దర్శకుడుగా రాజమౌళి అపారమైన గుర్తింపును సంపాదించారు. ఎంత అంటే అతనితో ఒక్క సినిమా అన్నా చేయాలి అని నటీనటులు , ఆయన దర్శకత్వంలో వచ్చే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలని నిర్మాతలు తహతహలాడేంత. చిత్ర పరిశ్రమలో రాజమౌళి అంటేనే ఒక బ్రాండ్ గా ముద్ర పడింది.
కానీ ఆయన సక్సెస్ ను చూసి ఆనందించే భాగ్యం అతని తల్లికి కలవకపోవడం ఆయన జీవితంలో ఎప్పుడు తీరని కొరతగా మిగిలిపోయింది. రాజమౌళి కుటుంబంలో దాదాపు అందరూ సినీ ఫీల్డ్ లోని తమ వంతు కృషి చేస్తూ మంచి గుర్తింపు సంపాదించారు. కానీ ఆయన తల్లి గురించి ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా ప్రస్తావన వచ్చింది లేదు.
ఇవి కూడా చదవండి:వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఏం జరుగుతుందో తెలుసా..? అసలు హైబ్రిడ్ వర్క్ అంటే ఏంటి..!?

తరువాత విజయేంద్ర ప్రసాద్ తన భార్య యొక్క దురదృష్టకర మరణాన్ని గుర్తుచేసుకుని బాధపడ్డారు. సడన్ గా స్ట్రోక్ రావడం వల్ల ఆమె కోమాలోకి వెళ్లారు. తరువాత ఆమె దాదాపు 6 నెలల పాటు కోమాలో కాలం గడిపారని వెల్లడిస్తూ ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. రాజమౌళి తల్లి గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది. కానీ ఆమె తన విజయం తన బిడ్డ విజయం చూసి ఉంటే బాగుండేది అని ఆయన పేర్కొన్నారు.

ఆమె కోసం ప్రత్యేకించి తమ ఇంటిలో ఒక గదినే హాస్పిటల్ రూమ్ లాగా తయారు చేయించారు. కోమాలో ఉన్నప్పటికీ ఆయన భార్య తన మాటలకు స్పందించేదని ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించే వాడిని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆమె కోమాలో ఉన్న సమయంలో సాధ్యమైతే పూర్తి ఆరోగ్యంతో బయటపడాలని లేకపోతే సుఖంగా ఆమెను తీసుకెళ్లాలని ఆయన అనుకున్న విషయం గురించి అందరితో చెప్పారు.

తన భార్య తనతో భౌతికంగా లేకపోయినా మానసికంగా ఆమె ఎప్పుడూ అతనితోనే ఉంటుందని తన సక్సెస్ ని చూసి ఆమె ఎప్పుడూ గర్విస్తుందని అభిప్రాయపడ్డారు. తన భార్య గురించి తలుచుకొని రోజు క్షణం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి: శ్రీదేవి డ్రామా కంపెనీ: డాన్స తో అదరగొట్టిన బస్ కండక్టర్ రియల్ లైఫ్ కన్నీటి కష్టాల గురించి తెలుసా.?



















