మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రస్తుతం ఎంత హల్చల్ అవుతుందో అందరికి తెలిసిందే. కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో నరికి నడి రోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. అయితే ప్రణయ్ పై దాడి జరిగిన సమయంలో అమృతవర్షిణి పక్కనే ఉంది. ఈ కేసులో మారుతీరావు A1గా, అతని తమ్ముడు శ్రవణ్ A2గా ఉన్నారు. ఈ కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నాడు.ఈ తరుణంలో ఆయన. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇప్పుడు మారుతీ రావు ఆస్తి వివరాలు బయటకి వచ్చాయి. ఆయన ఆస్థి సుమారు 200 కోట్లు ఉన్నట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అమృత పేరుతో ఓ హాస్పిటల్,స్కూల్, భార్య గిరిజ పేరుతో 10 ఎకరాల భూమి, తల్లి పేరుతో మిర్యాలగూడలో రెండు అంతస్థుల ఇల్లు హైదరాబాద్ కొత్తపేట్‌లో 400 గజాల ప్లాట్. అంతేకాక హైదరాబాద్ లో అయిదు అపార్ట్మెంట్ లు ఉన్నాయంట. మిర్యాలగూడలో షాపింగ్‌మాల్, ఈదులగూడెం క్రాస్ రోడ్డులో షాపింగ్‌మాల్.మిర్యాలగూడ బైపాస్‌లో 22 గుంటల భూమి. ఇవి ఛార్జ్ షీట్ లో ఉన్నవి. అలాగే అతనికి కొన్ని అప్పులు కూడా ఉన్నాయి అంట.
మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది. మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అమృత గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఆమె చివరి చూపు చూడలేకపోయింది.
తన తండ్రి మరణం తర్వాత అమృత సంచలన నిర్ణయం తీసుకుంది. భర్త లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన అమృత ప్రస్తుతం తల్లి విషయంలో బాధపడుతుంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన తల్లి కూడా ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోననే అమృత భయపడిపోతుందంట. తన తండ్రి చివరి కోరిక మేరకు అమృత తన తల్లి దగ్గరకి వెళ్లనుంది అంట. భర్త ఎలాగో పోయాడు.. తండ్రి కూడా పోయాడు.. ఇక మిగిలింది.. కన్నతల్లి కనుక ఆమెకోసమైనా ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుందంట.