ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈ జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి ఎన్నో వేల స్కిట్లు, ఎందరో ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చిన వేదిక. ప్రతి గురు శుక్ర వారాల్లో తెలుగు ప్రజానీకానికి టీవీలకు అతుక్కుపోయేలా చేసే ఈ ప్రోగ్రాం. ప్రతి వారం లాగే ఈ వారం ప్రోమో కూడా వచ్చింది జబర్దస్త్ ప్రోగ్రాం లో పంచులు, ప్రాసలకి పెట్టింది పేరు హైపర్ ఆది తన పంచలకి ఆడియెన్స్ ని ఎప్ప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ఈ వారం వచ్చిన ప్రోమో లో తన స్టైల్ లో అలరించాడు హైపర్ ఆది.. మీరూ ఈ సరికొత్త ప్రోమో చూసేయండి మరి..
News
ప్రేమించింది.. పెళ్లి కోసం మతం మారింది.. చివరకు ఆ కారణం తో జైల్లో మగ్గుతున్న భారత డెంటిస్ట్.. అసలేమైంది..?
ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం పై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ పరిస్థితులు చాలా ఆందోళనకరం గా ఉన్నాయి. అక్కడి ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని దేశం వదిలి పారిపోతున్నారు. దేశం వదిలి వెళ్లలేని వారు ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్నట్లు బతుకుతున్నారు.
సాధారణ ప్రజల పరిస్థితే ఇలా ఉంటె.. ఇంకా జైల్లో ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఆ జైలులో భారత్ లోని కేరళ కు చెందిన ఓ మహిళ కూడా ఉంది. ఆమె దీన గాధ కన్నీళ్లు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, కేరళకు చెందిన తిరువనంతపురం నివాసి నిమిష బాగా చదువుకుంది. ఆమె తల్లి తండ్రులు బిందు, సంపత్ లు. నిమిష బిడిఎస్ చదివి డెంటిస్ట్ అయ్యింది. అయితే ఒకతన్ని ప్రేమించి.. అతని కోసం పెద్దలను ఎదిరించి మతం కూడా మార్చుకుంది.
అతన్నే పెళ్లి చేసుకుని ఫాతిమా గా తన పేరు ని మార్చుకుంది. 2016 లో ఆమె తన భర్త తో కలిసి ఆఫ్గనిస్తాన్ కు వెళ్ళిపోయింది. అక్కడే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఓ సారి కాల్పుల్లో ఆమె భర్త మరణించాడు. దీనితో ఆమెకు భయం పట్టుకుంది. పాపతో కలిసి ప్రభుత్వానికి లొంగిపోయింది. వారు ఆమెను ఉగ్రవాది గా పేర్కొని జైల్లో ఉంచారు. మరో వైపు ఆమె తల్లి బిందు కూతురు పరిస్థితి చూసి బాధపడి ఆమెను తిరిగి ఇండియా కు తీసుకురావాలంటూ ప్రభుత్వానికి దాదాపు 1882 సార్లు కోరింది.
కనిపించిన రాజకీయ నాయకులందరికీ ఆమె తన గోడు చెప్పుకుంటోంది. తన కూతురు ఉగ్రవాది కాదని.. ఆమె వల్ల దేశానికీ ఎలాంటి ముప్పు లేదని.. తన కూతురుని ఇంటికి తీసుకురావాలని ఆమె కోరుతోంది. ఆమె కూతురు తో పాటు మరో 20 మంది యువతులు కూడా ఆఫ్ఘన్ వెళ్లారని.. వారిలో కూడా ముగ్గురు మతం మార్చుకున్నారని ఆమె చెబుతోంది. వారు కూడా ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారని.. వారిని విడిపించాలని ఆ యువతుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
హైపర్ ఆది పంచ్ కి షాక్ అయిన ‘అనసూయ’ ఏంటయ్యా అంత మాట అనేసావ్ ?
జబర్దస్త్ తెలుగు రాష్ట్రాలలో పరిచయం లేని పేరు ఈ జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి ఎన్నో వేల స్కిట్లు, ఎందరో ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చిన వేదిక. ప్రతి గురు శుక్ర వారాల్లో తెలుగు ప్రజానీకానికి టీవీలకు అతుక్కుపోయేలా చేసే ఈ ప్రోగ్రాం. ప్రతి వారం లాగే ఈ వారం ప్రోమో కూడా వచ్చింది జబర్దస్త్ ప్రోగ్రాం లో పంచులు, ప్రాసలకి పెట్టింది పేరు హైపర్ ఆది తన పంచలకి ఆడియెన్స్ ని ఎప్ప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ఈ వారం వచ్చిన ప్రోమో లో తన స్టైల్ లో అలరించాడు హైపర్ ఆది..
jabardasth-latest-promo
‘గణేష్ మాస్టర్ జడ్జ్ మనో గారి ఫోటో పెట్టుకుని ఎంట్రీ ఇస్తాడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి డాన్సులు వేస్తూ వస్తుంటాడు. గణేష్ మాస్టర్ వేసే స్టెప్ కి మీనింగ్ ఏంటండీ అంటూ ఆటో రామ్ ప్రసాద్ అంటాడు దానికి ఆన్సర్ చేస్తూ అంటే నా లంచ్ లో రోటి పక్క ఉండాలండి అని అంటాడు. అనసూయ ఫోటో తో వచ్చిన మరో కంటెస్టెంట్ ‘ఆది ఏంటి నువ్ అస్సలు అని అనగా ‘సరేలే ఇప్పుడు కాదు ఇవన్నీ మేనేజర్ ని ఇప్పుడు అంటూ పంచ్ వేసి అలరిస్తాడు. ఆ డైలాగ్ తో ఒక్కసారిగా షాక్ అవుతుంది అనసూయ.
చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు.. తీరా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే యువతి ఆత్మహత్య.. అసలేమైందంటే..?
ఇటీవల కాలం లో ప్రేమ వివాహాలు ఎక్కువ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది స్కూల్ డేస్ లోనో, కాలేజీ డేస్ లోనో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకోవడానికి పెద్దలు ఒప్పుకోక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు గా కనపడుతున్నాయి. ఎంత ట్రూ లవ్ అయినా కూడా.. వివాహం వరకు వచ్చే ప్రేమ జంటలు తక్కువనే చెప్పాలి.
కానీ ఈ ప్రేమ జంట కథ వేరు. వివరాల్లోకి వెళ్తే, కేరళ పాలక్కాడ్ జిల్లా కు చెందిన వరవత్తూరులోని మన్నెంకోట్ కాంపౌండ్ కు చెందిన శివరాజన్, కృష్ణ ప్రభ ల ప్రేమ కథ వారి చదువుకునే రోజుల్లోనే మొదలైంది. కష్టపడి పెద్దలను ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే కృష్ణ ప్రభ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. ఈ ఘటన స్థానికం గా కలకలం రేపింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా.. కృష్ణ ప్రభ ఎటువంటి కట్నం తీసుకురాకపోవడం తో ఆమెకు అత్తింటివారి నుంచి వేధింపులు ఎదురయ్యాయని విచారణలో తేలింది. ఆమె చనిపోవడానికి శివరాజన్, అతని కుటుంబ సభ్యులే కారణమని కృష్ణ ప్రభ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ పరిస్థితి వేరే ఏ అమ్మాయికి రాకూడదు…సొంత బాబాయ్, అన్నే అలా చేయడంతో.?
సూర్యాపేట పరిధిలో ఇటీవల జరిగిన ఒక ఘటన చర్యలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, సమయం కథనం ప్రకారం, అనూష అనే 23 సంవత్సరాల యువతి తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అనూషకి ఒక చెల్లెలు కూడా ఉన్నారు. అనూషని తన పెదనాన్న చేరదీశారు. అనూష చెల్లెలిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. వారిద్దరూ అనూష చెల్లెలికి పెంచి పెద్ద చేసి అదే గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు.
image source : News 18 Telugu
అనూషని మాత్రం తన పెద్దమ్మ, పెదనాన్న పదో తరగతిలో చదువు ఆపించేసి ఇంటి పనులు, కూలీ పనులు చేయిస్తూ వేధించారు. అనూష బాబాయ్ భార్యకి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆమె శిక్షణకు వెళ్ళిన సమయంలో అనూష బాబాయ్ అయిన పగిడిమర్రి విజయ్ కి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దాంతో బాబాయ్ ని చూసుకునేందుకు వెళ్ళమని విజయ్ భార్య అనూషకి చెప్పారు. దాంతో అనూష తన బాబాయ్ ని చూసుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో విజయ్ అనూష ని బెదిరించి అనూషపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దాంతో అనూష గర్భవతి అయ్యారు.
representative image
గర్భవతి అయిన అనూష కి పెద్దమ్మ అబార్షన్ చేయించారు. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని అనూష పెదనాన్న కొడుకు అంజి కూడా లైంగికంగా వేధించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అనూష ఆగస్టు 14వ తేదీ నాడు పురుగుల మందు తాగారు. అనూష ని మొదట మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. తర్వాత పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్ కి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం అనూష కన్నుమూశారు. దాంతో అనూష చెల్లెలు, బంధువులే తనను లైంగికంగా వేధించడంతో తన అక్క ఆత్మహత్యకు పాల్పడింది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
image source : 10 TV
అనూష మరణం పత్తేపురం గ్రామం మొత్తాన్ని కుదిపేసింది. గ్రామస్తులు అందరూ నేరేడుచర్ల లో ఆందోళనకి దిగారు. పోలీసులు కేసుని తారుమారు చేశారు అని ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. అనూషని వేధించిన విజయ్ ని, అంజి ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనూష మృతికి ఆమె బాబాయ్, పెదనాన్న కొడుకు కారణం అని చెప్పారు. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత అనూషని అయినవారు ఒక పని మనిషిగా చూశారు అని ఆరోపించారు గ్రామస్తులు. ఎంతో సేవ చేసిన అనూషపై తన బాబాయ్ అలా అఘాయిత్యం చేయడం, అలాగే అన్న అనుకున్న వాడే అలాంటి పనులు చేయడం చాలా దారుణం అని అన్నారు.
Telangana Aasara Pension 2021: Apply online, Application Form, Eligibility, Status, Portal
The Chief Minister of Telangana, Shri K. Chandrasekhar Rao, has decided to introduce TS Aasara Pension Telangana. The Telangana Aasara pension scheme was started by the Chief Minister of Telangana State in the year 2014. This scheme was initiated to help disabled people including widows, HIV patients, the Chief Minister of Telangana K Chandrasekhar Rao promised to extend the benefit of this scheme to those people whose age is between 57 to 65 years. The last day to submit the application is 31st August 2021.TS Aasara Pension 2021 – Aasara Pension Telangana Online Registration, TS Aasara Pension Scheme Application Form PDF Download, Eligibility, Search List, Benefits, and Check Online Application Status at Official Website
Telangana Aasara Pension 2021 Apply
Documents required for Aasara Pension Scheme 2021
The list of these documents is as follows.
- Aadhaar Card
- Mobile Number (for OTP)
- Photograph
- Address Proof
- Proof of age
- Bank Account Passbook or Post Office Saving Account
- Bank IFSC Code
- Income Certificate
- Death certificate of late spouse in case of a widow
Search Telangana Pensioner Details 2021
People can track Telangana Aasara Pension Status using 2 methods – first is to search pensioner details, second is to check the status with an aadhar card
Telangana Aasara Pension 2021 Apply
Telangana Aasara Pension Scheme 2021 Eligibility Criteria
Telangana Aasara Pension 2021 Apply
Telangana Aasara Pension Scheme 2021 Application – Apply Online
- visit the official website of Greater Warangal Municipal Corporations.
- Once you open the official site, scroll down the page,
- Click on Pension Application, the new tap will open,
- Now enter Mobile Number,
- Enter the OTP to verify the Mobile Number
- Few details will be asked of you in the form, so fill in the detail in the form very carefully.
- Now you have to attach all the required documents with your form.
- After this, you will have to upload the documents like Aadhar card, FSC card, bank account passbook, property tax receipt, and self-declaration form.
- after entered Details and click on the “Submit” button.
- TS Aasara Pension online application will be completed.
Telangana Aasara Pension 2021 Apply
Telangana Pension Application >> Click Here
Search Telangana Pensioner Details >Click Here
Download Offline Application Form of TS Aasara Pension (PDF)
ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో… ఆ అవమానం భరించలేకే.. ఈ దంపతుల గాథ వింటే కన్నీళ్లే..!
కరోనా మహమ్మారి ఎన్ని కష్టాలను తీసుకొచ్చిందో చెప్పలేం. దాదాపు ప్రతి రంగానికి ఈ మహమ్మారి దెబ్బ తగిలింది. ఇక ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి మరింత దారుణం గా తయారైంది. స్కూల్స్ తెరుచుకోక, పాఠశాలలు నడపలేక ఇప్పటికే చాలా మంది అవస్థ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా దాదాపు నిరుద్యోగులైపోతున్నారు. కొందరు తమకు తోచిన ఉపాధిని వెతుక్కుంటున్నారు.
ఈ పరిస్థితిలో కర్నూలు జిల్లా కు చెందిన లైఫ్ ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తం గా కలకలం సృష్టిస్తోంది. సుబ్రహ్మణ్యం, మరియు అతని భార్య రోహిణి ఓ వివాహ వేడుక కు హాజరు అయి వస్తూ.. తిరిగి వస్తున్న దారిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియో ను రికార్డు చేసారు.
తమ చావుకు శ్రీను, బాలాజీ సింగ్ కుమారుడు, సుమన్, సునీల్ కుమార్ చేసిన వేధింపులేనని పేర్కొన్నారు. వీరిద్దరూ కోవెల కుంట్ల పట్టణం లో లైఫ్ ఎనర్జీ స్కూల్ అనే పాఠశాలను నడుపుతున్నారు. ఇందుకోసం కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్దే దాదాపు రెండు కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. కరోనా కారణం గా స్కూల్ నడిపే పరిస్థితి లేక అప్పులు తీర్చలేక అవస్థ పడ్డారు. మరో వైపు విద్యార్థుల తల్లితండ్రులు కూడా అమ్మ ఒడి డబ్బులు పడ్డాక ఫీజులు కడతామని చెప్పడం, అమ్మఒడి డబ్బులు పడిన తరువాత కూడా ఫీజులు కట్టకపోవడం తో వీరు నష్టాలపాలు అవ్వాల్సి వచ్చింది.
ఈ క్రమం లో అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకురావడం తో వీరు మనస్థాపానికి గురి అయ్యారు. వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ.. తమ ఆత్మహత్య కు కారణం ఎవరో చెబుతూ సెల్ఫీ వీడియో ను రికార్డు చేసారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే విషగుళికలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. కోవెల కుంట్ల కు వస్తూ దారిలోనే విషగుళికలు మింగడం తో అస్వస్థత కు లోనయ్యారు. బంధువులు వెంటనే అక్కడకి చేరుకొని వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. దారిలోనే వారు మరణించారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రమంతా కలకలం రేపుతోంది. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.! కానీ అంతలోపే.? కంటతడి పెట్టిస్తున్న సంఘటన.!
ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను కూడా ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అంతలోపే అనుకోని సంఘటన ఇరు కుటుంబాలలో విషాదం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే, సుమన్ టీవీ కథనం ప్రకారం నెల్లూరు జిల్లా, ఉండ్రాళ్ళ మండలం, గ్రామనత్తంకి చెందిన సౌమ్య, శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. ఇదే మాటని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ వారి కుటుంబాలు వారి పెళ్ళికి ఒప్పుకోలేదు.
కానీ చివరికి వారు వీళ్ళ ప్రేమని అర్థం చేసుకొని సౌమ్య, శ్రీకాంత్ పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే, శ్రీకాంత్ కి ఒక అన్నయ్య ఉన్నారు. అన్న పెళ్లి జరిగిన తర్వాత తన పెళ్లి చేస్తాము అని కుటుంబ సభ్యులు చెప్పారు. వీరిద్దరూ కూడా దానికి సరే అన్నారు. శ్రీకాంత్ పెళ్లిళ్ళ కి, ఫంక్షన్స్ కి ఎలక్ట్రికల్ డెకరేషన్ చేస్తుంటారు. ఆత్మకూరులో ఇలా ఒక డెకరేషన్ పని కోసం వెళ్లిన శ్రీకాంత్ ఎలక్ట్రికల్ షాక్ వల్ల మరణించారు.
ఈ విషయాన్ని సౌమ్య జీర్ణించుకోలేకపోయారు. దాంతో సౌమ్య కూడా తన ఇంట్లో ఉన్న పంటలకు వాడే మందు తాగేశారు. ఇది గ్రహించిన తన కుటుంబ సభ్యులు సౌమ్యని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే సౌమ్య మరణించారు అని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనతో
ఇరు కుటుంబాలలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్, సౌమ్య కి వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పిట్టల్లా రాలిపడిపోతున్న ప్రజలు.. దారుణం గా కాబుల్ ఎయిర్ పోర్ట్ లో పరిస్థితి..!
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రజాస్వామ్య దేశం అయిన ఆఫ్గనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల చేతిలో ఉంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి దేశం వదిలి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో పరిస్థితి అల్లకల్లోలం గా ఉంది. తాలిబన్లకు అధికారం దక్కడం తో.. అక్కడి ప్రజలు అయోమయం లో పడ్డారు. తేరుకుని.. ఆ దేశం నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ దేశం లో ఉండలేక.. బయటకు వెళ్లలేక చాలా అవస్థ పడుతున్నారు. కొందరు కార్ లలోనే వెళ్లిపోవాలని ప్రయత్నించారు. అయితే.. కాబుల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక్క ఫ్లైట్ మాత్రమే ఉంది.
ఆ ఫ్లైట్ లోనే అందరు అక్కడనుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. కాబుల్ ఎయిర్పోర్ట్ లో గుంపులు గుంపులు గా జనం దూసుకురావడం తో పరిస్థితి అల్లకల్లోలం గా మారింది. ఒక్క ఫ్లైట్ లోనే ఎక్కువ మంది ఎక్కడం తో.. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యిన వెంటనే జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇది వీడియోలలో కూడా రికార్డు అయింది.
ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒకప్పుడు.. ఫ్లైట్స్ కూడా ఆర్టీసీ బస్సుల్లా మారితే ఎలా ఉంటుంది అని మీమ్స్ వేసేవారు.. ఇప్పుడు ఇది నిజం గా జరుగుతుంటే ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఆఫ్గనిస్తాన్ ప్రజల పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. ఈ కింద వీడియోస్ ను చూడండి.. వారి పరిస్థితి ఎంత దారుణం గా ఉందో అర్ధం అవుతుంది.
https://www.instagram.com/reel/CSoX5SPJlef/?utm_medium=share_sheet
Karthika deepam: మోనిత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.! వైరల్ అవుతున్న కొత్త ప్రోమో.!
కార్తీకదీపం సీరియల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.
అయితే, సీరియల్ నుండి శోభా శెట్టి తప్పుకుంటున్నారు అనే వార్త కొంత కాలం నుండి వైరల్ అవుతోంది. ఇవన్నీ తప్పు అని కొట్టిపారేసే లాగా సీరియల్ కమింగ్ అప్ లో కొత్త ప్రోమో ఒకటి విడుదల చేశారు సీరియల్ బృందం. ఇందులో ఒక మహిళని వెనక వైపు నుండి చూపిస్తున్నారు.
ఆవిడ కళ్ళు మనకి కనిపిస్తాయి. ఈ ప్రోమో చూసిన వాళ్ళందరికీ ఆ మహిళ మరెవరో కాదు మోనిత అలియాస్ శోభా శెట్టి అని అర్థమైపోతుంది. దాంతో శోభా శెట్టి సీరియల్ వదలలేదు కంటిన్యూ అవుతున్నారు అని ఫ్యాన్స్ చాలా ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.