరకు జరుపుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో ఆగస్ట్ 31 రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తమని పలువురు పండితులు చెబుతున్నారు. ఆగస్ట్ 31రోజు ఉదయం 5 గంటల 58 నిముషాల నుండి 7 గంటల 5 నిముషాల వరకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు.





ముందుగా పసుపుతో గణపతికిపూజా చేసి, ఆ తరువాత ఆ కలశం ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి, వరలక్ష్మీ దేవతను ఆవాహన చేయాలి. వరలక్ష్మీ కీర్తిస్తూ షోడశోపచారాలు, అష్ణోత్తరశత నామాలతో అర్చన చేయాలి. అనంతరం దీప, దూప, నైవేద్యాలను తాంబూలాలని వరలక్ష్మీ దేవికి సమర్పించాలి. ఆ తరువాత కర్పూర నీరాజనం, మరియు మంత్రపుష్పం సమర్పించాలి.

