శుక్రవారం రాత్రి హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ ఆక్సిడెంట్ జరిగింది. మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద తన స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుంటే ఈ ఆక్సిడెంట్ జరిగింది అంట. కేబుల్ బ్రిడ్జి నుండి ఐకియా జంక్షన్ కి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్పోర్ట్స్ బైక్ పై నుండి కింద పడిపోయారు. దీంతో ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు అంట. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ ధరించడంతో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. రోడ్ పై ఇసక ఉండడంతో బైక్ స్కిడ్ అయ్యిందని, తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని మాదాపూర్ ఏసీపీ తెలిపారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు తెలిపారు. సాయిధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తేజ్. ఆక్సిడెంట్ కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ విడుదలైంది.
watch video:
https://youtu.be/b9N390R_oFI