ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు , ఆకస్మిక మరణాలతో ఏమి చెయ్యాలో తెలియక తీవ్రంగా సతమతమవుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. కరోనా వైరస్ తన ఉగ్రరూపాన్ని దాల్చేవేళ ప్రధాని మోడీ 21 రోజుల కంప్లీట్ లాక్ డౌన్ ని ప్రకటించారు. మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ని ప్రకటించాక ముందే దేశంలో చాలా రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్ ని ప్రకటించేసాయి .
1.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5లక్షల 32 వేలు దాటింది. మరణాల సంఖ్య 24090 మందికి చేరింది. ఇక అమెరికాలో ఒక్కోరోజే 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు అప్రమత్తమయ్యారు,ఈ జబ్బు పెద్ద మహమ్మారి. యావత్ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది.
2.
ఒక ఊరికో, పల్లెకో, వ్యక్తికో పరిమితం కాలేదు. పరిమిత సమస్య కాదు. ఇది ప్రత్యేక సందర్భం, ప్రత్యేక పరిస్థితి, కాబట్టి అందరం అప్రమత్తంగా ఉండాలి.వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు, బయటకి వెళ్ళకండి కరోనా కి బలి కాకండి అంటూ నినాదాలు చేస్తున్నారు, సోషల్ మీడియా లో ట్రెండ్ అయిన కరోనా నినాదాలు.
3.
ఇళ్లల్లోనే ఉండం,డి గుంపులు గుంపులుగా తిరగకండి అని ఎన్ని రకాలుగా చెప్పినా, ఆఖరికి పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పినా వినని పరిస్థితి. ఎందరో చిన్నారుల అమ్మనాన్నలు డాక్టర్లుగా, పోలీసులుగా దేశ సేవలో ఉన్నారు . ఆ చిన్న పిల్లల బాధ కంటే మన సరదాలు ఎక్కువ కాదు . మిమ్మల్ని ఏం కోరారు ఆ ఇంటి దగ్గర ఉండండి అని మాత్రమే కదా.
4.
రోడ్ల మీదకి వచ్చేముందు ఒక్కసారి ఆలోచించండి..ఒకే ఒక్కసారి అమ్మానాన్నల కోసం ఎదురు చూసే చిన్నారుల ముఖాల్ని తలచుకోండి. వారి బాధని ఫీల్ అవ్వండి ,బయటికి వెళ్లడం మానండి.ఇంటి పట్టునే ఉండండి. ఆ చిన్నారుల కోసం వారికి వారి అమ్మానాన్నలని తొందరగా కలపడం కోసం మనం ఆ మాత్రం చేయలేమా?
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.