మేకప్ మహిమలు మాములుగా లేవు. ముఖ కవళికలు ఎలా కావాలనుకుంటే అలా మార్చేసుకునే రోజులు వచ్చేసాయి. ముఖం ఎలా ఉన్నా.. కాస్త మేకప్ అద్దితే చాలు అందమైన వ్యక్తులలా తయారైపోతున్నారు. ఇక.. అమ్మాయిలు కూడా ఈ మేకప్ ని అడ్డు పెట్టుకుని మోసాలు కూడా చేసేస్తున్నారు. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అందులో తప్పులేదు.
కానీ, కొందరు అందాన్ని అడ్డుపెట్టుకుని అబ్బాయిలని మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఇటువంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘటనలో అమ్మాయి కాదు.. ఏకంగా 54 సంవత్సరాల వయసు ఉన్న మహిళ ఓ వ్యక్తిని మోసం చేసి పెళ్లి చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా, పుదుప్పేట కు చెందిన ఇంద్రాణి అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఇంద్రాణి కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పెళ్ళై విడాకులు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి రెండవ పెళ్లి చెయ్యాలని ఇంద్రాణి సంబంధాలు వెతుకుతోంది. గత ఆరేళ్లుగా సంబంధాలు వెతుకుతున్న ఆమెకు ఇటీవల తిరుపతికి చెందిన శరణ్య అనే మహిళ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా పరిచయమైంది.
అయితే.. ఆమె వయసు 54 సంవత్సరాలు అన్న విషయం వీరికి తెలియదు. ఆమెను చూడడానికి వస్తున్నామని కబురంపారు. దీనితో శరణ్య మేకప్ వేసుకుని 30 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలా వారి ముందు కూర్చుంది. ఆ అమ్మాయి కూడా ఇంద్రాణి కుమారుడికి నచ్చడంతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. తిరువళ్లూరులో భారీగా ఖర్చు చేసి పెళ్లి కూడా చేసారు. ఆమెకు ఇరవై ఐదు సవర్ల బంగారాన్ని ఎదురిచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. తీరా పెళ్లి చేసిన తరువాత ఆమె తన అసలు రూపం చూపించింది.
అత్తా, భర్తలను వేధించేది. శాలరీ మొత్తం తన చేతిలోనే పెట్టాలని చెప్పేది. బీరువా తాళాలను తన చేతికే ఇవ్వాలని, ఆస్తులను కూడా తన పేరు మీదకే రాయించాలని పోరు పెడుతుండేది. ఈ క్రమంలోనే అత్త ఇంద్రాణిని ఇంట్లోంచి వెళ్లగొట్టింది. ఈమె పోరు పడలేని భర్త ఆమె పేరు మీదకే ఆస్తి రాయిద్దామని ఆధార్ కార్డు ఇవ్వాలని కోరాడు. అయితే.. ఆధార్ కార్డు లో కేరాఫ్ రవి అని ఉండడాన్ని గమనించిన సదరు భర్తకి అనుమానం వచ్చింది. దీనితో, ఇంద్రాణి మరియు ఆమె కుమారుడు కలిసి కేసు వేశారు. పోలిసుల విచారణలో ఆమె వయసు 54 సంవత్సరాలని, ఆమెకు రవి అనే వ్యక్తితో ఇదివరకే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది.
భర్తతో గొడవపడి ప్రస్తుతం తల్లితో ఒంటరిగా ఉంటోందని తేలింది. రవి పై కూడా ఆమె కేస్ పెట్టి పది లక్షల రూపాయలను లాగేసింది అని కూడా తేలింది. అయితే.. సంపాదన లేని కారణంగా ఆర్ధిక ఇక్కట్లు మొదలవ్వడంతో పెళ్లిళ్ల బ్రోకర్ ను సంప్రదించి యువకులను మోసం చేసి డబ్బు గుంజుతోంది. ఈ క్రమంలోనే సుబ్రమణి అనే వ్యక్తికి సంధ్యగా పరిచయం అయ్యి పదకొండు సంవత్సరాలు కాపురం కూడా చేసింది. ఆ తరువాత కరోనా సమయంలో తల్లి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి.. తిరిగి రాకుండా అక్కడనుంచి తప్పించుకుంది. ఈ క్రమంలోనే ఇంద్రాణి కుమారుడి గురించి కూడా తెలియడంతో తనకింకా పెళ్లి కాలేదని చెప్పి తన పేరు శరణ్యగా పరిచయం చేసుకుని ఇంత కథ నడిపించింది.











ఇటీవల 26 వారాల గర్భవిచ్ఛిత్తికి పర్మిషన్ ఇవ్వమని కోరుతూ 27 సంవత్సరాల మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తనకు ఇద్దరు పిల్లలున్నారని, తాను మానసికంగా, శారీరకంగా మరో బిడ్డను కనడానికి సిద్ధంగా లేనని కోర్టుకు వివరించింది. మహిళ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అ-బా-ర్ష-న్కి పర్మిషన్ ఇచ్చారు. వైద్య పరంగా అ-బా-ర్ష-న్ కు అక్టోబరు 9న అనుమతిని ఇచ్చింది.
కానీ, ఆ తరువాతి రోజు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 26 వారాల సమయంలో అబార్షన్ చేసినట్లయితే ప్రాణాలకే ముప్పు అని నివేదిక ఇచ్చారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, చీఫ్ జస్టిస్ బెంచ్ కు పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నేడు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. తల్లి గర్భంలోని శిశువు గుండెను ఆపడానికి కోర్టు సుముఖంగా లేదని అన్నారు. ఇప్పటికే గర్భిణికి 26 వారాల, 5 రోజులు అని, ప్రస్తుతం ఈ గర్భం వల్ల తల్లికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
తల్లి హక్కు మరియు గర్భస్థ శిశువు హక్కు మధ్య సమతౌల్యం పాటించాలని అన్నారు. అ-బా-ర్ష-న్ కి పర్మిషన్ ఇస్తే ‘మెడికల్ టె-ర్మి-నే-ష-న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ’ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 5 లను ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. ఈ మహిళ ఎయిమ్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును గవర్నమెంట్ భరిస్తుందని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తరువాత తాను పెంచుకోవాలా లేదా ఎవరికైనా దత్తత ఇవ్వాలా అనే విషయం పై తల్లిదండ్రులు డిసిషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నెలరోజులు దాటిన ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు నిరసనలు, ఆందోళన తెలుపుతున్నారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా ఆయన మద్ధతుదారులు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు స్త్రీల మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలో వారిద్దరూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి నెల దాటినా, ఇప్పటికి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని వారి ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. చంద్రబాబు అరెస్టు పై ఇప్పటికీ రెస్పాండ్ కాలేదు అని తిడుతూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌ను వెళ్ళగక్కారు. వారిలో ఒక మహిళ, నోరు తెరిస్తే ధర్మం, హిందుత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రధాని,
తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అరాచకాల గురించి ఒక్కసారైన మాట్లాడలేదని అన్నారు. ఇండియా వరల్డ్ లో టాప్ 3 ప్లేస్ కి వచ్చిందని అంటారు. కానీ రోడ్ల పై నడిచే మహిళలకు టాయిలెట్లు కూడా లేని పరిస్థితిలో ఉందని ఇంకో మహిళ అన్నారు. ప్రపంచంలో 3 స్థానం కాదు, ముందు రోడ్ల పై వెళ్ళే స్త్రీల కోసం టాయిలెట్లు కట్టించి, గొప్పలు చెప్పుకోవాలి అని తన కోపాన్ని బయటపెట్టింది. వీళ్ల సీరియస్ చర్చను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలోని హామీలలో ఒకటైన ఆసరా పెన్షన్‌ను కూడా పెంచుతున్నట్టు ప్రకటించారు. రూ. 2016 గా ఉన్న పెన్షన్‌ను ఐదు వేలకు పెంచుతామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3000కు పెంచుతామని, ఆ తరువాత ఏడాది ఐదు వందల చొప్పున పెంచుకుంటూ, చివరి ఏడాది వచ్చే వరకు ఐదు వేలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ, ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పింఛన్ పథకాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. తాము ప్రకటించినపుడే, 2 వేల పింఛన్‌ను ప్రకటించి, సంవత్సరానికి 500 చొప్పున పింఛన్‌ను పెంచుతూ, ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్నారని వెల్లడించారు.
ఈ పథకాన్ని విజయవంతంగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని, తాము కూడా అదే పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.తమ పథకాల అమలులో దేశానికి తెలంగాణే ఆదర్శంగా నిలిచిందని ప్రతిసారి చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్, తానే స్వయంగా, ఏపీ గవర్నమెంట్ ని ప్రశంసించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఫాలో కానున్నట్టుగా కూడా ప్రకటించారని తెలుస్తోంది.
కానీ సోమవారం దాకా చంద్రబాబును అరెస్టు చేయవద్దని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీకి చెప్పారు. 17ఏ పై వాదనలు పూర్తి కాలేదు. అందువల్ల ఫైబర్ నెట్ కేసులో ఆర్డర్స్ ఇవ్వలేమని తెలిపారు. అయితే, సోమవారం నాడు చంద్రబాబు అరెస్ట్ చేయరని సీఐడీ తరపున ముకుల్ రోహత్గి హామీ ఇచ్చారు. ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారానికి వాయిదా వేయమని సమాచారం ఇస్తామని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఐటీ మేజర్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024 రెండవ త్రైమాసికంలో 6,333 మంది ఉద్యోగుల తగ్గి, మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కి చేరుకుంది. అయితే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7,186 తగ్గింది. టీసీఎస్ మొదటి త్రైమాసికంలో కేవలం 523 మంది ఉద్యోగుల్ని మాత్రమే కొత్తగా తీసుకుంది. అయితే ఉద్యోగుల వలసలు (అట్రిషన్ రేటు) 17.8 శాతం – 14.9 శాతానికి తగ్గిపోయింది.
టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గుదలతో ఐటీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో అయితే ఉద్యోగుల సంఖ్య వరుసగా పెరుగుకుంటూ వెళ్ళేది. ఈ కంపెనీలో సగానికిపైగా ఉద్యోగులు దాదాపు 2020 తర్వాత చేరారని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుకుంటూ వెళ్తోందంటే ఇది ఐటీ రంగానికే ప్రమాదం అని తెలుస్తోంది. ఇక ఐదే విధంగా ఇతర ఐటీ సంస్థలు అయిన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రోలో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గేపోయే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ అయిన అసెంచర్ ఇటీవల ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. కేవలం 951 మంది ఎంప్లాయీస్ ను మాత్రమే కొత్తగా తీసుకున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్లనే ఈ విధంగా జరుగుతున్నట్లుగా పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.