“మేము వెళ్లిపోతున్నాం. మా కొడుకు, కూతురుని జాగ్రత్తగా చూసుకోండి. మా కూతురు చాలా అమాయకురాలు. మేము మీకు డబ్బులు ఇవ్వలేదని తనని ఏం అనొద్దు. మా అత్తను, అమ్మను బాగా చూసుకోండి. పిల్లలు మిమ్మల్ని ఎవరు ఏమన్న పట్టించుకోవద్దు. ఇక మేము వెళ్లిపోతున్నాం..” అంటూ ఓ దంపతులు ఏడుస్తూ చివరి సారిగా తీసుకున్నసెల్ఫీ వీడియో లో తెలిపారు.
ఆ వీడియో ని తమ కుమారుడికి, ఇంకా కొందరు బంధువులకు పంపి ఫోన్ లు స్విచ్ఛాఫ్ చేసి అప్పటి నుంచి కనిపించకుండాపోయారు. ఆ వీడియో లోని వ్యక్తిని చిత్రాడ వరప్రసాద్ గా గుర్తించారు. విశాఖ పరిధిలోని వడ్లపుడిలో ప్రాంతంలో ఉన్న తిరుమలనగర్ లో చిత్రాడ వరప్రసాద్ (47), మీరా (41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. ఇటీవలే తమ కుమార్తె కి వివాహం చేసారు ఈ దంపతులు.

గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోను చూసిన ఈ దంపతుల కుమారుడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగు, ఓ సెల్ ఫోనును గుర్తించారు.

చివరికి ఆ దంపతుల మృతదేహాలు బుధవారం లభ్యం అయ్యాయి. ముందుగా భర్త, ఉక్కు ఉద్యోగి వర ప్రసాద్ మృతదేహం.. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి రాజుపాలెం దగ్గరలోని ఏలేరు కాలువ వద్ద దొరికింది. ఆ తర్వాత కాసేపటికే అదే కాలువకు మరికొంత దూరంలో భార్య మృతదేహం కూడా గుర్తించారు పోలీసులు.

వరప్రసాద్, మీరా కుమార్తెకు గతేడాది వివాహం జరిగింది. ఇటీవలే ఆమెకు ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే కుమారుడు కృష్ణ సాయి తేజ బ్యాటరీ దుకారణం నిర్వహిస్తున్నాడు. అయితే కరోనా సమయం నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమంత బాలేదు. ఈ సెప్తాహ్యం లో వార ప్రసాద్ భారీ మొత్తాల్లో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు ఎక్కువై తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.
















కొత్త రీల్స్ అనగానే ప్రజలకు గుండెల్లో అలజడి ఏర్పడుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని ఆందోళన పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మారినప్పుడు కొన్ని వస్తువుల రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో టాక్స్ స్లాబ్స్, ఇంపోర్ట్ డ్యూటీలలో మార్పులు రావడంతో వస్తువుల రేట్లలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం..
ధరలు పెరుగే వస్తువులు ఇవే:
ధరలు తగ్గే వస్తువులు ఇవే:
Also Read: 











అనుకున్నదే తడవుగా ఇండియాలోని తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా, వేరే దేశాలలోని తీర్థయాత్రలకు కూడా రత్నమ్మ తీసుకెళ్తూ ఆమె కోరికను నెరవేరుస్తున్నాడు. ఇక అమ్మ కోరిక నెరవేర్చడం కోసం కృష్ణకుమార్ ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. 2018లో తల్లిని స్కూటర్ పై తీసుకొని ప్రయాణం మొదలు పెట్టిన కృష్ణ కుమార్, ఇప్పటి దాకా రత్నమ్మ కు ఎన్నో పుణ్య క్షేత్రాలను, ప్రాంతాలను కూడా చూపించాడు.
అయితే 2020లో కరోనా కారణంగా వీరి తీర్థయాత్రలకు బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గడంతో 6 నెలల నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమార్ అమ్మకి గైడ్ గా మారి పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాడు. అలా ఇప్పటివరకు స్కూటర్ పై దాదాపు 66 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు.
కర్ణాటక ఒడిశా, తమిళనాడు, ఏపీ, చత్తీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మాత్రమే కాకుండా బూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలలోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. తాజాగా తెలంగాణాలోని బాసర సరస్వతి పుణ్య క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంలో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన తల్లి కలను నెరవర్చడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
Also Read: 













