కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో విచిత్రాలు కనబడుతూ ఉంటాయి వాటిని నమ్మడానికి కూడా మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ అవి నిజంగా జరుగుతూ ఉండే విషయాలు అవ్వచ్చు. పైగా కొన్ని భయంకరమైన విషయాలు కూడా మనకి సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.
మామూలుగా శ్మశానం అంటే మనందరికీ భయం వేస్తుంది ముఖ్యంగా చీకటి పడ్డాక స్మశానంపేరు ఎత్తితే చాలు మనకి వణుకు పుడుతుంది కానీ ఒక వ్యాపారి మాత్రం 26 సమాధుల మధ్య టీ కొట్టు ని నడుపుతున్నాడు.

ఏమిటి స్మశానవాటిక మధ్యలో టీ కొట్టు అని ఆశ్చర్యపోకండి.. నిజంగానే స్మశానం మధ్యలో ఒక వ్యక్తి టీ కొట్టు నడుపుతున్నాడు. మరి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే …60 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి 26 సమాధుల మధ్య టీ కొట్టు ని నడుపుతున్నాడు. పైగా ఈ టీ తాగితే అదృష్టం వస్తుందని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ టీ కొట్టు ఉంది ఒక స్మశానవాటికలో ఈ ముస్లిం వ్యాపారి రన్ చేస్తున్నాడు. దీని పేరు లక్కీ టీ స్టాల్. ఈ హోటల్లో సమాధులకి అటు ఇటు బల్లలు ఉంటాయి.

ఈ బల్లల మీద శాకాహారం మాత్రమే వడ్డిస్తారు. రోజు ఈ టీ కొట్టు లో ఉండే సమాధులను క్లీన్ చేస్తారు. పైగా వాటి మీద పూలని కూడా ఉంచుతారు. మొదట్లో ఈ టీ కొట్టు యజమాని అబ్దుల్ రజాకా మన్సూరి బండి మీద టీ అమ్ముతూ ఉండేవాడు. క్రమంగా వ్యాపారం పెరగడం వలన సమాధుల మధ్యనే టీ కొట్టు నడపడం మొదలుపెట్టాడు. ఆరు దశాబ్దాల నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. ఈ కొట్టు కి రాడానికి ఎవరికీ భయం ఉండదు. ఎందుకంటే చుట్టూ దుకాణాలు ఉంటాయి ఇక్కడ భారతీయ చైనీస్ వంటకాలు బాగా ఫేమస్.

సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారంగా బెంగళూరులో ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటల 17 నిముషాలకు ‘ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ క్యాంపస్‌లో అరవై నుంచి నూట ఇరవై సెకండ్ల పాటు పొడవాటి వస్తువుల యొక్క నీడ కనిపించలేదు. ఈ అరుదైన దృశ్యాన్ని ఎంతో మంది చూశారు. అయితే ఇలాంటి దృశ్యాన్ని చూసే అవకాశం హైదరాబాద్ వాసులకు కలగబోతుందట.
బెంగుళూరులో ఏప్రిల్ 25న జీరో షాడో డే ఏర్పడినపుడు సుమారు 3 నిమిషాల పాటు నీడ కనిపించలేదు. బెంగుళురు వాసులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించారు. జీరో షాడో డే చూసే అరుదైన అవకాశం హైదరాబాద్ వాసులకు మే 9న మధ్యాహ్నం 12 గంటల 12 నిముషాలకు కలగనుంది. సాధారణంగా అయితే కర్కాటక రాశి, మకర రాశి మధ్యన ఉండే ప్రాంతాలలో ఈ జీరో షాడో ఏర్పడుతుంది. దానివల్ల ఈ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనంలోనూ సూర్యుడి క్షీణత అక్కడ ఉండే అక్షాంశానికి ఈక్వల్ గా ఉంటుంది.
ఆ టైమ్ లో సూర్యుడి కిరణాలు భూమి పైన నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి. దానివల్ల నిలువుగా ఉండే ఏ వస్తువులు కానీ, జీవులు నీడను ఏర్పచదు. ఇలాంటి సంఘటన సంవత్సరంలో 2 సార్లు సంభవిస్తుంది. రీసెంట్ గా బెంగళూరులో జీరో షాడో డే ఏర్పడింది. మే 9న హైదరాబాద్ లో ఆవిష్కృతం కానుంది. శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లో మే 9న జీరో షాడో డే పగలు 12 గంటల 12 నిముషాలకు ఏర్పడనుందని వెల్లడించారు. గతంలో జీరో షాడో డే 2021లో ఒడిశా, భువనేశ్వర్ లో ఏర్పడింది.
కొరియోగ్రాఫర్ చైతన్య బలవన్మరణానికి ఆర్ధిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. అప్పుల బాధను భరించలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నట్లు మరణానికి ముందు చైతన్య సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో తన బలవన్మరణానికి కారణాలను వెల్లడించాడు. కొరియోగ్రాఫర్‌గా మంచి భవిష్యత్ ఉన్న డాన్స్ మాస్టర్ చైతన్య ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిచివేసింది.
చైతన్య మరణం పై పలువురు టెలివిజన్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ మరణం పై డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ తాజాగా స్పందించారు. ఆయన మరణం పై విచారం వ్యక్తం చేసింది. చైతన్య తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో ఆయన ఫ్యామిలీ అంతా బాధపడుతోంది. చైతన్య డబ్బులు ఇవ్వవలసిన వారితో కూర్చుని తన పరిస్థితి వివరించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని అన్నారు.
అందరూ చైతన్యతో కలిసి జర్నీ చేసినవారే. అందులోనూ కళాకారులు వేధించే అంత కఠినమైనవారు కాదు. ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో, చైతన్య తోటివారికి సహాయం చేసేవాడని తెలిపింది. నాలుగు రోజుల క్రితమే డాన్స్ మాస్టర్ చైతన్యను కలిసి ఢీ డ్యాన్స్ షోలో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగానని, దానికి ఆయన నెక్స్ట్ సీజన్ లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన తన కింద ఉన్న డాన్సర్లకు కూడా చాలా గౌరవం ఇస్తారని డ్యాన్సర్ ఝాన్సీ తెలిపారు.





















వివాహం చేసుకునే యువతుల మొదటి ఛాయిస్ కూడా ఇటువంటి అబ్బాయిలే. అమ్మాయిలే కాకుండా వారి తల్లి దండ్రులు తమ కుమార్తెలకి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిల సంబంధం వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఓ తండ్రి మాత్రం బీటెక్ చదివిన అమ్మాయిని పాప్ కార్న్ బండి నడిపే కుర్రాడికిచ్చి పెళ్లి చేశాడు. ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకుండా ఉన్నప్పటికి ఇది వాస్తవం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రాజమండ్రికి చెందిన సుధీర్ అనే యువకుడు నగరంలోని గాంధీ పార్కుకి వెళ్ళే రోడ్డు పక్కనే పాప్ కార్న్ బండి నడుపుతూ ఫ్యామిలిని పోషిస్తున్నాడు. పాప్ కార్న్‌తో మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్‌ను కూడా బండి పై అమ్ముతుంటాడు. ఆ బండి వద్ద దొరికేవి రుచిగా ఉండటంతో ఎప్పుడూ కస్టమర్లతో ఆ బండి దగ్గర రద్దీగా ఉంటుంది. అయితే సుధీర్ బీటెక్ ట్రిపుల్ ఈ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని అంటే నమ్మి 10 లక్షలు అప్పు తెచ్చి కట్టాడు.
ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న సుధీర్ చేసిన అప్పులు తీర్చాలని, తన ఫ్యామిలిని కూడా పోషించాలని అనుకున్నాడు. అలా పాప్ కార్న్ బండి పెట్టుకుని 7-8 ఏళ్లగా నడుపుతూ సగం అప్పులను తీర్చాడు. ప్రస్తుతం అతని బిజినెస్ సాగుతోంది. కుటుంబ పోషణలోను ఎలాంటి ఇబ్బంది లేదు. వయసు పెరుగుతోందని సుధీర్ కి పెళ్లి చేశారు. పాప్ కార్న్ బండి నడిపేవాడికి పిల్లనిస్తారా అనుకున్నారు. అయితే సుధీర్ కి బీటెక్ చదివిన యువతితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిపించింది ఆ అమ్మయి తండ్రే కావడం విశేషం.
అమ్మయి పెళ్లి చేసుకోవడానికి సందేహించిన కుమార్తెను ఒప్పించి మరి పెళ్లి చేశాడు ఆ తండ్రి. జాబ్ చేసేవాడి కంటే కష్టపడి పనిచేసేవాడే బాగా చూసుకుంటాడు. ఆ అబ్బాయితో నీ లైఫ్ బాగుంటుందమ్మా’ అని ఆ తండ్రి కూతురిని ఒప్పించాడు. ఆ అమ్మాయి తండ్రి డిగ్రీ పూర్తి చేశారంట. కొంత కాలం జాబ్ కోసం ప్రయత్నించి, జాబ్ రాకపోవడంతో ఆటో నడపటం ప్రారంభించాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలనుకున్న సుధీర్ ఆఖరికి పాప్ కార్న్ బండి పెట్టుకొని, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పులు తీరిన తరువాత తన బిజినెస్ ను పెంచుకునే ఆలోచనలో సుధీర్ ఉన్నాడు.













1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్‌లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్‌ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:

