ఇప్పటి వరకు భర్తని కోల్పోయిన కోడలికి పెళ్లి చేసిన అత్తమామలను మనం చూసాం. కానీ ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని మనం ఇప్పటి వరకు చూసి ఉండం. అతనికి భార్య లేదు. ఆమెకు భర్త లేడు. వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒకరిని మరొకరు ఇష్టపడ్డారు. ఒంటరిగా జీవించడం కంటే కలిసి జీవితాన్ని పంచుకోవడం బెటర్ అనుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరికీ మధ్య ఉన్న బంధం గురించి తెలిసిన అందరూ షాక్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో పెళ్లి చేసుకున్న వాళ్లిద్దరూ ఎవరో కాదు సొంత మామ, కోడలు. ఈ పెళ్లి వేడుకకు బంధు,మిత్రులు కూడా హాజరయ్యారు. ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన 70సంవత్సరాల కైలాష్ యాదవ్ తన కోడలు పూజ అనే 28సంవత్సరాల మహిళను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి జరిగిన పెళ్లి వైరల్ గా మారింది. వారి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

70సంవత్సరాల వృద్ధుడు కైలాష్ యాదవ్ బదల్గంజ్ పోలీస్ స్టేషన్లో వాచ్మెన్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి నలుగురు సంతానం. 12ఏళ్ల క్రితం తన భార్య చనిపోయింది. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తన మూడో కుమారుడు చనిపోయాడు. అతని భార్యే పూజ. కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ఒంటరిగా ఉంటోంది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అంతే సమాజం ఏమనుకున్నా..తమ మధ్య సంబందాన్ని తప్పు పట్టినా లెక్క చేయకుండా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం గుడిలో ప్రదక్షిణలు చేసి భార్యగా చేసుకున్న కోడలి నుదుటన తిలకం దిద్దాడు కైలాష్ యాదవ్.

42 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నా ఇరువురి అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. పెళ్లి సమయంలో గ్రామస్తులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సమాజంతో సంబంధం లేకుండా వీరిద్దరి పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు, పూజ కూడా తన కొత్త సంబంధంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ వివాహం గురించి వైరల్ కావడం వల్లే తమకు తెలిసిందని స్టేషన్ ఇన్ఛార్జ్ బర్హల్గంజ్ చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని ఆయన తెలిపారు.














ఇంకొందరు ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు రెస్టారెంట్స్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. వేలకు వేలు బిల్లులు అయినా కూడా కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. కాగా, డిల్లీలోని లజపత్ నగర్ లో ఉండే లజీజ్ రెస్టారెంట్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బిల్లును చూసిన వారు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, అది ఒక రెస్టారెంట్ బిల్లు, అందులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ దాల్ మఖనీ,షాహిపన్నీర్, రైతా మరియు కొన్ని చపాతీలు ఆర్డర్ చేసారు. అయితే మొదటి రెండు వంటకాలకు(దాల్ మఖనీ, షాహిపన్నీర్) 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు. ఆశ్చర్యానికి గురి చేసేటు వంటి విషయం మొత్తం బిల్లు కేవలం 26 రూపాయలు. అంటే అప్పట్లో బిల్లులు చాలా తక్కువ. ప్రస్తుత ధరతో పోలిస్తే ఒక చిప్స్ ప్యాకెట్ రేటుకి సమానం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరలయ్యింది.


