ముక్కు పుడక కేవలం అందం పెంచడం మాత్రమే కాదు.. స్త్రీల ఆరోగ్యం విషయం లో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు.. ఆడవారికి ముక్కుపుడుకను బహుమానం ఇచ్చేవారు అయితే మేనమామ గాని లేక కాబోయే భర్త కానీ అయి ఉండాలంటారు. భర్త బహుమానం గా ఇచ్చే ముక్కుపుడక ఎంతో అపురూపమైనది. ఆడవారు పెళ్లి సమయం లో ధరించిన ముక్కు పుడకను అందుకే తీయరు. మంగళసూత్రాలలాగానే దానిని కూడా జాగ్రత్త గా కాపాడుకుంటూ ఉంటారు.

రాజుల కాలం నుంచి ముక్కుపుడక ఆభరణం గా వెలుగొందుతోంది. ఆడపిల్లలకు ఏడేళ్ల వయసు లో ముక్కు కుట్టించి బంగారు తీగతో చుట్టిస్తారు. ఆ తరువాత రంధ్రము ఏర్పడ్డాక రకరకాల రాళ్లు పొదిగిన ముక్కుపుడక ను ధరింప చేసేవారు. ముక్కుపుడక గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుని సతి సత్యభామ తన చెలికత్తెని రాయబారం పంపడానికి ఆమె ముక్కుపుడకనే లంచం గా ఇవ్వాల్సి వచ్చింది.

అలానే.. అంతటి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా కృష్ణానది కొండపై ఉన్న దుర్గమ్మ ముక్కెర ను తాకితే యుగాంతం తప్పదని సెలవిచ్చారు. ముక్కు పుడకకు అంతటి ప్రాముఖ్యత ఉంది మరి. అయితే.. ముక్కెర ధరించడం వలన శాస్త్రీయం గా ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం..
- మనం వాసనను ముక్కుతోనే చూస్తాం.. ఈ వాసన పీల్చే శక్తి లో పంచభూత తత్వాలు కలిసి ఉంటాయి. అందుకే చెడ్డ శక్తి ప్రవేశించకుండా ముక్కెర ధరిస్తారు.

- బంగారు ముక్కుపుడకలు ధరించడమే ఉత్తమం. ఎందుకంటే బంగారం శుద్ధమైనది. ఆడవారు వంట చేసే సమయం లో వారి ఉచ్వాస, నిశ్వాసాల నుంచి వచ్చే గాలి శుద్ధపడి ఆహరం పరిశుద్ధమవుతుంది.
- ముక్కుపుడక లేకుండా దైవ నివేదన వంట వండరాదని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే భారతీయ స్త్రీలు ముక్కుపుడక ధరించే ఉంటారు.
- ఇడ పింగళ నాడులు ప్రాణశక్తికి సంకేతం.. ఇవి కూడా ముక్కుపుడక ధరించడం వల్లనే ఆక్టివేట్ అవుతాయి.

- ఆడవారు ఎక్కువ శుభ్రపరిచే పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ సమయం లో సూక్ష్మక్రిములు కారణం గా వారి శరీరం లో చెడు గాలి చేరకుండా ఉండేందుకు వారికి ముక్కెర సాయపడుతుంది.
- మెదడు లోని నాడీ వ్యవస్థను కూడా ముక్కెర సరిచేయగలుగుతుంది.
- కంటికి కనపడని చెడు శక్తులను కూడా ముక్కెర అడ్డుకోగలదు.







అతనితో పాటు వచ్చిన అధికారులు భక్తుల చేతిలోని ప్రసాదంను విసిరేశారు. ఇది జరిగిన తరువాత మన్రోకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అనేక మంది వైద్యులు వచ్చినప్పటికీ మన్రో నొప్పిని తగ్గించలేకపోయారు. ఈ క్రమంలోనే మద్రాసు గవర్నమెంట్ మన్రోకి మంత్రాలయం వెళ్ళి పన్నులు వసూల్ చేయమని చెప్పింది. అప్పటికి రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయ్యి 100 సంవత్సరాలు అయ్యింది. మన్రో చెప్పు తీసేసి ఆలయం లోపలికి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక ఋషి ఇంగ్షీష్ లో మఠం గురించి చెప్తున్నాడు. ఆయన ఒక్క మన్రోకి మాత్రమే కనిపించాడు.
ఎంత ఎక్కువ తింటే అంత నొప్పి తగ్గి ప్రసాదం మొత్తం తినేసరికి కడుపునొప్పి తగ్గిపోయింది. తన తప్పుడు ఆర్డర్ తొలగించి భక్తులకు ప్రసాదం ఇవ్వడం పునఃప్రారంభించవలసిందిగా ఆలయ అధికారులను ఆదేశించాడు. సమీపంలోని కొడపాయల్ గ్రామం నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రసాదం తయారీ కోసం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రసాదాన్ని బుట్టలో కాకుండా గంగాళంలో సమర్పించాడు. అలా అప్పటి నుండి ప్రసాదాన్ని గంగాళంలో సమర్పిస్తున్నారు.
ఈ సంఘటనతో మన్రో మరియు అతని కుటుంబం శ్రీనివాసునికి అమితమైన భక్తులుగా మారారు. మన్రో పేరుతో కూడా ప్రసాదాన్ని సమర్పించేవారు. చేతులతో తింటే ఏ కలరా వస్తుందని మన్రో చెప్పాడో చివరి అదే కలరా సోకి మన్రో కర్నూల్ లోని పత్తికొండ అనే గ్రామంలో జులై 6, 1827 లో మరణించాడు.
































