కొన్ని కొన్ని చిక్కు ప్రశ్నలు చూడగానే అర్ధం కావు. వాటిని తీక్షణం గా గమనిస్తే తప్ప అర్ధం అవ్వదు. కానీ ఒక్కసారి చిక్కుముడులు విప్పేసినా.. లేదా ఏదైనా పజిల్ ని సాల్వ్ చేసినా మన మైండ్ కి కొత్త ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటిదే ఈ కింద ఇవ్వబడిన ఫోటో కూడా. ఈ ఫోటో ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేష్ పాండే షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఈ ఫోటో లో చిరుత ఎక్కడ ఉందొ గుర్తించాల్సింది గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేష్ పాండే సవాల్ విసిరారు. అప్పటి నుంచి ఆయన పోస్ట్ కింద నెటిజన్లు కామెంట్స్ తో కొట్టేసుకుంటున్నారు. రాళ్ల లాగ కనిపిస్తున్న ప్రాంతం చిరుత చర్మాన్ని పోలి ఉండడం తో.. చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టడం కొంత కష్టం గానే ఉంది. ఇంతకీ మీరు కనిపెట్టగలిగారా..?
ఒకవేళ మీకు కూడా చిరుత ఎక్కడ ఉందో కనిపించకపోతే.. పైన ఫోటో లో మార్క్ చేయబడిన ప్రాంతాన్ని చూడండి. చిరుత కనిపిస్తుంది. ఇటువంటి సవాళ్లు చిన్నవే అయినా మైండ్ కి రిలాక్స్ గా ఉంటాయి కదా..